CM Reanthreddy: దేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల్లో తెలంగాణ ముందు ఉందన్నారు సీఎం రేవంత్‌రెడ్డి. ఇక హైదరాబాద్ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో ఒకటిగా చెప్పుకొచ్చారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిలో దేశ విదేశాల నుంచి అత్యధిక పెట్టుబడులు వచ్చాయన్నారు.
తాను మొదట తెలంగాణ, హైదరాబాద్ రైజింగ్ అని చెప్పినప్పుడు చాలామందికి తెలియదు, ఇప్పుడు ప్రపంచం అంగీకరిస్తోందన్నారు సీఎం. ఇప్పుడు హైదరాబాద్ రైజింగ్ ఆగదు అని ప్రజలు అంటున్నారని గుర్తు చేశారు. ఉద్యోగ కల్పనలో నంబర్ వన్‌గా నిలిచామన్న ముఖ్యమంత్రి, ఈ విషయం గర్వంగా చెబుతున్నామన్నారు.
హైదరాబాద్ మాదాపూర్‌లో హెచ్‌సీఎల్ టెక్ కొత్త క్యాంపస్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. తెలంగాణను ఒక ట్రిలియన్ డాలర్ల జీడీపీ మారుస్తానని చెప్పినప్పుడు అది సాధ్యం కాదని కొందరు చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. రెండుసార్లు దావోస్ టూర్‌లో రూ.41,000 కోట్లు, రూ.1.78 లక్షల కోట్ల ఎంవోయూలపై సంతకాలు జరిగాయన్నారు.
ఆనాడు తాను చెప్పిన మాటలు ఇప్పుడు అక్షరాలా సాధ్యమైందని నమ్ముతున్నట్లు చెప్పారు సీఎం. తెలంగాణ రైజింగ్‌ను ఎవరూ ఆపలేరని, మా పోటీ ముంబై, ఢిల్లీ, బెంగళూరు, చెన్నైతో కాదన్నారు. ఈ విషయం తాను చెప్పినప్పుడు కొంతమంది అది పెద్ద కలనే అవుతుందన్నారు. ఈవీ అడాప్షన్‌లో హైదరాబాద్‌ను నంబర్ వన్‌గా చేశామన్నారు.
ALSO READ: తెలంగాణలో మూడు వేల ఈవీ బస్సులు
రాష్ట్రాన్ని డేటా సెంటర్లు, గ్రీన్ ఎనర్జీ, లైఫ్ సైన్సెస్, బయో టెక్నాలజీ, స్కిల్స్, మ్యానుఫ్యాక్చరింగ్, అగ్రి ప్రాసెసింగ్ హబ్‌గా మారుస్తున్నట్లు వివరించారు. ప్రపంచంలో అతిపెద్ద లైఫ్ సైన్సెస్ కంపెనీల్లో ఒకటైన ఆమ్జెన్‌ను ఇటీవలే ప్రారంభించామన్నారు. అలాగే ప్రపంచంలో అత్యుత్తమ సమావేశాల్లో ఒకటైన బయో ఆసియా-2025 సదస్సును ఘనంగా నిర్వహించామన్నారు.
గ్లోబల్ కంపెనీగా హెచ్‌సీఎల్ టెక్ దేశానికి గర్వకారణంగా నిలిచిందన్నారు. 2.2 లక్షల మంది ఉద్యోగులతో 60 దేశాల్లో ఆపరేట్ చేస్తోందన్నారు. ఇక డిజిటల్, ఇంజినీరింగ్, క్లౌడ్, ఏఐ రంగాల్లో వరల్డ్ క్లాస్ ఆఫరింగ్స్ క్రియేట్ చేస్తున్నారు. పుష్కర కాలం కిందట హైదరాబాద్‌కు వచ్చిన హెచ్‌సీఎల్ అంచలంచెలుగా ఈ స్థాయికి ఎదిగిందన్నారు సీఎం రేవంత్ రెడ్డి.
“Today, #Hyderabad and #Telangana is the fastest growing city and the state in the #entire #country .”🔥
CM @revanth_anumula Garu speaks at the #Inauguration ceremony of #hcltech KRC campus.@INCTelangana #TelanganaNews #TelanganaRising pic.twitter.com/ZndctqoaJ9— CM Revanth Anna (@CmRevanth48787) February 27, 2025