BigTV English

Revanth Reddy: రాజులు ఏ రంగంలోనైనా రాణిస్తారు.. ఎందుకంటే..: సీఎం రేవంత్ రెడ్డి

Revanth Reddy: రాజులు ఏ రంగంలోనైనా రాణిస్తారు.. ఎందుకంటే..: సీఎం రేవంత్ రెడ్డి

Kshatriya: క్షత్రియ సేవా సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అభినందన సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ క్షత్రియులపై ప్రశంసలు కురిపించారు. హైదరాబాద్‌లోని అన్ని రంగాల అభివృద్ధిలో వారి పాత్ర ఉన్నదని, హైదరాబాద్ నగర అభివృద్ధిలోనూ వారి పాత్ర ఉన్నదని తెలిపారు. రాజులు ఏ రంగంలోనైనా రాణిస్తారని, ఇందుకు ప్రధాన కారణం వారి శ్రమ, పట్టుదలే అని వివరించారు. కఠోరమైన శ్రమ, పట్టుదల కారణంగా వివిధ రంగాల్లో క్షత్రియులు రాణించారని తెలిపారు.


సినీ రంగంలో కృష్ణం రాజు ఉన్నత స్థాయికి ఎదిగారని, ఇప్పుడు హాలీవుడ్‌తో పోటీ పడేలా బాహుబలి ప్రభాస్ రాణిస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి బోసురాజు అత్యంత క్రియాశీల పాత్ర పోషించారని వివరించారు. టికెట్ రాకున్నా కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కష్టపడి పని చేశారని, ఆయన కష్టాన్ని రాహుల్ గాంధీ గుర్తించి మంత్రిని చేశారని చెప్పారు.

నిబద్ధతతో పని చేస్తే గుర్తింపు ఉంటుందనడానికి బోసు రాజు, శ్రీనివాస వర్మలు ఉదాహరణ అని సీఎం రేవంత్ అన్నారు. ‘మీలో ఎవరికైనా రాజకీయాల్లో రాణించాలని ఉంటే వారిని ప్రోత్సహించండి. వారికి తప్పకుండా అవకాశం ఇస్తామని క్షత్రియ సోదరులకు మాట ఇస్తున్నాను. మీ తరఫున తెలంగాణ ప్రభుత్వంలో సలహాదారుగా శ్రీనివాస రాజు ఉన్నారు. మీ సమస్యలను వారి ద్వారా నా దృష్టికి తీసుకురండి. యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ కో చైర్మన్‌గా శ్రీనివాస రాజును నియమించాం. క్షత్రియులపై మాకున్న నమ్మకానికి ఇది నిదర్శనం, అల్లూరి సీతారామరాజు, కొమురం భీమ్ స్ఫూర్తితోనే మేం ప్రజా సమస్యలపై కొట్లాడాం’ అని రేవంత్ రెడ్డి వివరించారు.


Also Read: BRS Party: గు‘లాబీయిస్ట్’ ఆఫీసర్స్.. ఇకనైనా మారండి సార్..!

ఫ్యూచర్ సిటీలో పెట్టుబడులు పెట్టాలని రాజులందరికీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపు ఇచ్చారు. ప్రభుత్వం వారికి సహకారం అందించడానికి సిద్ధంగా ఉన్నదని తెలిపారు. క్షత్రియ భవన్‌కు కావాల్సిన స్థలం, అవసరమైన సహకారం తమ ప్రభుత్వం తప్పుకుండా అందిస్తుందని వివరించారు.

నానక్‌రాం గూడ్ షెరటాన్ హోటల్‌లో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సీఎల్పీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, రాజ్యసభ అభ్యర్థి అభిషేక్ మను సింఘ్వీ, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీ దీపాదాస్ మున్షిలు హాజరయ్యారు. అభిషేక్ మను సింఘ్వీని ఎమ్మెల్యేలకు పరిచయం చేశారు. నానక్‌రాం గూడ షెరటాన్ హోటల్ వద్ద మీడియాతో మాట్లాడుతూ మంత్రి సీతక్క, మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిలు బీఆర్ఎస్ పై విమర్శలు గుప్పించారు.

Related News

Weather News: కొన్ని గంటల్లో ఈ ఏరియాల్లో భారీ వర్షం.. ఇక రాత్రంతా దంచుడే

Nagarjunasagar flood: నాగార్జునసాగర్‌ గేట్లు ఎత్తివేత.. సందర్శకులకు బిగ్ అలర్ట్!

Hyderabad Rains: అమీర్‌పేట ముంపు ప్రాంతాల్లో సీఎం రేవంత్ పర్యటన.. అధికారులకు కీలక ఆదేశాలు

Malreddy Ranga Reddy: రంగారెడ్డి ఎమ్మెల్యే మల్‌రెడ్డి కుటుంబంలో రాఖీ పండుగ రోజే విషాదం

Rain News: భారీ వర్షం.. ఈ జిల్లాల్లో కుండపోత వాన.. ఇళ్ల నుంచి బయటకు రావొద్దు

Guvvala Balaraju: బీజేపీలో చేరిన గువ్వల.. కేటీఆర్‌పై హాట్ కామెంట్స్..

Big Stories

×