First Woman Driver: కష్టపడితే ఫలితం అదే వస్తుందని నిరూపించింది మహిళ సరిత. ఈ విషయంలో ఎవరు ఎన్ని అనుకున్నా పట్టించుకోలేదు. తాను అనుకున్నది సాధించింది. తెలంగాణలో తొలి ఆర్టీసీ మహిళా డ్రైవర్ రికార్డులకు ఎక్కింది. ఢిల్లీలో కూడా ఈమె డ్రైవర్‌గా విధులు నిర్వహించింది కూడా.
మహిళలు.. ఒకప్పుడు కొన్ని రంగాలకు మాత్రమే పరిమితమయ్యేవారు. ఇప్పుడు అన్నిరంగాల్లో తమ సత్తా చాటుతున్నారు. టూ వీలర్స్ మొదలు ఆర్టీసీ బస్సులు వరకు అన్ని వాహనాలను సైతం నడుపుతున్నారు. తెలంగాణ మొదటి ఆర్టీసీ మహిళా డ్రైవర్‌గా సరిత రికార్డులకు ఎక్కింది. ఇంతకీ సరిత ఎవరు? ఆమెను ప్రొత్సహించిందెవరు? ఇంకాస్త లోతుల్లోకి వెళ్తే..
విధుల్లోకి చేరిన ఆర్టీసీ డ్రైవర్ సరిత, తొలిరోజు హైదరాబాద్ నుంచి మిర్యాలగూడకు బస్సు నడిపింది. బస్సులు నడపడంతో ఆమెకు తిరుగులేదు. గతంలో ఢిల్లీలో బస్సు డ్రైవర్ పని చేసిన అనుభవం ఈమె సొంతం. సరిత సొంతూరు భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం సీత్య తండా. దేశంలో తొలి మహిళా బస్సు డ్రైవరుగా రికార్డులకు ఎక్కింది.
నల్గొండ జిల్లాలో మారుమూల కొండల ప్రాంతాల మధ్య ఓ చిన్న తండాలో జన్మించింది గిరిజన బాలిక వాంకుడోతు సరిత. సరితకు నలుగురు అక్కలు ఉన్నారు. వారు వివాహాలు కావడంతో అత్తవారిళ్లకు వెళ్లిపోయారు. చివరకు కుటుంబాన్ని పోషించే బాధ్యత సరిత నెట్టి మీద పడంది. ఏడో తరగతి తర్వాత ఆర్థికభారంతో చదువు ఆపేసింది.
ALSO READ: రాష్ట్రంలో భారీ వర్షం.. ఈ జిల్లాల్లో పిడుగులు పడే ఛాన్స్
దేవరకొండకు వెళ్లి మగ పిల్లాడి మాదిరిగా జుట్టు కట్ చేయించుకుంది. తొలుత ఆటో నడపడం నేర్చుకుంది. ఇదే క్రమంలో చదువును ఏ మాత్రం నిర్లక్ష్యం చేయలేదు. చదవులు లేకుంటే లైఫ్ ఉండదని భావించింది. ఆ తర్వాత ఓపెన్ స్కూలులో పదో తరగతి పూర్తి చేసింది. తనకున్న అనుభవంతో హెవీ వెహికిల్ డ్రైవర్ లైసెన్సు దక్కించుకుంది.
సొంతంగా ఆటో లేకపోవడంతో హైదరాబాద్‌కు మకాం మార్చింది. ఓ ప్రైవేటు స్కూలు బస్సు డ్రైవరుగా పని చేసింది. చివరకు హైదరాబాద్‌లో ఓ మహిళా అధికారి ప్రొత్సహంతో ఢిల్లీకి వెళ్లి కారు డ్రైవరుగా పని చేసింది. కొన్నిరోజుల తర్వాత ఢిల్లీ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్-DTCలో పదేళ్ల కిందట అంటే 2015లో బస్సు డ్రైవరుగా ఉద్యోగానికి అప్లై చేసింది.
సీఎం కేజ్రీవాల్ చేతుల మీదుగా అపాయింట్‌మెంట్ అందుకుంది. సరిత తల్లిదండ్రులు తండ్రి రామ్‌కోటికి 80 ఏళ్లుకాగా, తల్లి రుక్కకి 75 ఏళ్లు. పేరెంట్స్ ఇద్దరు సంస్థాన్ నారాయణపురం మండలం సీత్యా తండాలో జీవితం సాగిస్తున్నారు. తల్లిదండ్రులు వయోవృద్ధుడు అయ్యారు. ఇటీవల తల్లికి కాలు విరిగింది.
పేరెంట్స్‌ని చూసేవాళ్లు ఎవరు లేక ఢిల్లీలో డ్రైవర్ ఉద్యోగం వదిలి తండాకు వచ్చేందుకు రెడీ అయ్యింది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తన కష్టాలను మంత్రి కోమటిరెడ్డికి సరిత వివరించింది. తమకు జీవనాధారం లేదని ఆర్టీసీలో డ్రైవర్ ఉద్యోగం ఇప్పించాలని కోరుతూ నల్గొండ ప్రజాదర్బార్ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిని కలిసి వేడుకుంది.
స్పందించిన ఆయన, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఆర్డీసీ ఎండీ సజ్జనార్‌తో మాట్లాడారు. చివరకు ఆమె కలలు ఫలించాయి. కష్టాలు నిత్యం ఉండవు అనే చెప్పడానికి సరిత ఒక ఎగ్జాంఫుల్. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నుంచి ప్రశంసలందుకుంది సరిత.
TGSRTCలో తొలి మహిళా బస్ డ్రైవర్ గా సరిత
తెలంగాణ ఆర్టీసీలో తొలి మహిళా బస్ డ్రైవర్ గా విధుల్లో చేరిన భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం సీత్య తండాకు చెందిన సరిత
తొలిరోజు హైదరాబాద్ నుంచి మిర్యాలగూడకు బస్ నడిపిన సరిత
గతంలో ఢిల్లీలో డ్రైవర్ గా విధులు నిర్వర్తించిన సరిత… pic.twitter.com/MhCdtjP8sV
— BIG TV Breaking News (@bigtvtelugu) June 15, 2025