CM Revanth Reddy: తెలంగాణలో విద్యా వ్యవస్థను బలోపేతం చేయడంపై రేవంత్ సర్కార్ దృష్టి సారించింది. ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్లు, ప్రభుత్వ పాఠశాలలపై ఫోకస్ చేశారు. ఈ నేపథ్యంలో విద్యా కమిషన్ రూపొందించిన నివేదికను సీఎం రేవంత్‌రెడ్డి అందజేసింది.
శనివారం ముఖ్యమంత్రి నివాసంలో రేవంత్ రెడ్డితో సమావేశమయ్యారు విద్యా కమిషన్ ఛైర్మన్, సభ్యులు. విద్యా వ్యవస్థ బలోపేతంపై కమిషన్ రూపొందించిన నివేదికను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి అందజేశారు. కీలక విషయాల గురించి చర్చించారు కమిషన్ సభ్యులు. ముఖ్యంగా ప్రీప్రైమరీ నుంచి యూనివర్సిటీ స్థాయి వరకు సాంకేతిక విద్యతో పాటు సమగ్ర విద్యా విధానాన్ని రూపొందించారు.
కమిషన్ ప్రస్తావించిన అంశాలపై లోతుగా సమీక్ష చేశారు సీఎం. రాష్ట్రంలో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లతో పాటు అన్ని ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి చేపట్టాల్సిన చర్యలను కమిషన్ సభ్యులు ప్రస్తావించారు. ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పెండింగ్ బిల్లులు, పాఠశాల నిర్వహణ సమస్యల గురించి ప్రస్తావించారు.
విద్యా విషయాల్లో అన్ని సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు ముఖ్యమంత్రి. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు ఏర్పాటు చేయడంతోపాటు, విద్యా వ్యవస్థను బలోపేతం చేసేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామన్నారు. విద్యా విధానాన్ని మరింత పటిష్టం చేసేందుకు నియోజకవర్గాల వారీగా తీసుకోవాల్సిన చర్యలు, సమగ్ర విధానాలను రూపొందించాలని కమిషన్‌కు సూచించారు.
ALSO READ: ఒక్కమాటతో సలీమా జీవితాన్ని కాపాడిన సీఎం రేవంత్
అన్ని సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు సీఎం రేవంత్‌రెడ్డి. కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి, సభ్యులు ప్రొ. పీఎల్ విశ్వేశ్వరరావు, చారగొండ వెంకటేష్, జ్యోత్స్నా శివారెడ్డి, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి ఈ సమావేశంలో పాల్గొన్నారు.
విద్యా కమిషన్ చైర్మన్, సభ్యులతో జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష..
హాజరైన సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి, సభ్యులు
రాష్ట్రంలో విద్యా వ్యవస్థ బలోపేతంపై కమిషన్ రూపొందించిన నివేదికను ముఖ్యమంత్రికి అందించిన చైర్మన్, సభ్యులు… pic.twitter.com/mORonUxkYm
— BIG TV Breaking News (@bigtvtelugu) February 22, 2025