CM Revanth Reddy: నేడు తన జన్మదినం కాదని, మూసీ పునరుజ్జీవం పాదయాత్రతో తన జన్మదన్యమైందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. మూసీ పునరుజ్జీవంలో భాగంగా తన పుట్టినరోజు నాడు మూసీ పరివాహక ప్రాంతాలలో సీఎం రేవంత్ రెడ్డి పాదయాత్ర నిర్వహించారు.
ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ వరప్రసాదిని మూసీ నది పరివాహక ప్రాంత ప్రజలు పడుతున్న ఇబ్బందులు అన్నీ, ఇన్ని కావన్నారు. ఇక్కడి మహిళామ తల్లులు తమ సంతానం ఫ్లోరైడ్ బారిన పడితే, ఆ కష్టాలు తలుచుకుంటేనే తనకు కన్నీళ్లు వస్తున్నాయన్నారు. అలాగే ఇక్కడి రైతులు వ్యవసాయమే మానేసి వలసలు పోయే స్థితికి వచ్చారని, మూసీ కాలుష్యంతో పరివాహక ప్రాంత ప్రజలు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని, కాంగ్రెస్ ప్రభుత్వం పునరుజ్జీవానికి ముందడుగు వేసిందన్నారు.
ఎవరెన్ని కుట్రలు పన్నినా, మూసీ నది పునరుజ్జీవాన్ని అడ్డుకోలేరని, తెలంగాణ బిడ్డగా మూసీ పరివాహక ప్రాంతాన్ని అభివృద్ధి చేసి ప్రజల కన్నీళ్లు తుడుస్తానన్నారు. ఈరోజు ఎవరో అధికారం ఇస్తే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాలేదని, ప్రజల ఓట్ల తో విజయఢంకా మోగించామన్నారు. జనవరి మొదటి వారంలో వాడపల్లి వద్ద పాదయాత్ర ప్రారంభిస్తానని, ఇది కేవలం ట్రైలర్ మాత్రమేనని, అసలు సినిమా ముందుందంటూ సీఎం రేవంత్ అన్నారు.