Trolls On Vishwak Sen : తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న యంగ్ హీరోస్ లో విశ్వక్సేన్ ఒకరు. వెళ్ళిపోమాకే సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు విశ్వక్. వాస్తవానికి ఈ సినిమా వచ్చినట్లు కూడా చాలామందికి తెలియదు. తరుణ్ భాస్కర్ దర్శకత్వం వహించిన ఈ నగరానికి ఏమైంది సినిమాతో మంచి గుర్తింపును సాధించుకున్నాడు. ఆ తర్వాత దర్శకుడుగా కూడా తన ప్రతిభను చూపించాడు. విశ్వక్ దర్శకత్వం వహించిన ఫలక్నామా దాస్ సినిమా మంచి రిజల్ట్ ని తెచ్చిపెట్టింది. ఆ తర్వాత వరుసగా డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమాలు చేయడం మొదలుపెట్టాడు విశ్వక్. కమర్షియల్ సినిమాలతో పాటు కాన్సెప్ట్ బే సినిమాలు కూడా చేస్తున్నాడు. గామి లాంటి సినిమాకి దాదాపు ఐదేళ్లపాటు తన టైం కేటాయించాడు.
ఇక విశ్వక్ ప్రస్తుతం లైలా అనే సినిమాను చేస్తున్నాడు. ఈ సినిమా మీద కూడా మంచి అంచనాలు ఉన్నాయి. తను సినిమాలు చేయడమే కాకుండా కొన్ని సినిమాలను ఎంకరేజ్ కూడా చేస్తూ ఉంటాడు. అయితే ఒకప్పుడు ఇంస్టాగ్రామ్ లో చాలా యాక్టివ్ గా ఉండేవాడు విశ్వక్. ఆ తర్వాత దానిని కూడా తగ్గించాడు. ఈ రోజుల్లో సోషల్ మీడియా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ప్రతి కంటెంట్ ట్రోల్ కి గురి అవుతూ ఉంటుంది. జెన్యూన్ గా ఒక అభిప్రాయం వ్యక్తం చేసిన కూడా దానిమీద సెటైర్లు కనిపిస్తూ ఉంటాయి. రీసెంట్ గా సూర్య నటించిన కంగువ సినిమా ఈవెంట్ కు హాజరయ్యాడు విశ్వక్. ఈవెంట్ లో సూర్య గురించి చాలా విషయాలు మాట్లాడి తను ప్రేమను తెలియపరిచాడు విశ్వక్సేన్.
Also Read : Pawan Kalyan film with Surender Reddy : ఈ సినిమా ఇప్పట్లో అవుతుందని నాకు నమ్మకం లేదు, నిర్మాత క్లారిటీ
సూర్య కెరియర్లో ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో వచ్చిన గజినీ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ సినిమాలు గుండు తో కనిపిస్తాడు సూర్య. అయితే విశ్వక్ మాట్లాడుతూ ఆ సినిమా చూసి చిన్నప్పుడు నేను గుండు కొట్టించుకున్నాను అంటూ తన స్పీచ్ లో చెప్పాడు. ఆ విధంగా సూర్య పై తన ప్రేమను వ్యక్తపరిచాడు. ఈ విషయాన్ని చాలా జెన్యూన్ గా చెప్పాడు విశ్వక్. కానీ దానిని కూడా కొందరు ట్రోల్ చేయటం మొదలుపెట్టారు.ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోని కోట్ చేస్తూ అన్న దయచేసి మీరు ఉప్పెన సినిమా చూడకండి అంటూ కామెంట్ చేస్తున్నారు. ఉప్పెన సినిమా కాన్సెప్ట్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ సినిమా కూడా మంచి బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ప్రస్తుతం మెకానిక్ రాకి అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు విశ్వక్. ఈ సినిమా టీజర్ కూడా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ సినిమా మీద కూడా మంచి అంచనాలు ఉన్నాయి.