Big Stories

CM Revanth Reddy : రేవంత్.. వన్‌ మ్యాన్ ఆర్మీ

- Advertisement -

విన్నారుగా.. కాస్త ఫన్నీగా ఉన్నా.. తాను ఏం చెప్పాలనుకుంటున్నారో ప్రజల్లోకి ఈజీగా తీసుకెళ్లే వ్యూహం ఇది. గాడిద గుడ్డు పెడుతుందా? పెట్టదు కదా.. ఇదేంత నిజమో.. బీజేపీకి తెలంగాణను అభివృద్ధి చేసింది కూడా అంతే నిజం అంటున్నారు రేవంత్..ఇక మరికొన్ని విషయాల్లో సూటిగా నేరుగా.. కుండబద్ధలు కొట్టేస్తున్నారు రేవంత్ రెడ్డి. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ రిజర్వేషన్ల అంశం. నిజానికి కాంగ్రెస్‌ కేంద్ర పెద్ద పెద్దల కంటే.. రిజర్వేషన్ల విషయంలో బీజేపీని నిలదీసింది మాత్రం రేవంత్ రెడ్డే అనే చెప్పాలి. ఆయన ఇస్తున్న స్పీచ్‌ల్లో బీజేపీ గెలిస్తే రిజర్వేషన్లు రద్దు అవుతాయి.

- Advertisement -

అనే అంశం తప్పక ఉంటుంది. ఆయన చేసే విమర్శలు, ఆరోపణలకు రాష్ట్ర నేతలు ఇచ్చే సమాధానాలు ఏ మాత్రం సరిపోవడం లేదు. ఎందుకంటే ఆయన పక్కా ఆధారాలతో మాట్లాడుతున్నారు. గతంలో బీజేపీ ఏం చేసిందో పర్ఫెక్ట్‌గా డాక్యుమెం్టస్‌తో చూపిస్తున్నారు. దీంతో బీజేపీ నేతల గొంతుల్లో పచ్చి వెలక్కాయ పడ్డట్టగా తయారైంది పరిస్థితి. రేవంత్ చేస్తున్న విమర్శలకు ఇప్పుడు ప్రధాని మోడీ ఏకంగా సమాధానాలు చెప్పుకుంటున్నారు. ఎట్ ది సేమ్ టైమ్.. ఏకంగా రేవంత్‌ను టార్గెట్ చేస్తూ విమర్శలు చేస్తున్నారు.

Also Read: పాకిస్థాన్ పేరు చెప్పి ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేస్తున్నారు: కేసీఆర్

దీన్ని బట్టి చూస్తే బీజేపీ పెద్దల దృష్టి.. రేవంత్‌ను కంట్రోల్‌ చేయడంపై పెట్టినట్టు కనిపిస్తోంది. రేవంత్ పేరు ఎత్తకుండా ఆయనను విమర్శలు చేస్తున్నారు ప్రధాని. కానీ రేవంత్ టార్గెట్ మాత్రం ప్రస్తుతం క్లియర్‌గా ఉంది. అది తెలంగాణలో 14 ఎంపీ సీట్లు గెలవడం.మరి ఈ టార్గెట్‌ను రీచ్‌ అవ్వాలంటే ఏం చేయాలి? పార్టీని బలపరచాలి.. ప్రత్యర్థిని దెబ్బతీయాలి. ప్రజల్లో నమ్మకం పెంచుకోవాలి. ఇప్పుడీవన్నీ చేస్తోంది కాంగ్రెస్‌ పార్టీ.. వచ్చిన మూడు నెలల్లో చేసింది చెబుతున్నారు.

రాబోయే రోజుల్లో చేసేదేంటో చెబుతున్నారు. ఎట్ ది సేమ్ టైమ్.. ప్రధాన ప్రత్యర్థిగా బీజేపీపై నిప్పులు చెరుగుతున్నారు. ఎన్నికల ప్రచారంలో వన్ మ్యాన్ ఆర్మీగా దూసుకుపోతున్నారు రేవంత్ రెడ్డి.. అటు ఇతర రాష్ట్రాల్లో కాంగ్రెస్ తరపున ప్రచారం నిర్వహిస్తున్నారు. గాంధీ కుటుంబ పెద్దల తరపున ప్రచారం చేస్తున్నారు. అదే రోజు మళ్లీ రాష్ట్రంలో రోడ్‌ షోలు, ర్యాలీలు, కార్నర్ మీటింగ్‌లు, బహిరంగసభలు నిర్వహిస్తున్నారు. మొత్తానికి రాష్ట్రాన్ని సుడిగాలితా చుట్టేస్తూ ప్రచారాన్ని జోరుగా నిర్వహిస్తున్నారు.

Also Read: BJP Navneet rana Vs CM RevanthReddy: నవనీత్‌పై కేసు పెట్టాల్సిందే, సీఎం రేవంత్‌ డిమాండ్

సీఎంగా సమీక్షలు, సమావేశాలు నిర్వహిస్తున్నారు రేవంత్ రెడ్డి.. అదే సమయంలో పార్టీ అధ్యక్షుడిగా చేరికలు, పార్టీ బలోపేతం, ప్రచారంపై ఫోకస్ చేస్తున్నారు. మొత్తంగా ఆల్‌రౌండర్‌గా అన్ని తానై ముందుకు దూసుకెళ్తున్నారు రేవంత్.. తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ పనైపోయింది అన్న సీన్ నుంచి.. తెలంగాణ అంటేనే కాంగ్రెస్‌ పార్టీ అనే రేంజ్‌కు తీసుకొచ్చారు రేవంత్ రెడ్డి.. అసెంబ్లీ ఎన్నికలకు ముందు కేసీఆర్‌ ఎత్తులకు పైఎత్తులు వేసిన రేవంత్ రెడ్డి.. లోక్‌సభ ఎన్నికల టైమ్‌లో మరింత ఉత్సాహంతో దూసుకుపోతున్నారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News