Big Stories

Rahul Gandhi Vs PM Modi: అదానీ..అంబానీ.. అండ్ మోదీ!

PM Modi Says Congress got election Funds From Ambani And Adani: ప్రధాని నరేంద్ర మోదీ అసలు సిసలు రాజకీయ నాయకులు.. అందులో ఎలాంటి డౌట్ లేదు.. ఆయనకు ఎక్కడేం మాట్లాడాలో బాగా తెలుసు.. ఎందుకీ మాట అనాల్సి వస్తుందంటే.. గత ఐదేళ్లుగా విపక్షాలు ఎన్ని విమర్శలు చేసినా.. ఇంకెన్నో ఆరోపణలు చేసినా.. ఆఖరికి పార్లమెంట్‌లో గందరగోళం సృష్టించినా.. ఆయన నోటినుండి ఆ పేర్లు పలకలేదు.. కానీ ఎన్నికల సమయం వచ్చేసరికి అనేశారు.. ఆ పేర్లనే ప్రచారానికి వాడేశారు.. అవేంటనే కదా మీ డౌట్.. వినేయండి. అంబానీ, అదానీ.. బీజేపీ హయాంలో అభివృద్ధి చెందింది ఎవరు? ఎవరికి ఎక్కువ డబ్బు వచ్చింది? ఎవరు సంపన్నులకు సంపన్నులుగా మారారు..? పోర్టులు, ఎయిర్‌పోర్టులు ఎవరికి దక్కాయి..? మొబైల్ కంపెనీలు, రిటైల్ షాపులు మూతపడితే లాభపడింది ఎవరు..? హోల్ అండ్ సోల్‌గా మోడీ హయాంలో అభివృద్ధి చెందింది ఎవరు?

- Advertisement -

ఈ ప్రశ్నలన్నింటికి సమాధానం అదానీ.. అంబానీ, ఇది మేం చెప్పే ఆన్సర్ కాదు.. విపక్షాలు చేస్తున్న విమర్శలు.. ఎస్పెషల్లీ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేస్తున్న విమర్శలు ఇవి.. ఇలా ఐదేళ్లుగా ఎన్ని విమర్శలు చేసినా కనీసం పట్టించుకోని మోదీ.. సరిగ్గా ఎన్నికల ముందు.. అది కూడా మూడు ఫేజ్‌లు ముగిశాక నోరు విప్పారు. ఆయన వేస్తున్న ప్రశ్నలేంటి? ఐదేళ్లుగా విపక్ష నేతలు అంబానీ, అదానీ అని ఆరోపణల మీద ఆరోపణలు చేశారు.

- Advertisement -

మరి సరిగ్గా ఎన్నికల ముందు ఒక్కసారిగా ఎందుకు మానేశారు..? అంబానీ, అదానీలపై రాహుల్ గాంధీ ఒక్క మాట కూడా ఎందుకు మాట్లాడటం లేదు? రాత్రికి రాత్రి ఏం మతలబు జరిగింది? అదానీ, అంబానీ నుంచి కాంగ్రెస్ ఎంత డబ్బు తీసుకుంది? గుట్టలుగా ఉన్న నల్ల డబ్బుతో ఉన్న వ్యానులు ఎన్ని వెళ్లాయి? వీటన్నింటికి కాంగ్రెస్ సమాధానం చెప్పాలి? దాల్ మే కుచ్ కాలా హై అంటూ నరేంద్ర మోదీ వేసిన ప్రశ్నలివి.

Also Read: శామ్ పిట్రోడా సంచలన నిర్ణయం.. కాంగ్రెస్ ఓవర్సీస్ ఛైర్మన్ పదవికి రాజీనామా

బాగుంది.. చాలా ఏళ్ల తర్వాత మోదీ నుంచి ఈ బడా వ్యాపారవేత్తల పేర్లు రావడం బాగుంది.. బట్.. ఇక్కడో డౌట్ కూడా వస్తుంది.. అదేంటంటే.. ఒక్కసారి మోడీ క్వశ్చన్స్‌ను రీపిట్ చేద్దాం.. రాహుల్ ఎందుకు అంబానీ, అదానీ నామజపం ఆపేశారు? మంచి క్వశ్చనే.. ఇది నిజమే అయితే రాహుల్ గాంధీ దీనికి ఆన్సర్ చెప్పాల్సిందే.. ఇక సెకండ్ క్వశ్చన్.. కాంగ్రెస్ గుట్టలకొద్ది డబ్బు తీసుకుంది.. అందుకే వారి పేర్లు తీయడం లేదు.. ఇది అసలైన క్వశ్చన్.. డబ్బు తీసుకున్నారు కాబట్టే మాట్లాడటం లేదన్నది నిజమే అయితే.. ఇన్నేళ్లుగా ప్రశ్నిస్తూ.. నిలదీస్తూ.. విమర్శిస్తున్నా ఎందుకు మీరు ఒక్క మాట మాట్లాడలేదు..? దీని కోసం బీజేపీకి ఎంత డబ్బు తీసుకుంది? అనేది ఇప్పుడు కాంగ్రెస్‌ నేతల నుంచి ఎదురవుతున్న ప్రశ్న. అంతేకాదు.. ఇక్కడ మోడీ చాలా తెలివిగా మాట్లాడనని అనుకున్నారు. కానీ తెలీకుండానే అంబానీ, అదానీలను వివాదంలోకి లాగారు.. ఇన్నాళ్లు విపక్ష నేతలు మాత్రమే వారిపై విమర్శలు చేశారు.

కానీ ఈ రోజు ఏకంగా సాక్షాత్తు ప్రధాని హోదాలో ఉన్న మోడీనే ఇన్‌డైరెక్ట్‌గా వారిపై చాలా విమర్శలు చేశారు.. తమపై విమర్శలు చేయకుండా ఉండేందుకు అంబానీ, అదానీలు డబ్బులు ఇచ్చారని చెప్పకనే చెబుతున్నారు.. అంతేకాదా.. డబ్బులు తీసుకున్నారని రాహుల్‌ను విమర్శిస్తున్నారంటే.. ఇన్‌డైరెక్ట్‌గా అంబానీ, అదానీలు డబ్బులు ఇచ్చినట్టే కదా.. మరి దీనికి ఆ రెండు వ్యాపార సామ్రాజ్యాధినేతలు రెస్పాండ్ అవుతారా? లేదా? అనేది బిగ్ క్వశ్చన్. ఇక మరో క్వశ్చన్.. నిజానికి ఏళ్లుగా ఉన్న విమర్శలు ఇవి.. బట్ మోడీ ఇప్పుడే ఎందుకు రెస్పాండ్ అయ్యారు.

Also Read: Prajwal Revanna Obscene Video Case : ప్రజ్వల్ రేవణ్ణ కేసులో ట్విస్ట్.. బలవంతంగా కేసు పెట్టించారన్న మహిళ ?

అది కూడా దేశవ్యాప్తంగా మూడు ఫేజ్‌ల ఎన్నికలు ముగిసిన తర్వాత.. ఇదే ఇప్పుడు కాస్త విచిత్రంగా ఉంది. నిజానికి రాహుల్ విమర్శలపై రియాక్ట్ అవ్వాలంటే.. ఆయన మొదట విమర్శలు చేసినప్పుడే కౌంటర్ ఇవ్వాలి.. కానీ ఇవ్వలేదు.. పోనీ షెడ్యూల్‌ వచ్చిన తర్వాత ఎన్నికల ప్రచారం ప్రారంభించిన తర్వాతైనా ఇవ్వాలి.. కానీ అప్పుడు ఇవ్వలేదు.. ఎన్నికలు ప్రారంభమైన నెల తర్వాత కౌంటర్ ఇవ్వడమేంటి? అనేది ఇక్కడ బిగ్ క్వశ్చన్.. మోడీ ఎన్నికల్లో ఓడిపోతానని అనుకుంటున్నారా? లేదా అంబానీ, అదానీలకు మోడీకి మధ్య ఏమైనా బేదాభ్రిపాయాలు వచ్చాయా? లేదా ఈ కార్పొరేట్ దిగ్గజాలు తమ మద్ధతును కాంగ్రెస్‌కు ఇద్దామని డిసైడ్ అయ్యాయా? అందుకే అదానీ, అంబానీలను మోదీ టార్గెట్ చేశారా..? ఇప్పుడివే క్వశ్చన్స్‌పై పొలిటికల్ సర్కిళ్లో జోరుగా నడుస్తుంది చర్చ.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News