E-Paper
Advertisement

విధ్వంసం నుంచి వికాసం వైపు.. ఆ విషయంలో రాజీపడేది లేదు-సీఎం రేవంత్‌రెడ్డి

విధ్వంసం నుంచి వికాసం వైపు.. ఆ విషయంలో రాజీపడేది లేదు-సీఎం రేవంత్‌రెడ్డి
Advertisement

Golconda Fort:  ప్రజల భాగస్వామ్యంతో తెలంగాణను దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దుతామని పిలుపు ఇచ్చారు సీఎం రేవంత్‌రెడ్డి. భారత్ ఫ్యూచర్ సిటీని దేశంలో తొలి నెట్-జీరో స్మార్ట్ సిటీగా అభివృద్ధి చేయడం లక్ష్యమన్నారు. తెలంగాణ రైజింగ్ పేరిట 2034 నాటికి ట్రిలియన్ డాలర్, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ లక్ష్యమన్నారు. తెలంగాణ నీటి హక్కుల విషయంలో రాజీ పడేది లేదన్నారు. పెండింగ్‌ ప్రాజెక్టులు పూర్తి చేసి రైతుల కళ్లలో ఆనందం చూస్తామన్నారు.

 

80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో సీఎం రేవంత్‌రెడ్డి

Advertisement

గోల్కొండలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొని జాతీయ జెండాను ఎగురవేశారు సీఎం రేవంత్‌రెడ్డి. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన, ప్రపంచ చరిత్రలో ఆయుదం లేని యుద్ధం మన స్వాతంత్య్ర పోరాటమన్నారు. అహింసతో విజయాన్ని సాధించవచ్చని మహాత్మాగాంధీ నిరూపించి చూపించారన్నారు. రకరకాల విప్లవాలను తీసుకొచ్చి అన్నిరంగాలను స‌మ‌గ్రాభివృద్ధి చేసిన ఘ‌న‌త ఆనాటి ప్రభుత్వాలది గుర్తు చేశారు. విధ్వంసమైన తెలంగాణను వికాసం వైపు నడిపిస్తున్నామని వివరించారు.

 

గోల్కొండలో జాతీయ జెండాను ఎగురవేసిన సీఎం

Advertisement

రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దెబ్బతిన్న వ్యవస్థలను గాడిలో పెట్టామన్నారు. 32 నెలల్లో తెలంగాణ పునర్నిర్మాణానికి బలమైన పునాదులు వేశామని, ఓ వైపు సంక్షేమం, మరోవైపు అభివృద్ధి వైపు అడుగులు వేస్తున్నట్లు చెప్పారు. తెలంగాణ తలసరి ఆదాయం, దేశ తలసరి ఆదాయం కంటే దాదాపు 91శాతం అధికమన్నారు. రూ.2 లక్షల వరకు రుణమాఫీతో 25 లక్షలకు పైగా రైతు కుటుంబాలకు రుణ విముక్తి చేశామన్నారు. ఇప్పటివరకు రూ.36 వేల కోట్లకు పైగా పెట్టుబడి సాయం చేశామన్నారు. వ్యవసాయం-రైతు సంక్షేమానికి 32 నెలల్లో రూ.1.70 లక్షల కోట్లు ఖర్చు చేసినట్టు వెల్లడించారు. వరి సాగు, దిగుబడిలో పంజాబ్‌ను తెలంగాణ అధిగమించి దేశంలో నంబర్ వన్ రాష్ట్రంగా నిలిచిందన్నారు సీఎం.

తలసరి ఆదాయం దేశం కంటే అధికం-సీఎం

మహాలక్ష్మి పథకం ద్వారా రూ. 335 కోట్లకు పైగా మహిళలు ఉచిత బస్సు ప్రయాణాలు చేశారన్నారు. గృహజ్యోతి కింద 53.09 లక్షల కుటుంబాలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించామన్నారు. రూ.500కే గ్యాస్ సిలిండర్ పథకం దాదాపు 42.90 లక్షల కుటుంబాలకు ఇచ్చామన్నారు. సన్నబియ్యం పథకం కింద 93 లక్షలకు పైగా కుటుంబాలను PDS పరిధిలోకి తీసుకొచ్చామన్నారు. నేటి నుంచి స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీకి శ్రీకారం చుట్టామని, ఇందిరమ్మ ఇళ్లు తొలి దశలో 4.50 లక్షల ఇళ్లు ఇచ్చామని చెప్పిన సీఎం, ఒక్కో ఇంటికి రూ.5 లక్షల సాయం అందజేశామన్నారు. సామాజిక భద్రత కింద 43 లక్షల మందికి పింఛన్లు ఇవ్వగా, కొత్తగా మరో 2.25 లక్షల మందిని చేర్చినట్టు తెలిపారు. ఎస్సీ ఉపకులాల వర్గీకరణలో దేశంలో తెలంగాణ తొలి రాష్ట్రమని, బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల బిల్లులు అసెంబ్లీలో ఆమోదించి కేంద్రానికి పంపినట్టు తెలిపారు.

కనీస వేతనాల పెంపు కింద సుమారు 1.11 కోట్ల మంది కార్మికులకు ప్రయోజనం చేకూరుతుందన్నారు. ప్రతి నియోజకవర్గానికి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ ఏర్పాటు చేస్తున్నామని, 105 స్కూళ్లు మంజూరు అయ్యాయని తెలిపారు. ప్రభుత్వ శాఖల్లో ఇప్పటివరకు 72 వేలకుపైగా నియామకాలు పూర్తి చేశామని వివరించారు. యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ ద్వారా 1,190 మందికి శిక్షణ ఇచ్చామని, 838 మందికి ఉద్యోగాలు వచ్చాయన్నారు. ఆరోగ్యశ్రీ పరిమితి రూ.10 లక్షలకు పెంచామని, గోషామహల్‌లో 2,000 పడకల కొత్త ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణం జరిగిందన్నారు.

ALSO READ: తెలంగాణ కేబినెట్ నిర్ణయాలు.. స్మార్ట్ రేషన్ కార్డులు, EV ఆటో సబ్సిడీ పూర్తి వివరాలు!

ఆగస్టు 17 నుంచి అన్ని ఎంపీడీవో కార్యాలయాల్లో ప్రతి సోమవారం ప్రజావాణి నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 360 కి.మీ. రీజినల్ రింగ్ రోడ్డు 6,092 కి.మీ. హ్యామ్/రేడియల్ రోడ్లు, మెట్రో రెండో దశ విస్తరణ జరుగుతోందన్నారు. మూసీ పునరుజ్జీవనం కోసం 55 కి.మీ. పరిధిలో 39 కొత్త STPల కోసం సమగ్ర ప్రణాళిక చేపట్టామన్నారు. TG-iPASS ద్వారా రూ.1.29 లక్షల కోట్ల పెట్టుబడుల ద్వారా 78 వేలకుపైగా ఉద్యోగ అవకాశాలు వస్తాయన్నారు. ఐటీ ఎగుమతులు 2025-26లో రూ.3.97 లక్షల కోట్లు కగా, ప్రత్యక్ష ఐటీ ఉద్యోగాలు 12.14 లక్షలకు చేరిందన్నారు. తెలంగాణలో అదనంగా 7 బిలియన్ డాలర్ల పెట్టుబడి పెడుగుతున్నట్లు అమెజాన్ ప్రకటించినట్లు తన ప్రసంగంలో పేర్కొన్నారు. గోదావరి పుష్కరాలు కోసం రూ.1,000 కోట్లతో అభివృద్ధి ప్రణాళిక చేస్తున్నట్లు వివరించారు.

 

Related News

ఎంఐఎం కోటలో వందేమాతరం సమరం.. దమ్ముంటే అడ్డుకోండి! బండి సంజయ్ ఓపెన్ ఛాలెంజ్!

తెలంగాణ కేబినెట్ నిర్ణయాలు.. స్మార్ట్ రేషన్ కార్డులు, EV ఆటో సబ్సిడీ పూర్తి వివరాలు!

మౌలాలి MS ల్యాబ్‌లో డ్రగ్స్ తయారీ.. రూ. 17 కోట్ల సరుకు సీజ్!

కేసీఆర్‌ను చూసి పక్కకు వెళ్లిపోయిన ఎమ్మెల్సీ కవిత!

కల్యాణలక్ష్మి కాస్త సంతానలక్ష్మిగా మారిందా.. కాంగ్రెస్ పై కల్వకుంట్ల సంజయ్ ఫైర్!

అసమాన ప్రతిభ.. అసాధారణ ధైర్యం.. కేంద్ర పతకాల్లో మెరిసిన తెలంగాణ పోలీసులు!

హైదరాబాద్‌లో ఘోరం.. బ్లింకిట్ డెలివరీ బాయ్ దారుణ హత్య.. ఏం జరిగిందంటే?

Big Stories

Advertisement
×