E-Paper
Advertisement

కనిపించకుండా పోయిన వస్తువుల్ని చిటికెలో పట్టేస్తుంది.. గూగుల్ కొత్త డివైజ్ వచ్చేసింది!

కనిపించకుండా పోయిన వస్తువుల్ని చిటికెలో పట్టేస్తుంది.. గూగుల్ కొత్త డివైజ్ వచ్చేసింది!
Advertisement

Google Pixel Tag: యాపిల్ ఎయిర్‌ట్యాగ్‌కి గట్టి పోటీనిస్తూ.. గూగుల్ తమ కొత్త ‘పిక్సెల్ ట్యాగ్’ను భారత మార్కెట్లోకి తీసుకొచ్చింది. వస్తువులను సులభంగా వెతుక్కునేందుకు వీలుగా గూగుల్ తయారుచేసిన మొదటి బ్లూటూత్ ట్రాకర్ ఇది. పిక్సెల్ లేదా ఇతర ఆండ్రాయిడ్ ఫోన్లను ఉపయోగించే వారికి ఇదొక మంచి ఆప్షన్‌గా నిలుస్తుంది.

ఈ పిక్సెల్ ట్యాగ్ మనదేశంలో లభించే ఏకైక కలర్ ఫాగ్ వేరియంట్‌లో రానుంది. సింగిల్ ట్యాగ్ ధర రూ.3,799 కాగా.. నాలుగు ట్యాగ్‌ల ప్యాక్ ధర రూ.12,900గా ఉంది. నవంబర్ నుంచి గూగుల్ ఇండియా ఆన్‌లైన్ స్టోర్‌లో ఇవి అమ్మకానికి అందుబాటులోకి వస్తాయి. గుండ్రటి రాయి లాంటి చిన్న డిజైన్, లైట్ వెయిట్‌తో వచ్చే ఈ ట్యాగ్‌పై గూగుల్ లోగోతో పాటు ఒక చిన్న ఎల్ఈడీ లైట్ కూడా ఉంటుంది.

Advertisement

Also Read: శాంసంగ్ నుంచి 3 కొత్త గ్యాడ్జెట్లు.. Google ప్లే కన్సోల్‌లో దర్శనమిచ్చిన గ్యాలాక్సీ ఫోన్లు!

Google Pixel Tag ఫైండ్ హబ్ నెట్‌వర్క్‌పై పనిచేస్తుంది. దీనిలో ఉన్న బ్లూటూత్ ఛానల్ సౌండింగ్, అల్ట్రావైడ్‌ బ్యాండ్ సాంకేతికత ద్వారా వస్తువులు ఎక్కడున్నాయో కచ్చితంగా లొకేషన్ చూపిస్తుంది. ట్యాగ్‌లో చిన్న స్పీకర్ కూడా ఉంటుంది. వస్తువు కనిపించనప్పుడు ఫైండ్ హబ్ యాప్ ద్వారా సౌండ్ చేసి కూడా దాన్ని వెతకవచ్చు. ఆండ్రాయిడ్ 9 లేదా ఆపై వెర్షన్‌తో పనిచేసే ఏ డివైజ్‌కైనా ఇది సపోర్ట్ చేస్తుంది.

Advertisement

దీనిలోని ఒక ప్రత్యేకమైన ఫీచర్ ఏమిటంటే.. ఒకవేళ మన ఫోన్ ఎక్కడైనా పడిపోయి సైలెంట్‌లో ఉన్నా సరే.. ఈ ట్యాగ్‌పై ఉన్న బటన్ నొక్కితే ఫోన్ రింగ్ అవుతుంది. అలాగే మన దగ్గర కంపాటిబుల్ పిక్సెల్ ఫోన్ ఉంటే.. జెమిని వాయిస్ అసిస్టెంట్‌ని అడిగి కూడా ఈ ట్యాగ్ ద్వారా సౌండ్ చేయించవచ్చు. దీని బరువు కేవలం 11.8 గ్రాములు మాత్రమే ఉంటుంది.

ఈ Google Pixel Tagలో సులభంగా మార్చుకోగలిగే CR2032 కాయిన్ బ్యాటరీని ఇచ్చారు. ఇది ఒక ఏడాది కంటే ఎక్కువ కాలం పనిచేస్తుంది. ఛార్జింగ్ అయిపోగానే కొత్త బ్యాటరీ వేసుకుంటే సరిపోతుంది. ఇది ఐపీ67 వాటర్, డస్ట్ రెసిస్టెన్స్‌తో వస్తుంది కాబట్టి.. ఒక మీటర్ లోతు నీటిలో అరగంట సేపు ఉన్నా ఏమీ కాదు. దీనిపై గూగుల్ ఏడాది వారంటీని అందిస్తోంది.

Also Read: బ్లడ్ షుగర్ చెక్ చేయకుండానే.. ఇన్సులిన్ మార్పులను పసిగట్టే గూగుల్ టెక్నాలజీ!

Related News

ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో పాతాళానికి పడిపోయిన మోటో ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందంటే?

రూ.10వేల వాషింగ్ మెషీన్ ఇప్పుడు రూ.5,099కే! ఎగబడి కొంటున్న జనం

నమ్మలేని పెర్ఫార్మెన్స్, అదిరిపోయే లుక్‌తో..అసుస్ రోగ్ జి16 లాంచ్!

రూ.999కే..స్పాటియల్ ఆడియో ఇయర్ బడ్స్! భారీగా తగ్గిన ధర

రూ.10వేలలోపే స్మార్ట్ టీవీలు..ఫీచర్లు తెలిస్తే షాక్ అవడం ఖాయం!

డాక్యుమెంట్ స్కాన్ కోసం ప్రత్యేక యాప్ అక్కర్లేదు.. మన ఫోన్‌లోనే ఈ సూపర్ ఆప్షన్ ఉందిగా!

పోగొట్టుకున్న కాంటాక్ట్‌లను..నిమిషాల్లో వెనక్కి తెచ్చుకోండిలా!

ఈ స్పీకర్‌ను మూడు ముక్కలుగా విడదీయొచ్చు.. పోర్ట్రానిక్స్ సరికొత్త ప్రయోగం, ధర ఎంతంటే?

Big Stories

Advertisement
×