E-Paper
Advertisement

రూ.20 లక్షల్లోపే మహీంద్రా కొత్త పికప్.. స్కార్పియో లైఫ్‌ స్టైలర్ ప్రత్యేకతలివే!

రూ.20 లక్షల్లోపే మహీంద్రా కొత్త పికప్.. స్కార్పియో లైఫ్‌ స్టైలర్ ప్రత్యేకతలివే!
Advertisement

Mahindra’s New Lifestyle Pickup Truck: మహీంద్రా నుంచి మరో కొత్త వెహికల్ భారత మార్కెట్లోకి అడుగు పెట్టబోతోంది. స్కార్పియో ఫ్యామిలీ నుంచి లైఫ్‌ స్టైల్ పికప్ ట్రక్‌ గా రూపొందిన ఈ మోడల్‌ ను కంపెనీ తాజాగా ఆవిష్కరించింది. 2023లో చూపించిన గ్లోబల్ పికప్ కాన్సెప్ట్ ఆధారంగా దీనిని తయారు చేసింది. అంతర్జాతీయ మార్కెట్లలో ఇది ‘మహీంద్రా లైఫ్‌ స్టైలర్’ పేరుతో అమ్మకానికి రానుంది. కొత్త పికప్‌ తో పాటు ప్రత్యేకంగా రూపొందించిన మూడు ఎడిషన్లను కూడా కంపెనీ పరిచయం చేసింది.

2027లో మార్కెట్లోకి

స్కార్పియో లైఫ్‌ స్టైలర్ భారత మార్కెట్లోకి 2027 ఏప్రిల్ నాటికి వచ్చే అవకాశం ఉంది. 2027 భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌ పోలో దీని ప్రొడక్షన్ వెర్షన్‌ ను పూర్తిగా ప్రదర్శించే అవకాశం ఉంది. ప్రస్తుతం కంపెనీ ఈ పికప్‌ ను వివిధ రకాల రోడ్లు, ఆఫ్‌ రోడ్ పరిస్థితులకు అనుగుణంగా రెడీ చేస్తోంది.

రూ.19.79 లక్షల లోపే ధర?

Advertisement

కొత్త లైఫ్‌స్టైలర్ బేస్ వేరియంట్ ఎక్స్‌షోరూమ్ ధర రూ.19.79 లక్షల కంటే తక్కువగా ఉండేలా తీసుకురానున్నట్లు మహీంద్రా కంపెనీ వెల్లడించింది. అయితే, అన్ని వేరియంట్ల ధరలు లాంచ్‌  సమయంలో వెల్లడయ్యే అవకాశం ఉంది. ధర పరంగా ఇది టయోటా హిలక్స్, ఇసుజు డి మ్యాక్స్ లాంటి పికప్ ట్రక్కులకు పోటీగా నిలవనుంది.

స్కార్పియో ఎన్ ప్లాట్‌ ఫామ్

ఈ పికప్ ట్రక్ స్కార్పియో ఎన్‌లో ఉపయోగించిన బాడీ ఆన్ ఫ్రేమ్ ప్లాట్‌ ఫామ్‌పై ఆధారపడుతుంది. ఇంజిన్ విషయంలో కూడా మహీంద్రా ఇప్పటికే ఉపయోగిస్తున్న పవర్‌ట్రెయిన్‌లను తీసుకునే అవకాశం ఉంది. ఇందులో 2.0 లీటర్ టర్బో పెట్రోల్, 2.2 లీటర్ టర్బో డీజిల్ ఇంజిన్లు ఉండొచ్చని సమాచారం. డీజిల్ ఇంజిన్ సుమారు 175 హెచ్‌పీ వరకు, పెట్రోల్ ఇంజిన్ 203 హెచ్‌పీ వరకు పవర్ అందించే అవకాశం ఉంది. గేర్‌ బాక్స్ ఎంపికల్లో 6 స్పీడ్ మాన్యువల్, 6 స్పీడ్ ఆటోమేటిక్ ఉండనుంది. లైఫ్‌స్టైలర్‌లో మహీంద్రా 4WD సిస్టమ్‌ను అందించే అవకాశం ఉంది.  దీంతో ఇది రోజువారీ ప్రయాణాలతో పాటు అడ్వెంచర్ కోసం కూడా ఉపయోగపడే పికప్‌గా మారనుంది.

స్పెషల్ ఎడిషన్లు

Advertisement

ఈ కొత్త పికప్‌ను ముంబైలోని మహీంద్రా ఇండియా డిజైన్ స్టూడియోలో డిజైన్ చేయగా, చెన్నైలోని మహీంద్రా రీసెర్చ్ వ్యాలీలో అభివృద్ధి చేశారు. కంపెనీ ప్రత్యేకంగా వ్యాలీ, రీఫ్, ట్రైల్ ఎడిషన్లను కూడా పరిచయం చేసింది. వీటికి ప్రత్యేక రంగులు, డిజైన్ మార్పులు ఉండనున్నాయి. స్కార్పియో లైఫ్‌ స్టైలర్ ద్వారా మహీంద్రా పికప్ ట్రక్ విభాగంలో తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని చూస్తోంది. ధర, పవర్, 4WD  కారణంగా ఈ మోడల్ భారత మార్కెట్లో సత్తా చాటే అవకాశం కనిపిస్తోంది.

Read Also: మహీంద్రా BE 07 ఇంటీరియర్ లీక్.. వారెవ్వా.. ఏముంది గురూ!

Tags

Related News

అల్ట్రావయోలెట్ షాక్‌వేవ్ లాంచ్ 2027 లోనే.. ఎందుకు ఆలస్యమైందంటే?

యమహా నుంచి ప్రీమియం బైక్‌ల జోరు.. భారత్‌లో కొత్త మోడళ్లకు ప్లాన్!

టియాగో To హారియర్.. టాటా ఈవీలన్నింటికీ BaaS ఆప్షన్!

హయబుసా కొత్త వెర్షన్ వచ్చేసింది.. ధర, ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే!

రెనాల్ట్ ట్రైబర్ టర్బో మైలేజ్ రివీల్.. లీటర్ పెట్రోల్ తో ఎంత దూరం ప్రయాణిస్తుందంటే?

30 కిలో మీటర్లకు మించి మైలేజ్.. త్వరలో రాబోతున్న 4 సూపర్ హైబ్రిడ్ SUVలు ఇవే!

కొత్త కారు కొనాలనుకుంటున్నారా? అక్టోబర్‌లో ఎంట్రీ ఇవ్వబోతున్న 11 క్రేజీ కార్లు ఇవే!

ట్రైబర్‌ కు ఇక టర్బో పవర్.. కొత్త వేరియంట్ అదిరింది భయ్యా!

Big Stories

Advertisement
×