CM Revanth Reddy Comments on KCR and Modi in Adilabad Janajathara: మోదీ, కేసీఆర్ ఇద్దరూ తోడుదొంగలేనని సీఎం రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. ఆదిలాబాద్‌లో కాంగ్రెస్ జెండా ఎగరాలని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఆదిలాబాద్ కాంగ్రెస్ జనజాతర సభలో పాల్గొన్న ఆయన ఆదిలాబాద్ ఎంపీ అభ్యర్ధి ఆత్రం సుగుణను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు.
ఆగస్టు 15 లోపు రైతులకు రుణ మాఫీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. వంద రోజుల్లో ఏం పని జరగలేదనే వారిని తరిమికొట్టాలని అన్నారు. కాంగ్రెస్ పార్టీ తుక్కుగూడ వేదికగా ఇచ్చిన ఆరు గ్యారంటీలో 5 ఇప్పటికే అమలు చేశామన్నారు. నాగోబా జాతరకు రూ.4 కోట్ల కేటాయించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. కుఫ్టి ప్రాజెక్టును పూర్తి చేసి ఆదిలాబాద్ జిల్లాను సస్యశ్యామలం చేస్తామన్నారు.
తెలంగాణలో ప్రజాపాలన మొదలయ్యిందని.. పేదలకు అండగా నిలబడిన వారికి కాంగ్రెస్ పార్టీలో అవకాశాలుంటాయని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
Also Read: Amitshah in Siddipet: ఇక బీజేపీ వంతు, వారానికి మూడు, సిద్ధిపేటకు 25న అమిత్ షా
ఈ సందర్భంగా రాం జీ గోండు, జల్ జంగల్ జమీన్ పేరు మీద పోరాటం చేసిన కొమురం భీం పోరాటాలను గుర్తు చేశారు. ఇంద్రవెల్లి అమరవీరులకు ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని.. ఇంద్రవెల్లి అమరవీరుల స్థూపాన్ని పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు.
బలహీన వర్గాల జీవితాల్లో వెలుగులు నింపేది కాంగ్రెస్ పార్టేనని సీఎం రేవంత్ రెడ్డి మరోమారు స్పష్టం చేశారు. అటు మోదీ, ఇటు కేసీఆర్ ఇద్దరూ తోడు దొంగలేనని అన్నారు. కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఇయ్యకున్నా కేసీఆర్ చప్పుడు చేయలేదని అన్నారు. మోదీ తెలంగాణకు అన్యాయం చేశారన్నారు. పదేళ్లు మోదీ పాలన చూశారని.. పదేళ్లు కేసీఆర్ పాలన చూశారని.. ఇప్పుడు పదేళ్లు ఇందిరమ్మ రాజ్యాన్ని చూద్దామని పిలుపునిచ్చారు.
Also Read: Vijayashanthi: రేవంత్ సర్కార్‌పై రాములమ్మ మాట
తుమ్మిడిహట్టిలో ప్రాజెక్టు నిర్మించి ఆదిలాబాద్ జిల్లాలో లక్షా 50 వేల ఎకరాలకు నీరందిస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఆ ప్రాజెక్టుకు బీఆర్ అంబేద్కర్ పేరు పెడతామని స్పష్టం చేశారు. అలాగే ఆదిలాబాద్‌లో విశ్వవిద్యాలయం ఏర్పాటు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు.