Big Stories

CM Revanth Reddy: శత్రువు చేతిలో డీకే అరుణ కత్తిలా మారారు.. కొడంగల్‌లో సీఎం రేవంత్ రెడ్డి..

CM Revanth Reddy Speech In Kodangal(Telangana congress news): శత్రువు చేతిలో డీకే అరుణ కత్తిలా మారారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కొడంగల్ ప్రజల ఆశీర్వాదం వల్లే తాను తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యానన్నారు. 33 వేల ఓట్ల మెజార్టీతో తనని గెలిపించారని తాను నామినేషన్ వేశాక ఒక్కసారి కూడా కొడంగల్ రాలేదని తెలిపారు. అయినా కొడంగల్ ప్రజలు తనని గుండెల్లో పెట్టుకుని చూశారని సీఎం రేవంత్ రెడ్డి కొడంగల్ పర్యటనలో పేర్కొన్నారు.

- Advertisement -

కేసీఆర్‌లా తాను ఫామ్ హౌస్‌కు పరిమితమవ్వలేదని రోజుకు 18 గంటలు కష్టపడుతున్నాని తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి రాలేదని కానీ పార్లమెంట్ ఎన్నికల ప్రచారానికి 5 సార్లు వచ్చానని అన్నారు. బీజేపీ- బీఆర్ఎస్ పార్టీలు కుట్రలు చేస్తున్నారని పేర్కొన్నారు. 70 ఏళ్లలో పాలమూరుకు ఎంతో అన్యాయం జరిగందన్నారు. కృష్ణా-వికారాబాద్ రైల్వే లైన్‌లో ఎలాంటి పురోగతి లేదని చెప్పారు.

- Advertisement -

అధికారం చేపట్టిన వంద రోజుల్లోనే కొడంగల్‌కు 5 వేల కోట్ల రూపాయల నిధుల తీసుకొచ్చామని సీఎం రేవంత్ రెడ్డి గుర్తుచేశారు. 4 వేల కోట్ల రూపాయలతో మక్తల్- నారాయణపేట్- కొడంగల్ ఎత్తిపోతల పథకాన్ని తీసుకొచ్చామని.. దీంతో లక్షా 30 వేల ఎకరాలకు నీటిని ఇస్తామని అన్నారు. కృష్ణా జలాలను అడ్డుకున్నది డీకే అరుణ అని ఫైర్ అయ్యారు. పాలమూరు అభివృద్ధిని అడ్డుకుంది డీకే అరుణ అని అన్నారు. తనకు డీకే అరుణపై కోపం లేదని తెలిపారు. శత్రువు చేతిలో సురకత్తివై డీకే అరుణ పాలమూరు కడుపును పొడుస్తున్నారని మండిపడ్డారు.

Also Read: రేవంత్ సర్కార్‌పై రాములమ్మ మాట

పదేళ్లు నరేంద్ర మోదీ ప్రధానిగా ఉన్నా పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఎందుకు తేలేదని సీఎం రేవంత్ రెడ్డి డీకే అరుణపై విమర్శల వర్షం గుప్పించారు. పాలమూరు మీద సవతి ప్రేమ చూపించిన కేసీఆర్ పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును కమీషన్ల కోసం వాడుకున్నారని ఫైర్ అయ్యారు. ఐదేళ్లు తనకు అండగా ఉండండి వందేళ్ల అభివృద్ధి చేసుకుందామని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు.

ఇప్పటికే 5 గ్యారంటీలను అమలు చేశామని.. పంద్రాగస్టులోపు రైతురుణ మాఫీ చేస్తామని తెలిపారు. తాను బాధ్యత తీసుకున్న రోజు రూ. 3900 కోట్ల లోటు బడ్జెట్ ఉందని 5 నెలల్లో రూ. 26 వేల కోట్లు అప్పు కట్టానని స్పష్టం చేశారు. ఆర్టీసీ సంస్థ నష్టాల్లో ఉంటే ఆదుకున్నామని తెలిపారు. ఆగస్టు 15 లోపు రుణమాఫీ చేస్తే బీఆర్ఎస్ పార్టీని రద్దు చేసుకుంటారా అని సీఎం రేవంత్ రెడ్డి హరీశ్ రావుకు సవాల్ విసిరారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News