Big Stories

Mumbai Indians: ముంబై డేంజర్ బెల్స్.. మూసుకుపోతున్న ప్లే ఆఫ్ దారులు

Mumbai Indians Playoffs Scenario: ఎంతో ఉత్సాహంగా, ఉత్తేజంగా, ఎన్నో అంచనాలతో ఐపీఎల్ 2024లో ముంబై ఇండియన్స్ అడుగుపెట్టింది. కానీ అంతకన్నా ఎక్కువ వివాదాలను మోసుకొచ్చింది. ముఖ్యంగా హార్దిక్ పాండ్యా కెప్టెన్సీ మార్పు సృష్టించిన తలనొప్పి మామూలుగా లేదు. అంతకుమించి జట్టు ఓడిపోవడాన్ని కూడా అభిమానులు జీర్ణించుకోలేక పోతున్నారు.

- Advertisement -

ఇదిలా ఉండగా 5 సార్లు ట్రోఫీ గెలిచిన ముంబై జట్టు ఈసారి ప్లే ఆఫ్ కి కూడా వెళ్లేలా కనిపించడం లేదని అంటున్నారు. నెమ్మది నెమ్మదిగా ఒకొక్క దారులు మూసుకుపోతున్నాయని అంటున్నారు. ఎందుకంటే ప్లే ఆఫ్ కి  చేరాలంటే కనీసం 8 మ్యాచ్ లు గెలవాల్సి ఉంటుంది. అలా 16 పాయింట్లు వస్తే ధీమాగా వెళ్లవచ్చు.

- Advertisement -

ఒకవేళ 16 పాయింట్లు మరొక టీమ్ సాధించిన నెట్ రన్ రేట్ ఆధారంగా వెళ్లే అవకాశాలున్నాయి. ఎందుకంటే ఐపీఎల్ లో ప్రతీ టీమ్ 14 మ్యాచ్ లు ఆడుతుంది. ముంబై ఆల్రడీ ఇప్పటికి 8 మ్యాచ్ లు ఆడేసింది. ఇంక 6 మాత్రమే ఆడాల్సినవి ఉన్నాయి.

ఆడిన 8 మ్యాచ్ ల్లో 3 మాత్రమే గెలిచింది. అంటే ఇప్పటికి తన ఖాతాలో 6 పాయింట్లు మాత్రమే ఉన్నాయి. 16 పాయింట్లు రావాలంటే ఇక్కడ నుంచి వరుసపెట్టి 5 మ్యాచ్ ల్లో గెలిస్తే 16 వస్తాయి. అంతకుమించి 6 గెలిచి 12 పాయింట్లు సంపాదిస్తే, మొత్తం 18 పాయింట్లతో కళ్లు మూసుకుని ప్లే ఆఫ్ కి చేరిపోవచ్చు.

కానీ ఇప్పటికే 5 మ్యాచ్ లు ఓడిపోయిన ముంబై మళ్లీ పుంజుకుని వరుసగా గెలవగలదా? అనే సందేహాలు నెట్టింట వ్యక్తమవుతున్నాయి. ఆల్రడీ ఆర్సీబీ ఇంటిదారి పట్టినట్టేనని అంతా ఫిక్స్ అయిపోయారు. మరో రెండు మ్యాచ్ ల తర్వాత ముంబయి పరిస్థితి అంతేనని అంటున్నారు.

Also Read: ఐపీఎల్ తొలి బౌలర్ గా చాహల్.. 200 వికెట్లు తీసిన తొలి క్రికెటర్ గా రికార్డ్

ముఖ్యంగా హార్దిక్ పాండ్యాలో నాయకత్వ లక్షణాలు లేవని అంటున్నారు. టీమ్ ని నడిపించే సామర్థ్యాలు లేవని, మూర్ఖత్వంగా వెళుతున్నాడనే విమర్శలు  వినిపిస్తున్నాయి. ఇలాగే తన వ్యవహార శైలి ఉంటే మాత్రం జట్టులో ఎవరూ మనస్ఫూర్తిగా ఆడలేరని అంటున్నారు. అది తన కెప్టెన్సీకి ప్రమాదమే కాదు, జట్టుకి ఇంకా ప్రమాదమకరమని అంటున్నారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News