IND VS NZ Final: ఆరంభం నుండి ఎంతో రసవత్తరంగా సాగి.. క్రికెట్ ప్రేమికులను ఎంతగానో ఆకట్టుకున్న ఐసీసీ ఛాంపియన్ ట్రోపీ 2025 చివరి అంకానికి చేరుకుంది. ఛాంపియన్స్ ట్రోఫీలోని ఫైనల్ మ్యాచ్ కోసం ఇరుజట్లు మైదానంలో అడుగు పెట్టాయి. దుబాయ్ వేదికగా జరుగుతున్న ఈ హోరాహోరీ పోరులో టాస్ గెలిచిన న్యూజిలాండ్ జట్టు మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. దీంతో రోహిత్ సేన మొదట బౌలింగ్ ప్రారంభించింది.
Also Read: Shubman Gill: రోహిత్ శర్మ రిటైర్మెంట్ పై గిల్ సీరియస్.. ఎవడ్రా మీకు చెప్పిందంటూ ?
ఇక భారత జట్టు ఎలాంటి మార్పు లేకుండానే బరిలోకి దిగగా.. న్యూజిలాండ్ జట్టు మాత్రం ఒక్క మార్పు చేసింది. స్టార్ పేసర్ మాట్ హెన్రీ స్థానంలో.. నాథన్ స్మిత్ ఆడుతున్నట్లు న్యూజిలాండ్ కెప్టెన్ శాంట్నర్ తెలిపాడు. ఇక ఈ మ్యాచ్ లో భారత జట్టు మరోసారి చేజింగ్ చేయనుంది. ఈ టోర్నీలో ఇప్పటివరకు భారత జట్టు చేజింగ్ లో అద్భుత ప్రదర్శన కనబరిచింది. ముఖ్యంగా చేజింగ్ అంటే చెలరేగిపోయే విరాట్ కోహ్లీ పై అభిమానులు భారీ ఆశలు పెట్టుకున్నారు.
మైదానంలో హాట్ ఫేవరెట్ “చక్ దే ఇండియా” స్లొగన్స్ తో హోరెత్తిస్తున్నారు. మరోవైపు ఈ ఫైనల్ పోరులో భారత జట్టు విజయం సాధించాలని అభిమానులు పలు ఆలయాలలో పూజలు చేస్తున్నారు. హైదరాబాద్ లోని ఖైరతాబాద్ గణేష్ ఆలయంలో పూజలు నిర్వహించారు. అయితే భారత జట్టు గెలుపు కోసం ఓ బాలుడు పెద్ద సాహసమే చేశాడు. ఈ ఫైనల్ మ్యాచ్ లో భారత జట్టు గెలుపొందాలని వేడి వేడి మూకుడులో కూర్చొని దండం పెట్టి ప్రార్థనలు చేశాడు.
దీంతో ఆ బాలుడు వేడివేడి మూకుడులో కూర్చున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మరింది. ఆ బాలుడి చుట్టూ చేరిన ప్రజలు సైతం ఆసక్తిగా చూడ సాగారు. ఇక ఈ ఉత్కంఠ భరిత పోరులో గ్రహాల స్థానాల ఆధారంగా భారత జట్టుకు అనుకూలమైన దశలు ఉన్నాయని, ఇరుజట్ల గ్రహ ప్రభావాలను వివరంగా విశ్లేషిస్తే భారత జట్టు విజయం సాధిస్తుందని జ్యోతిష్య శాస్త్రం అంచనా వేస్తోంది.
Also Read: IND VS NZ Final: టీమిండియాకు గుడ్ న్యూస్..ఫైనల్ ఆడుతున్న కోహ్లీ.. జట్ల వివరాలు ఇవే ?
ఈ మ్యాచ్ లో విజయ అవకాశాలు ఎలా ఉంటాయో ఇప్పటికే చాలామంది క్రీడా నిపుణులు తమ అంచనాలను వెల్లడించారు. గత టి-20 వరల్డ్ కప్ లో సూర్య కుమార్ యాదవ్ అద్భుత క్యాచ్ ద్వారా భారత జట్టు విజయం సాధించింది. ఇక 2000 సంవత్సరంలో న్యూజిలాండ్ చేతిలో భారత జట్టు ఓటమిని చవిచూసింది. కానీ ఈరోజు భారత జట్టు కప్పు గెలుస్తుందని, విజయ అవకాశాలు ఎక్కువగా భారత జట్టుకే ఉన్నాయని చెబుతున్నారు క్రీడా పండితులు. 2000 సంవత్సరంలో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ, 2019 ఐసీసీ వరల్డ్ కప్ సెమీఫైనల్, 2021 ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ టోర్నీలలో న్యూజిలాండ్ చేతిలో ఓడిపోయినందుకు భారత జట్టు ప్రతీకారం తీర్చుకోవాలని చూస్తోంది.
టీమిండియా విజయం కోసం ఓ బాలుడి సాహసం
వేడి వేడి మూకుడులో కూర్చుని ప్రార్థనలు pic.twitter.com/3noSbHM4CO
— BIG TV Breaking News (@bigtvtelugu) March 9, 2025