BigTV English
Advertisement

Watch Video: ఐఏఎస్ ఆఫీసరై ఉండి.. స్టూడెంట్‌తో దారుణ ప్రవర్తన, వీడియో వైరల్

Watch Video: ఐఏఎస్ ఆఫీసరై ఉండి.. స్టూడెంట్‌తో దారుణ ప్రవర్తన, వీడియో వైరల్

Watch Video: మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఓ ఐఏఎస్ ఆఫీసర్ ఎగ్జామ్ రాస్తున్న స్టూడెంట్ చెంపదెబ్బలు కొట్టడం తీవ్ర సంచలనంగా మారింది. అయితే ఈ సంఘటన మూడు నెలల కింద జరిగింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ కావడంతో వార్త తెరపైకి వచ్చింది. ఎగ్జామ్ రాస్తున్న స్టూడెంట్ దగ్గరకు వెళ్లిన ఐఏఎస్ ఆఫీసర్ చెంపలపై బలంగా కొట్టిన వీడియో తెగవైరల్ గా మారింది. దీనికి సంబంధించిన వివరాల గురించి క్లియర్ కట్‌గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.


వీడియోలో కనిపిస్తున్న ఐఏఎస్ ఆఫీసర్ పేరు సంజీవ్ శ్రీ వాస్తవ. ఆయన భిండ్ జిల్లా మేజిస్ట్రేట్ గా విధులు నిర్వహిస్తున్నారు. అయితే ఏప్రిల్ 1వ తారీఖున దీన్ దయాళ్ దంగ్రౌలియా మహా విద్యాలయంలో బీఎస్సీ సెకండియర్ మ్యాథ్స్ ఎగ్జామ్ జరుగుతోంది. శ్రీవాస్తవ చేతిలో ప్రశ్నా పత్రం పట్టుకుని స్టూడెంట్ ను బలంగా ముఖంపై లాగి రెండు దెబ్బలు కొట్టినట్టు స్పష్టంగా కనిపిస్తోంది. అనంతరం ఆ ఆఫీసర్ స్టూడెంట్ వైపు చూపిస్తూ రూంలోని ఓ అధికారికి పేపర్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఆ స్టూడెంట్ ఐఏఎస్ అధికారి బలంగా కొట్టడం వల్ల చెవి దెబ్బతిందని చెప్పాడు. కొట్టింది ఐఏఎస్ ఆఫీసర్ కాబట్టి ఏం చేయలేకపోయానని తెలిపాడు.

ఇదిగో వీడియో


సంఘటనపై ఐఏఎస్ ఆఫీసర్ సంజవ్ శ్రీవాస్తవ మాట్లాడారు. అతని చేసిన పనిని సమర్థించుకున్నారు. ఎగ్జామ్ హాల్ లో  చీటింగ్ జరుగుతోందని తనకు సమాచారం వచ్చిందని అన్నారు. కొంత మంది స్టూడెంట్స్ ప్రశ్నా పత్రాన్ని బయటకు పంపి.. వాటి సమాధానాలను కాపీ కొట్టారని చెప్పుకొచ్చారు. ఇందువల్లే తాను ఆ కాలేజీకి వెళ్లాల్సి వచ్చిందని అన్నారు. విద్యార్థులు ఎగ్జామ్ హాల్ లో నకిలీకి పాల్పడవద్దని ఇలా చేసినట్టు సమర్థించుకున్నారు.

ALSO READ: Job Updates: 1340 జేఈ ఉద్యోగాలు, ఈ క్వాలిఫికేషన్ ఉంటే ఉద్యోగం నీదే భయ్యా

అయితే, కొన్ని వివరాల ప్రకారం ఆ కాలేజీ మధ్యప్రదేశ్‌లో ప్రతిపక్ష నాయకుడు హేమంత్ కటారే మామ నారాయణ్ దంగ్రౌలియాకు చెందినట్టు తెలుస్తోంది. మరోవైపు ఐఏఎస్ ఆఫీసర్ సంజీవ్ శ్రీవాస్తవ వివాదాస్పద కారణాల వల్ల వెలుగులోకి రావడం ఇదేం ఫస్ట్ టైం కాదు. గతంలో మధ్యప్రదేశ్ హైకోర్టు గ్వాలియర్ బెంచ్, పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్‌కు సంబంధించిన కేసును విచారిస్తున్నప్పుడు శ్రీ శ్రీవాస్తవ ప్రవర్తన బాగోలేదని చెప్పింది. అలాంటి ఆఫీసర్ ఈ రంగంలో కొనసాగాలా వద్దా అనేది సీఎస్ నిర్ణయించుకోవాలని చెప్పారు.

ALSO READ: DRDO Recruitment: డీఆర్‌డీవోలో 152 ఉద్యోగాలు, దరఖాస్తుకు ఇంకా 5 రోజులే ఛాన్స్

అలాగే.. భిండ్‌లో విధులు నిర్వహిస్తున్న ఎమ్మార్వో మాలా శర్మ ఇటీవల కలెక్టర్ శ్రీవాస్తవ తనను మానసికంగా వేధించారని ఆరోపించారు. సీఎంకి రాసిన లేఖలో ఆమె ఈ హింస కారణంగా తనకు ఏదైనా జరిగితే కారణం కలెక్టర్ సంజీవ్ శ్రీవాస్తవ అనే రాసుకొచ్చింది. అయితే.. తాజాగా స్టూడెంట్ ను చెంలపై బలంగా కొట్టిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. ఈ సంఘటన అధికారుల బాధ్యతపై చర్చలకు దారితీసింది.

Related News

Saudi Crime: ఎన్‌కౌంటర్లో చిక్కుకున్నాడు.. చనిపోయే ముందు భార్యకు వాయిస్ నోట్ పంపాడు!

ISIS terrorist confess: పాక్ బట్టలిప్పిన టెర్రరిస్ట్.. ఐసీస్ ఉగ్రవాదులకు శిక్షణ ఇస్తున్నారంటూ వాంగ్మూలం

Aadhaar Updates: ఇకపై ఆధార్ అప్డేట్ చాలా సింపుల్.. నవంబర్ 1 నుంచి కొత్త రూల్స్

Mumbai Hostage: 5 రోజుల ప్లానింగ్, 3 గంటల భయం, ఒక్క బుల్లెట్‌కు హతం.. ఇది కిడ్నాపర్ కథ!

NDA Manifesto: యువతకు కోటి ఉద్యోగాల హామీ.. బీహార్ ఎన్డీయే మేనిఫెస్టో రిలీజ్

PM Modi: సర్దార్‌ వల్లభాయ్ పటేల్‌కు.. ప్రధానీ మోదీ నివాళి

Bengaluru: బెంగళూరులో చెత్తను ఇళ్ల గుమ్మం వద్ద వేస్తున్న మున్సిపల్ అధికారులు.. ఎందుకంటే!

Fake Eno: మార్కెట్ లో నకిలీ ఈనో ప్యాకెట్లు.. ఈజీగా గుర్తు పట్టాలంటే ఇలా చేయండి

Big Stories

×