Baahubali Re-release : కొన్ని కథలు పేపర్ మీద చూడడానికి బాగుంటాయి. అలానే కొన్ని వినడానికి కూడా బాగానే ఉంటాయి. కొన్ని ఊహించడానికి ఇంకా బాగుంటాయి. కానీ అదే కథలను వెండితెరపై ఆవిష్కరించాలి అంటే అది సాధారణమైన విషయం కాదు. దాని వెనక ఎంతో కృషి, శ్రమ, పట్టుదల ఉండాలి. ఊహించడమే కష్టం అనుకున్న కొన్ని కథలను వెండితెరపై ఆవిష్కరించే ప్రయత్నాలు చేస్తుంటారు కొంతమంది దర్శకులు. ముఖ్యంగా ఎస్ఎస్ రాజమౌళి విషయానికి వస్తే బాహుబలి సినిమా తెలుగు సినిమా పరిశ్రమకు ఎంత ప్రత్యేకమైనదో అందరికీ తెలిసిన విషయమే. ఆ సినిమా పదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా మరోసారి ప్రేక్షకులు ముందుకు తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నారు.
బాహుబలి డ్యూరేషన్
బాహుబలి సినిమాకు సంబంధించిన డ్యూరేషన్ దాదాపు 5 గంటలను మించి ఉంటుంది ఇప్పుడు చిత్ర యూనిట్ దానిపైన ప్రత్యేక శ్రద్ధ పెట్టి దానిని కేవలం నాలుగు గంటలు వచ్చేవరకు పనిచేశారు. దీనిలో డిలీటెడ్ సీన్స్ కూడా యాడ్ చేశారు. అయితే ఈ డ్యూరేషన్ ని ఇంకో 20 నిమిషాలు తగ్గించే ప్రయత్నం చేస్తుంది చిత్ర యూనిట్. బాహుబలి పూర్తి సినిమా ని 3:40 – 3:45 నిమిషాలు డ్యూరేషన్ వచ్చేలా ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం మహేష్ బాబు తో సినిమా చేస్తున్న రాజమౌళి షెడ్యూల్ గ్యాప్ లో ఈ పనిని పెట్టుకున్నారు. దీనిపైన కొంతమంది బాహుబలి ఫస్ట్ అఫ్ మొత్తాన్ని తీసేయొచ్చు అంతగా ఏమీ ఉండదని కామెంట్స్ కూడా చేస్తున్నారు. కానీ ప్రభాస్ అభిమానులకి ప్రతి సీన్ చూడాలి అని ఉంటుంది. దానిని రాజమౌళి జాగ్రత్తగా హ్యాండిల్ చేసి ప్రజెంట్ చేస్తారా లేదా అనేది రిలీజ్ తర్వాత తెలుస్తుంది.
తెలుగు సినిమా మార్కెట్ పెరిగింది
నత్త నడకలా సాగుతున్న తెలుగు సినిమా మార్కెట్ ను ఒక్కసారిగా షేక్ చేశాడు ఎస్ ఎస్ రాజమౌళి. మొదటి ఈ సినిమాను నిర్మిస్తున్నప్పుడు దాదాపు 200 కోట్లు బడ్జెట్ అంటున్నారు. ప్రభాస్ కి అంత మార్కెట్ లేదు కదా అని అందరూ అప్పట్లో చర్చించుకోవడం మొదలుపెట్టారు. కానీ ఈ సినిమాను జనాల్లోకి తీసుకెళ్లిన విధానం నెక్స్ట్ లెవెల్ అనిపించింది. వాస్తవానికి ఈ సినిమాకి మొదట ఇక్కడ నెగెటివ్ టాక్ వచ్చింది. కానీ బాలీవుడ్ లో ఈ సినిమాకి ఆడియన్స్ బ్రహ్మరథం పెట్టారు. ఆ తర్వాత ఇక్కడ కూడా సినిమా పెద్ద హిట్ అయిపోయింది. సెకండ్ పార్ట్ వచ్చిన తర్వాత బాహుబలి సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేసింది. తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఈ రికార్డుని కొట్టడానికి చాలామంది విశ్వ ప్రయత్నాలు చేశారు కానీ అవి పెద్దగా వర్కౌట్ కాలేదు.
Also Read: Junior Pre Release Event: గాలి కిరీటితో స్టెప్పులు అదరగొట్టిన శివన్న, వీడియో వైరల్