Deepika Padukone: సినీ సెలబ్రిటీలు అంటే పెళ్లయినా, పిల్లలు పుట్టినా తమ కమిట్మెంట్స్‌ను మాత్రం పక్కన పెట్టలేదు. ఒకప్పుడు హీరోయిన్లు పెళ్లయిన తర్వాత కెరీర్‌ను పక్కన పెట్టాల్సిందే. ఒకవేళ వారికి పిల్లలు పుడితే ఇంక వారికి సినిమాల్లో అవకాశాలు రావు లాంటి విషయాలను ప్రేక్షకులు నమ్మేవారు. దాదాపు చాలామంది హీరోయిన్స్ అలాగే చేసేవారు కూడా. కానీ రోజులు చాలా మారిపోయాయి. పెళ్లయిన తర్వాత కూడా హీరోయిన్లు బిజీ అవుతున్నారు. తాజాగా బాలీవుడ్ కపుల్ దీపికా పదుకొనె, రణవీర్ సింగ్.. ఒక బిడ్డకు జన్మనిచ్చారు. పాప పుట్టిన తర్వాత మొదటిసారి ఒక ఈవెంట్‌కు వెళ్లి అక్కడ స్టేజ్‌పై రచ్చ రచ్చ చేసింది దీపికా పదుకొనె.
మొదటిసారి ఈవెంట్‌లో
బాలీవుడ్‌లో క్యూట్ కపుల్‌గా పేరు తెచ్చుకున్న వారిలో రణవీర్ సింగ్, దీపికా పదుకొనె కూడా ఒకరు. అలాంటి క్యూట్ కపుల్‌కు ఇటీవల పాప పుట్టింది. తనకు దువా సింగ్ పదుకొనె అనే పేరు పెడుతున్నట్టు సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది ఈ జంట. అలా పాప పేరు ప్రకటించిన తర్వాత ఈ పేరుపై కూడా చాలా కాంట్రవర్సీలు జరిగాయి. దువా అంటే ఉర్దు పేరు అని, హిందువులు అయ్యిండి పాపకు అలాంటి పేరు ఎలా పెడతారని ఈ జంటను తెగ ట్రోల్ చేశారు నెటిజన్లు. అవన్నీ వీరు పట్టించుకోలేదు, వీటిపై స్పందించలేదు. పాప పుట్టిన తర్వాత దీపికా, రణవీర్ ఏ ఈవెంట్‌లో కూడా పాల్గొనలేదు. కానీ మొదటిసారి దీపికా బయటికొచ్చి ఫ్యాన్స్ ముందు అల్లరి చేసింది.
Also Read: ‘పుష్ప 2’ పై విమర్శలకు కౌంటర్… వాళ్ళందరికీ గడ్డి పెట్టిన జాన్వీ
వీడియోలు షేర్
ప్రస్తుతం ప్రముఖ పంజాబీ సింగర్ అయిన దిల్జిత్ దోశాంజ్ (Diljit Dosanjh).. దేశవ్యాప్తంగా కాన్సర్ట్స్ చేస్తూ తన ఫ్యాన్స్‌ను కలుస్తూ, తన పాటలతో అందరినీ అలరిస్తున్నాడు. తాజాగా బెంగుళూరులో దిల్జిత్ కాన్సర్ట్ జరిగింది. అదే సమయంలో బెంగుళూరులోనే ఉన్న దీపికా.. తన ఫ్రెండ్స్‌తో కలిసి ఈ కాన్సర్ట్‌కు వెళ్లింది. కాన్సర్ట్‌కు వెళ్తున్నప్పుడు ఫోటోలు, వీడియోలు కూడా షేర్ చేసింది. తన కాన్సర్ట్‌కు దీపికా కూడా వచ్చిందని తెలుసుకున్న దిల్జిత్.. తనను స్టేజ్‌పై పిలిచాడు. దీంతో స్టేజ్ ఎక్కిన దీపికా.. కన్నడలోనే ప్రేక్షకులను పలకరించింది. ‘‘ఎలా ఉన్నారు’’ అని కన్నడలో అడిగింది. దీంతో దిల్జిత్ కూడా తనకు కన్నడ నేర్పించమని దీపికాను అడిగాడు.
కన్నడ ఫ్యాన్స్ ఖుషి
కన్నడలో ఐ లవ్ యూ ఎలా చెప్పాలో స్టేజ్‌పైనే దిల్జిత్‌కు నేర్పింది దీపికా. తను చెప్పింది చెప్పినట్టుగా ఫ్యాన్స్‌కు చెప్పాడు దిల్జిత్. దీంతో దిల్జిత్ ఫ్యాన్స్‌తో పాటు దీపికా పదుకొనె (Deepika Padukone) ఫ్యాన్స్ కూడా తెగ సంతోషించారు. ముఖ్యంగా వారిద్దరూ కన్నడలో మాట్లాడడం అక్కడి ఫ్యాన్స్‌ను మరింత సంతోషపెట్టింది. ప్రస్తుతం తన అప్‌కమింగ్ ప్రాజెక్ట్స్‌పై ఎలాంటి క్లారిటీ లేదు. దువా పుట్టిన తర్వాత తను సోషల్ మీడియాలో కూడా అంత యాక్టివ్‌గా ఉండడం లేదు. అందుకే ఈ కాన్సర్ట్‌లో దీపికా పాల్గొన్న వీడియోలు చూసి సంతోషిస్తున్నారు ఫ్యాన్స్.
Deepika Padukone teaching Kannada to Diljit Singh 🔥
Her first film was Ashwariya with @nimmaupendra if you remember 😄#DeepikaPadukone #DiljitDosanjh pic.twitter.com/cHBklEf2cB
— Roshan ᵀᵒˣᶦᶜ 🃏 (@Roshan_RSY) December 6, 2024