Big Stories

CM Revanth Reddy: త్వరలోనే మెగా డిఎస్సీ.. చేవెళ్ల సభలో సీఎం రేవంత్ రెడ్డి

Revanth reddy Chevella public meeting

- Advertisement -

Revanth reddy Chevella public meeting(Telangana news live): తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం వచ్చిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నిర్వహించిన’జనజాతర’ బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. అసెంబ్లీ ఎన్నికల్లో చూపించిన మాదిరి పార్లమెంట్ ఎన్నికల్లోనూ సత్తా చాటాలని పార్టీ నేతలకు పిలుపునిచ్చారు.

- Advertisement -

గత ప్రభుత్వంలో అణిచివేతకు గురైన అందరూ కాంగ్రెస్ వైపు ఉన్నారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీ విజయంలో ఎందరో కార్యకర్తలు శ్రమ, రక్తం ఉందన్నారు. కార్యకర్తల త్యాగాన్ని ఎప్పటికీ మర్చిపోలేనన్నారు. వాళ్ల రుణం తీర్చుతానని టైమ్ వచ్చిందన్నారు. సోనియా గాంధీ సెప్టెంబర్ 17వ తేదీన తెలంగాణకు వచ్చి ఆరు గ్యారంటీలు మాట ఇచ్చిందని గుర్తు చేశారు. ఇచ్చిన మాట ప్రకారం అధికారంలకి వచ్చిన రెండు రోజుల్లోనే రెండు కీలక హామీ అమలు చేసి చూపించామన్నారు. ఇప్పుడు మరో రెండు గ్యారెంటీలను అమలు చేశామన్నారు.

ఇచ్చిన మాటను సోనియా గాంధీ, కాంగ్రెస్ పార్టీ ఏనాడు తప్పలేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ ప్రజల చిరకాల కోరికన తెలంగాణను కోట్లాది ప్రజల ముఖాల్లో చిరునవ్వు కోసం చిరునవ్వు నింపారని అన్నారు. రాజీవ్ ఆరోగ్య శ్రీ పథకాన్ని గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే రాజీవ్ ఆరోగ్య శ్రీ రూ.10 లక్షలకు పెంచామని తెలిపారు. ఇవాళ్ల పేద ప్రజలు సైతం పెద్ద పెద్ద కార్పొరేట్ ఆసుపత్రులకు వెళ్లి చికిత్సలు చేయించుకుంటున్నారని అన్నారు.

పేదల గురించే కాదు.. నిరుద్యోగుల గురించి కేసీఆర్ ఏనాడూ ఆలోచించలేదని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. కేవలం తన కుటుంబ సభ్యులకు మాత్రమే అందరికీ ఉద్యోగాలు ఇప్పించుకున్నాడని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండు నెలల్లోనే 25వేల మందిరికి ఉద్యోగ నియామక పత్రాలు ఇచ్చామన్నారు. త్వరలోనే మెగా డిఎస్సీ వేసి భారీ స్థాయిలో ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు.

పోరాటాల నేపథ్యంలో ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. అభయ హస్తం మాటను సోనియా గాంధీ ఇచ్చిందన్నారు. ఇచ్చిన ప్రతి మాటను నిలబెట్టుకుంటామని అన్నారు. గత ప్రభుత్వం నిరుద్యోగులను మోసం చేసిందన్నారు. అధికారంలోకి వచ్చిన తమ ప్రభుత్వం 2 లక్షల ఉద్యోగాలను పూర్తి చేస్తామన్నారు.

గత ప్రభుత్వం ప్రాణహిత- చేవెళ్ల ప్రాజెక్టు పక్కకు పెట్టి ఈ ప్రాంతానికి నీళ్లురాకుండా చేసిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. తమ్మిడి హట్టి వద్ద కట్టాల్సిన ప్రాజెక్టును మేడిగడ్డ వద్ద కట్టారన్నారు. నిపుణులు ,ఇంజనీర్లు వద్దంటున్న మేడిగడ్డ వద్ద కట్టారన్నారు. అద్బుతంగా కట్టామని చెప్పుకుంటున్న కేసీఆర్ చెప్పిన ప్రాజెక్టుకు ఇవాళ్ల పగుళ్లు ఏర్పడ్డాయన్నారు. గత పాలకులకు రూ. లక్ష కోట్ల నిధులు గోదావరిలో పోసి వృధా చేశారన్నారు.

Read More: రూ.500లకే వంట గ్యాస్.. 200 యూనిట్ల ఉచిత విద్యుత్.. పథకాలను ప్రారంభించిన సీఎం..

అంతకు ముందు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మాట్లాడతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే రెండు గ్యారెంటీలను అమలు చేసి చూయించిందన్నారు. రాష్ట్రంలో గత ప్రభుత్వం ఉద్యోగులకు వేతనాలు కూడా ఇవ్వలేదన్నారు. ఉన్న ఖజానాను మొత్తం ఖాళీ చేశారరన్నారు. రాష్ట్రాన్ని అభివృద్ది చేయకుండా ఉన్నది లేనట్లు, లేనిది ఉన్నట్లు క్రియేట్ చేశారన్నారు.

మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ హస్తంలో ఆరు గ్యారంటీలను ఖచ్చితంగా అమలు చేస్తామన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన ప్రతి అంశాన్ని అమలు చేస్తామన్నారు. గత పాలకులకు కాంగ్రెస్ వచ్చేది లేదు.. ఇచ్చేదు లేదు అని వెటకారంగా మాట్లాడారన్నారు. ప్రజా బలంతో అధికారంలోకి వచ్చి చూపించామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడే నాటికి ఖజానాలో చిల్లిగవ్వ కూడా లేదన్నారు. ఖజానా ఖాళీ ఉన్నప్పటికీ ఇచ్చిన హామీలు అమలు చేస్తున్నామన్నారు. ఆర్థిక క్రమ శిక్షణతో పని చేస్తూ.. నిధులు సమకూర్చుకుని ప్రనజలకు మేలు చేస్తున్నామన్నారు.

మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ కాంగ్రెస్  ప్రభుత్వ ఏర్పడిన 48 గంటల్లోనే గ్యారంటీలను అమలు చేశామని  అన్నారు. రూ. 500లకే గ్యాస్ సిలిండర్ పథకాన్ని నేడు ప్రారంభించుకున్నామన్నారు. ఈ పదేళ్లలో మోదీ సర్కార్ తెలంగాణకు ఇచ్చింది ఏమీ లేదన్నారు. విభజన హామీలను నెరవేర్చని బీజేపీకి ఎందుకు ఓటు వేయాలని ఆయన ప్రశ్నించారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News