BigTV English

CM Revanth Reddy: రూ.3లక్షల కోట్ల పెట్టుబడులు, లక్ష ఉద్యోగాలు సృష్టించాం: సీఎం రేవంత్

CM Revanth Reddy: రూ.3లక్షల కోట్ల పెట్టుబడులు, లక్ష ఉద్యోగాలు సృష్టించాం: సీఎం రేవంత్

CM Revanth Reddy: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి ఇప్పటివరకు రాష్ట్రంలో రూ. 3 లక్షల కోట్ల పెట్టుబడులు, 1 లక్షకు పైగా ఉద్యోగాలు సృష్టించామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. సొనాటా సాఫ్ట్ వేర్ సంస్థ కొత్త ఫెసిలిటీ సెంటర్ ప్రారంభోత్సవంలో సీఎం మాట్లాడారు. సొనాటా సాఫ్ట్‌వేర్ సంస్థ నూతన ఫెసిలిటీ సెంటర్‌ను ప్రారంభించుకున్న సందర్భంగా ఉద్యోగులు, యాజమాన్యం, అందరికీ సీఎం శుభాభినందనలు తెలిపారు.


సొనాటా సాఫ్ట్‌వేర్ అత్యాధునిక AI ని ఉపయోగించి పర్యావరణ వ్యవస్థలను రూపొందించడం గర్వకారణమని సీఎం చెప్పారు. ‘హైదరాబాద్ మహానగరం సాఫ్ట్‌వేర్ రంగంలో, లైఫ్ సైన్సెస్‌ రంగంలో ఇంకా అనేక రంగాల్లో జీసీసీ (గ్లోబల్ కేపబిలిటీ సెంటర్)కు హబ్‌గా మారింది. అలాగే AI-రెడీ డేటా సెంటర్లు, తయారీ రంగాలకు కేంద్రంగా మారింది. మైక్రోసాఫ్ట్, కాగ్నిజెంట్, HCL టెక్, ఇన్ఫోసిస్, విప్రో వంటి IT దిగ్గజాలు తమ క్యాంపస్‌లను విస్తరిస్తున్నాయి. తెలంగాణ ప్రజా ప్రభుత్వం రైతులు, మహిళలు, యువత, విద్యార్థులు, సీనియర్ సిటిజన్ల సంక్షేమం కోసం పనిచేస్తూనే…. పరిశ్రమలకు మద్దతు ఇస్తూ ఆర్థిక వ్యవస్థను అభివృద్ధి చేస్తోంది’ అని సీఎం రేవంత్ అన్నారు.

‘2025లో దావోస్‌లో తెలంగాణ రూ. 1.78 లక్షల కోట్ల పెట్టుబడులు రాబట్టి నంబర్ 1 రాష్ట్రంగా నిలిచింది. దేశీయంగా, అంతర్జాతీయంగా పెట్టుబడుల ఆకర్షణలో అగ్రస్థానంలో ఉంది. రాష్ట్రం పోలీసింగ్, శాంతిభద్రతలు, ద్రవ్యోల్బణ నిర్వహణ, ఉద్యోగ సృష్టి, పన్ను వసూళ్లలో నంబర్ వన్ గా ఉంది. రూ.66 లక్షల మహిళలకు స్వయం సహాయక బృందాల ద్వారా సాధికారత, రాజీవ్ యువ వికాసం ద్వారా యువత వ్యాపారాలు, స్వయం ఉపాధికి అవసరమైన నిధులు ప్రభుత్వం అందిస్తోంది. హైదరాబాద్ ట్రాఫిక్ ఫోర్స్‌లో ట్రాన్స్‌జెండర్ స్వచ్ఛంద సేవకులను నియమించిన మొదటి రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది’ అని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.


Also Read: BRS : కవితకు పొగ పెడుతున్నది ఎవరు? కష్టపెడుతున్నది ఎవరు?

‘డ్రై పోర్టు నిర్మాణం, ఆంధ్రప్రదేశ్ సముద్ర ఓడరేవుతో అనుసంధానం, ఫ్యూచర్ సిటీలో AI నగరం, యంగ్ ఇండియా స్కిల్స్, స్పోర్ట్స్ యూనివర్సిటీలు, ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మాణం జరుగుతోంది. ప్రపంచంలోనే గొప్ప ఈవెంట్లలో ఒకటిగా పేరుపొందిన మిస్ వరల్డ్ పోటీలు హైదరాబాద్‌లో జరుగుతున్నాయి. ఇంకా మరిన్ని ప్రపంచ ఈవెంట్‌లను తెలంగాణ ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. తెలంగాణ రైజింగ్ కార్యాచరణ ద్వారా ఆర్థికాభివృద్ధి, పెట్టుబడులు, ఉద్యోగాలు, మౌలిక సదుపాయాలు, సంక్షేమం సమతుల్యంగా సాగుతోంది. ఒక ట్రిలియన్ డాలర్ ఆర్థిక వ్యవస్థగా ఎదగడంలో, హైదరాబాద్‌ను అత్యద్భుత నగరంగా మార్చడంలో అందరి సహకారం కోరుతున్నాం. హైదరాబాద్‌కు బ్రాండ్ అంబాసడర్లుగా మారండి. మన విజయాలను ప్రపంచానికి చూపండి’ అని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.

Also Read: AP Ration cards: ఏపీ రేషన్ కార్డుల్లో కీలక మార్పులు.. ఇకపై డిజిటల్ కార్డులు, అదెలా?

Related News

Hyderabad Drugs: హైదరాబాద్‌‌ డ్రగ్స్‌ ఉచ్చులో డాక్టర్లు.. 26 లక్షల విలువైన?

Rain Alert: ఓర్నాయనో.. ఇంకా 3 రోజులు వానలే వానలు.. ఈ జిల్లాల్లో పిడుగుల పడే అవకాశం

Telangana News: బీఆర్ఎస్‌లో కవితపై కుట్రలు.. ఆయన పనేనా?

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసు.. విచారణకు కేంద్రమంత్రి సంజయ్, ఆ తర్వాత బాబు-పవన్?

Himayatsagar: నిండుకుండలా హిమాయత్ సాగర్.. గేటు ఎత్తి నీటి విడుదల, అధికారుల హెచ్చరిక

GHMC rain update: హైదరాబాద్‌లో భారీ వర్షం.. అక్కడ రికార్డ్ స్థాయిలో వర్షపాతం నమోదు

Big Stories

×