Big Stories

CM Revath Reddy: ఎల్లయ్యకు ఎద్దు లేదంట.. మల్లయ్యకు బండి లేదంట.. ఇద్దరు కలిసి శిరసనగండ్ల జాతరకు పోయిర్రంట..

CM Revanth Reddy Speech In Nagar Kurnool(TS politics): తనకి అండగా నిలిచిన పాలమూరు ప్రజలకు కేసీఆర్‌కు తీరని అన్యాయం చేశారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టును పట్టించుకోలేదని అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలోనే కాదు స్వరాష్ట్రంలో కూడా కేసీఆర్‌కు తీరని అన్యాయం జరిగిందన్నారు.

- Advertisement -

డీకే అరుణ, ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్‌తో తనకు ఎలాంటి విభేదాలు లేవని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఐపీఎస్‌‌గా రాజీనామా చేసి దొరల గడీలు కూలుస్తా అన్న ప్రవీణ్ కుమార్ దొరల పార్టీలో ఎందుకు చేరారో చెప్పాల్సిన అవసరం ఉందని అన్నారు. తెలంగాణ ప్రజలు సమాధి చేసిన పార్టీకి ఎందుకు మద్ధతు పలుకుతున్నారో ప్రవీణ్ కుమార్ చెప్పాలని అన్నారు.

- Advertisement -

పదేళ్లు అటు మోదీ, ఇటు కేసీఆర్ ఎస్సీ వర్గీకరణ విషయంలో మోసం చేశారన్నారు సీఎం రేవంత్ రెడ్డి. పోతుగంటి రాములుకు కొడుకు భరత్ సన్ స్ట్రోక్ ఇచ్చారన్నారు. మాదిగ జాతికి మోసం చేసిన కేసీఆర్ పంచన ప్రవీణ్ కుమార్ ఎలా చేరారని ప్రశ్నించారు. ప్రవీణ్ కుమార్ ఐపీఎస్‌గా కొనసాగి ఉంటే ఇవ్వాళ తెలంగాణకు డీజీపీ అయ్యేవారని సీఎం అన్నారు. టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్‌గా ఉండమంటే ప్రవీణ్ కుమార్ తిరస్కరించి దొర గడీల వద్ద కాపలాగా ఉండాలనుకున్నారన్నారు.

రెండు టీఎంసీలతో పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేసి తీరుతామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. తుమ్మిళ్ల ప్రాజెక్టును పూర్తి చేస్తామన్నారు. కల్వకుర్తి, నెట్టెంపాడు, సంగం బండ, భీమా, మక్తల్-నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేసి పాలమూరు రుణం తీర్చుకుంటానని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

Also Read: శత్రువు చేతిలో డీకే అరుణ కత్తిలా మారారు.. కొడంగల్‌లో సీఎం రేవంత్ రెడ్డి..

అటు సూర్యుడు ఇటు వచ్చినా.. ఇటు సూర్యుడు అటు పోయినా తెలంగాణలో ఆగస్టు 15 లోపు రుణమాఫీ చేస్తామని మామా అల్లుళ్లు బీఆర్ఎస్ పార్టీని రద్దు చేసుకోవాలని సవాల్ విసిరారు. రాబోయే వరి పంటకు రూ. 500 బోనస్ ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News