Big Stories

DGCA New Rules: తల్లిదండ్రుల పక్కనే విమానంలో పిల్లలకు సీటు కేటాయించాలి : డీజీసీఏ

DGCA New Rules: విమానంలో పిల్లలకు తల్లిదండ్రుల పక్కనే సీటు కేటాయించాలని డీజీసీఏ ఎయిర్‌లైన్స్‌కు ఆదేశాలు జారీ చేసింది. విమానయాన సంస్థలకు డైరెక్టర్‌ జనరల్‌ సివిల్‌ ఏవియేషన్‌ (DGCA)పలు కీలక ఆదేశాలిచ్చింది. 12 ఏళ్ల లోపు పిల్లలకు తప్పనిసరిగా తల్లి, లేదా తండ్రిలో ఎవరైనా ఒకరి ప్రక్కన సీటును కేటాయించాలని ఎయిర్‌లైన్స్‌ కంపెనీలను డీజీసీఏ ఆదేశించింది.

- Advertisement -

తల్లిదండ్రులు, సంరక్షకులతో పిల్లలు ప్రయాణించినప్పుడు చాలా సార్లు వారికి దూరంగా కూర్చోవాల్సి వస్తోంది. ఈ అంశంపై డీజీసీఏకు అనేక ఫిర్యాదులు రాగా వాటిని పరిగణలోకి తీసుకున్న డీజీసీఏ పిల్లలకు తల్లిదండ్రుల్లో ఎవరో ఒకరి వద్ద కూర్చునే అవకాశం ఉంటే బాగుంటుందని భావించింది. దీంతో డీజీసీఏ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అంతే కాకుండా ప్రయాణికుల పిల్లలకు తల్లిదండ్రుల్లో ఎవరి పక్కన సీటును కేటాయించారనే అంశాన్ని రికార్డుల్లో నమోదు చేయాలని ఆదేశించింది.

- Advertisement -

విమానం బయలుదేరే సమయం వరకు సీటు ఎంపిక చేసుకోని వారికి ఆటోమెటిక్‌గా సీటును కేటాయించే నిబంధనను సవరించింది. భోజనం, డ్రింక్ ఛార్జీలు, జీరో బ్యాగేజీ ఛార్జీలు, స్నాక్, సంగీత వాయిద్యాల క్యారేజ్ కోసం ఛార్జీలను పెంచుకునేందుకు డీజీసీఏ విమానయాన సంస్థలకు అనుమతి ఇచ్చింది. ట్రాన్స్‌పోర్ట్ సర్క్యులర్‌లో డీజీసీఏ ఈ అంశాలను పేర్కొంది.

Also Read : ఎవ్వరి మాట విననన్న మాజీ సీఎం మనవడు.. చివరకు..

సీటు ఎంపిక ఛార్జీకి అదనంగా చెల్లించాల్సిన అవసరం లేకుండా విమానాలలో చిన్న పిల్లలను వారి తల్లిదండ్రులు లేదా సంరక్షకులలో కనీసం ఒకరితో కూర్చోవడానికి అవకాశం కల్పిస్తున్నారు. 12 సంవత్సరాల్లోపు పిల్లలకు తప్పనిసరిగా తల్లిదండ్రుల్లో ఎవరో ఒకరి పక్కనే సీటును కేటాయించాలని DGCA ఎయిర్‌లైన్స్‌ కంపెనీలను కోరింది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News