Suryapet: ఇరిగేషన్, సివిల్ కార్పొరేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సూర్యాపేట జిల్లాల్లో పర్యటించనున్నారు. ఆయనతో ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, దివ్యాంగుల శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కూడా జిల్లాకు రానున్నారు. రేపు జిల్లాలో పలు కీలక అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. అలాగే ఈ నెల 14న తిరుమలగిరిలో జరిగే భార బహిరంగ సభ స్థలాన్ని మంత్రులు పరిశీలించనున్నారు.
రేపు ఉదయం 8 గంటలకు ఇద్దరు మంత్రులు బేగంపేట ఎయిర్ పోర్టుకు రానున్నారు. 8:25 గంటలకు అక్కడ నుంచి హెలికాప్టర్ ద్వారా సూర్యాపేట జిల్లాలోని తిరుమలగిరి మండల హెడ్ క్వార్టర్స్ కు రానున్నారు. ఈ నెల 14న సీఎం రేవంత్ రెడ్డి తిరుమలగిరికి రానున్న విషయం తెలిసిందే. కొత్త రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని తిరుమలగిరిలో నిర్వహించే భారీ బహిరంగ సభ ద్వారా సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నట్టు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ బహిరంగ సభకు సీఎంతో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హాజరుకానున్నారు. రాష్ట్రంలో దాదాపు పది సంవత్సరాల తర్వాత కొత్త రేషన్ కార్డులు మంజూరు చేస్తున్నారు.
ఈ క్రమంలోనే రేపు ఉదయం 9:15 గంటల నుంచి 10 గంటల వరకు సభా నిర్వహణ స్థలాన్ని మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, అడ్లూరీ లక్షణ్ కుమార్ పరిశీలించనున్నారు. ఆ తర్వాత ఉదయం 10 గంటల నుంచి 11 గంటల మధ్య జరగనున్న తుంగతుర్తి కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ మీటింగ్ మంత్రులు హాజరు కానున్నారు. ఆ తర్వాత అక్కడ నుంచి 11: 15 గంటలకు వాయు మార్గం ద్వారా కోదాడ నియోజకవర్గంలోని మోతె మండలానికి వెళ్లనున్నారు. అక్కడ 45 నిమిషాల పాటు మోతె లిఫ్ట్ ఇరిగేషన్ స్కీంపై రివ్యూ సమావేశం నిర్వహించనున్నారు. సమావేశం అనంతరం మంత్రులు మోతె మండలానికి చేరుకోనున్నారు.
అక్కడ నుంచి మంత్రులు రోడ్డు మార్గానా 12:30 గంటలకు కోదాడకు చేరుకోనున్నారు. కోదాడలో రూ.5.10 కోట్ల వ్యయంతో నీటిపారుదల కార్యాలయానికి శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం రూ.8 కోట్ల వ్యయంతో జెర్రిపోతులగూడెం గ్రామంలో చిలుకూరు నుంచి జెర్రిపోతులగూడెం వరకు రోడ్డు నిర్మాణా పనులకు శంకుస్థాపన చేయనున్నారు. ఆ తర్వాత రూ.2.31 కోట్ల వ్యయంతో వేపల సింగారం నుంచి కండిబండ వరకు రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం 2.20 కోట్ల వ్యయంతో లక్కవరం నుంచి ముగ్దుంనగర్ వరకు బీటీ రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభించనున్నారు.
ALSO READ: RRB: రైల్వేలో భారీ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. అవకాశం మళ్లీ రాదు భయ్యా..
ఆ తర్వాత మధ్యాహ్నం 3:15 గంటలకు హుజుర్ నగర్ టౌన్ లో 7.99 కోట్ల వ్యయంతో నీటి పారుదల కార్యాలయానికి మంత్రులు శంకుస్థాపన చేయనున్నారు. ఆ తర్వాత పలు గ్రామాల్లో బీటీ రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభించనున్నారు. శంకుస్థాపన పనులు ముగిసిన తర్వాత మంత్రులు హెలికాప్టర్ రాత్రి ఏడు గంటలకు హైదరాబాద్ కు రానున్నారు.
ALSO READ: MIL JOBS: ఈ అర్హత ఉన్నవారికి గుడ్ న్యూస్.. అప్లై చేస్తే జాబ్, రెండు రోజులే?