Metro fights: మెట్రో ప్రయాణం అంటే సాఫీగా జర్నీ సాగడం అన్నది అందరికీ తెలిసిందే. అంతేకాదు మెట్రో ట్రైన్ ఎక్కామంటే.. సమయం ఆదా.. ట్రాఫిక్ సమస్యకు చెక్.. ఇలా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. కానీ ఈ రాష్ట్రంలోని మెట్రో పరిస్థితి చూస్తే.. కుంగ్ ఫూ, కరాటే వచ్చిన వారే ఇక్కడ మెట్రో ఎక్కగలుగుతున్నారు. ఈ పరిస్థితి ప్రస్తుతం ముంబయిలోని మెట్రో స్టేషన్లలో నిత్యమైన దృశ్యం. ట్రావెల్ కన్నా, చిత్తశుద్ధితో కొట్టుకోవడమే ఎక్కువగా జరుగుతోంది. ఇక మహిళల మెట్రో కాంపార్ట్మెంట్ల విషయానికొస్తే.. అక్కడ కూడా ఇదే సంగతులు.
ఒకప్పుడు మెట్రో అంటే క్లాస్.. అనే పేరు ఉండేది. ఇప్పుడు మెట్రో అంటే క్లాష్ అనే పేరు వచ్చేసింది. బాగా ఇస్త్రీ బట్టల్లో, బ్యాగ్‌లు మోస్తూ వస్తున్న యువత, ఉద్యోగస్తులు అందరూ ఒక్కటే చేస్తున్న పని ఇక్కడ తన్నుకోవడం, కేకలు పెట్టడం, నిలబడడానికి చోటు కోసం గొడవలు. ఇదంతా చూస్తే అసలు మెట్రోలో ప్రయాణించాలా, పోవాలా అనే అనుమానం కలుగుతుంటుంది.
మెట్రోలో లోకల్ స్టైల్ రష్!
ముంబయి మెట్రో ప్రయాణం ఇప్పుడు ముంబయి లోకల్ ట్రైన్ అనుభవాన్ని ఇచ్చేస్తోంది. గంటలు గంటలుగా క్యూ, దూకుడుగా లోపలికి పరుగులు, ఒక్కొక్కరికి నాలుగు సీట్లు ఉన్నట్టు కూర్చోవడం.. ఇవన్నీ ఇప్పుడు సాధారణ విషయాలే. ముఖ్యంగా పీక్ అవర్స్‌లో వెళ్తే.. “ఒక్కసారి మెట్రోలో ఎక్కితే.. ఏదో జాతరలోకి వెళ్ళినట్టుంటుంది!” అని ప్రయాణికులు గగ్గోలు పెడుతున్నారు.
ప్రయాణికులకు అసలైన సమస్యలు
ఇది కేవలం రద్దీ సంగతి కాదు. శరీరంపై శ్రమ పడటం ఒక వైపు అయితే… మానసికంగా తట్టుకోలేని ఒత్తిడి మరో వైపు. మహిళలు, వృద్ధులు, చిన్నారులు ఈ తాకిడికి తట్టుకోలేక పోతున్నారు. ఓవర్ క్రౌడ్‌తో పాటు, మారే మారే స్టేషన్ల వద్ద జరిగే తోపులాటలు, లోపలికి లాగేసే మానసికత, మర్యాదల లేని ఆచరణలు.. ఇవన్నీ ముంబయి మెట్రోను మంచి వాహనంగా కాకుండా బాధాకర అనుభవంగా మార్చేస్తున్నాయి.
Also Read: Petrol price in India: లీటర్ పెట్రోల్ రెండు రూపాయలే.. ఇదేం రేటు బాబోయ్!
కారణం ఏంటి?
ముంబయి నగర జనాభా దృష్టిలో పెట్టుకుంటే ప్రస్తుతం ఉన్న మెట్రో లైన్లు సరిపోవడం లేదు. డిమాండ్‌కు సరిపడా రైళ్ల సంఖ్య లేకపోవడం, ఫ్రీక్వెన్సీ తక్కువగా ఉండటం.. ఇవే ప్రధాన కారణాలు. ఇక మరిన్ని మెట్రో ట్రైన్స్, ఇంకా ఎక్కువ బోగీలు, స్మార్ట్ గేటింగ్ సిస్టమ్ వంటి వాదనలు ఎప్పటి నుంచో వినిపిస్తున్నా, ప్రాక్టికల్‌గా జనం అనుభవిస్తున్నది మాత్రం ఇదే.. రద్దీ, తోపులాట, విసుగు.
సరైన ఆలోచన అవసరం
ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వాలు, మెట్రో నిర్వహణ సంస్థలు ఈ సమస్యపై వెంటనే స్పందించాల్సిన అవసరం ఉంది. ప్రజల నిత్య ప్రయాణం భద్రంగా, సౌకర్యంగా ఉండాలి. కాకపోతే రేపు లోకల్ లో ప్రయాణించడమే మెరుగంటూ, జనం మళ్లీ పాత వాహనాలవైపు వెళ్లే ప్రమాదం ఉంది.
స్మార్ట్ సిటీలో.. తలలు పగిలే ట్రావెల్?
ఒకవైపు స్మార్ట్ సిటీలను అభివృద్ధి చేస్తున్నామంటూ మాటల మోత మోగుతోంది. కానీ మెట్రోలో ఒక్క ట్రిప్ వేయాలంటే, యుద్ధం లాంటి అనుభూతి.. ఇది అభివృద్ధి అవుతుందా? లేదా అవినీతిలో పడిపోయిన వ్యవస్థ వెనకడుగు వేస్తుందా అనే సందేహాలు తెస్తోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మెట్రో అంటే ‘క్లాస్ ట్రావెల్’ అన్న అభిప్రాయం తిరిగి రావాలంటే, ప్రస్తుతం ఉన్న అసౌకర్యాలు తొలగించాల్సిందే.
మరి ఎప్పుడు మారుతుంది పరిస్థితి?
జనం తరచూ ఫిర్యాదులు చేస్తున్నా, మెట్రో పాలకులు మాత్రం పెరుగుతున్న ప్రయాణికుల సంఖ్యకే ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కాని, ఈ ప్రయాణికుల హడావిడి వెనక వాళ్ల అసంతృప్తి, క్షీణిస్తున్న అనుభవం దాగి ఉంది. ఇది గుర్తించి, మరింత మెట్రోలు, మరింత సౌకర్యాలు, మెరుగైన సేవలతో ముందు సాగాలన్నది ముంబై మెట్రో ప్రయాణికుల వాదన.