వారిద్దరూ ఒకే పార్టీకి చెందిన నాయకులు… ఇద్దరూ కూడా వెర్వేరు పార్లమెంటు నియోజకవర్గాల నుండి గెలిచిన ఎంపీలు….ఇప్పుడు ఆ ఇద్దరు కూడా ఒకే అంశంలో జరుగుతున్న పోరాటానికి మద్దతు ఇచ్చేందుకు వచ్చారు.. కలిసి పొరాడాల్సిన నాయకులు ఎవరి దారి వారిదే. .ఎవ్వరి పోరాటం వారిదే అంటున్నారు..
కరీంనగర్ జిల్లా హుజురాబాద్ సమీపంలో డంప్ యార్డ్ ఏర్పాటు చేసి విద్యుత్ ఉత్పత్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. హుజురాబాద్ మండలం సిర్సపల్లి లోని 25 ఎకరాల్లో డంప్ యార్డ్ ఏర్పాటు చేయడం వల్ల అనారోగ్యాలకు గురవుతామని, పర్యావరణ సమస్యలు ఉత్పన్నం అవుతాయని ఈ ప్రాంత వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. డంప్ యార్డ్ ప్రతిపాదిత ప్రాంత పరిసర గ్రామాలతో పాటు హుజురాబాద్ మునిసిపాలిటీ ప్రాంతంలోని వారంతా కలిసి జాయింట్ యాక్షన్ కమిటీగా ఏర్పడ్డారు. డంప్ యార్డ్ కు వ్యతిరేకంగా నిరవధికంగా ఆందోళనలు చేపట్టారు ఈ ప్రాంత వాసులు. వీరి ఆందోళనకు మద్దతుగా, డంప్ యార్డ్ ఏర్పాటుకు వ్యతిరేకంగా బీజేపీ కూడా తన వంతుగా బాసటనివ్వాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా హుజురాబాద్ నియోజకవర్గంలో కేంద్ర మంత్రి బండి సంజయ్, మల్కాజ్ గిరి ఎంపీ ఈటల రాజేందర్ లు పర్యటించారు….అయితే ఇప్పుడు వారిద్దరూ ఒకేరోజు వెర్వేరు సమయంలొ అక్కడ పర్యటించడంతో వీరిద్దరూ ఇంకా విభేధాలు పక్కన పెట్టలేదా..? అన్న చర్చ నడుస్తోంది.
హుజురాబాద్ నుండి గతంలో ప్రాతినిథ్యం వహించిన ఈటల రాజేందర్ శనివారం రోజు హుజురాబాద్ కేంద్రంలో నిర్వహిస్తున్న దీక్షా శిబిరానికి చేరుకుని మద్దతు ప్రకటించారు. డంప్ యార్డ్ ఇక్కడ ఏర్పాటు చేయడం ప్రమాదకరమన్నారు.. డంపింగ్ యార్డు ఏర్పాటు కి వ్యతిరేకంగా తన వంతు కృషి చేస్తానని మాట కూడా ఇచ్చాడు. తరువాత ఇల్లందకుంట రామాలయంలో కూడా పూజలు నిర్వహించిన ఈటల హైదరాబాద్ కు పయనం అయ్యారు..
ఈటెల వెళ్ళాక కొద్దిసేపటికే హుజురాబాద్ చేరుకున్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ డంప్ యార్డ్ ప్రతిపాదిత స్థలాన్ని పరిశీలించారు. అక్కడే మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకించారు. రాష్ట్ర ప్రభుత్వం అక్కడ డంప్ యార్డ్ ఏర్పాటును విరమించుకోవాలని, జనావాసాలు లేని చోటకు తరలించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి ఇల్లందకుంట రామాలయంలో ప్రత్యేక పూజలు జరిపారు. ఇద్దరి పర్యటనకు దాదాపు 30 నిమిషాల నుండి గంట వ్యత్యాసంలోనే కొనసాగింది.
అయితే… ఇద్దరు నాయకులు మాత్రం ఎవరికి వారే తమ షెడ్యూల్ ఫిక్స్ చేసుకోవడం వారిద్దరూ వేర్వేరుగా మద్దతు తెలిపి తరువాత ఒకే దేవాలయం లో పూజలు చెయ్యడం ఇప్పుడు చర్చలకి దారి తీసింది…. ఢిల్లీలో లోకసభ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో ఇద్దరూ ఢిల్లీ నుండే హైదరాబాద్ చేరుకుని హుజురాబాద్ నియోజకవర్గంలో వేరువేరు సమయంలో పర్యటించడం మరోకసారి వీరిద్దరి మధ్య విభేధాలని ఎత్తి చూపాయి.
గత కొద్ది రోజులుగా కేంద్ర మంత్రి బండిసంజయ్, మల్కాజిగిరి ఎంపీ ఈటెల రాజేందర్ ల మధ్య కోల్డ్ వార్ కొనసాగుతుంది. కొన్నిసార్ల తన అనుచరులకి హుజురాబాద్ లో పార్టీ పదవులతో పాటుగా ప్రాతినిధ్యం లేకపోవడం తో తన అనుచరులని తొక్కేస్తున్నారని ఈటెల ఆ మద్య బండిసంజయ్ ని ఉద్దేశించి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారు. అయితే.. తనకి రాష్ట్ర అధ్యక్షుడు పదవి రాకుండా కాళ్ళల్లో కట్టెలు పెడుతున్నాడని ఈటెల అసహనంతో ఉండగా పార్టీ జోక్యం చేసుకొవడంతో కొద్ది రోజులుగా మౌనం వహిస్తున్నారు. అయితే ఇప్పుడు హుజురాబాద్ లో నియోజకవర్గం ఇద్దరూ పర్యటించడం. అది కొద్ది గంటల సమయంలోనే కావడంతో ఇప్పుడు వీరిద్దరూ కలవలేదా..? మనస్పర్ధలు అలాగే కొనసాగుతున్నాయన్న చర్చ మరోకసారి బహిర్గతం అయ్యింది.
ALSO READ: కేరళం ప్రజలు జర్రంతా జాగ్రత్త.. వాళ్ల మాటలు అసలు నమ్మెదేలే, సీఎం రేవంత్‌కు కవిత కౌంటర్