E-Paper
Advertisement

ఏటీఎం, యూపీఐ ద్వారా.. పీఎఫ్ విత్ డ్రా.. ఎంత డబ్బు తీసుకోవచ్చంటే?

ఏటీఎం, యూపీఐ ద్వారా.. పీఎఫ్ విత్ డ్రా.. ఎంత డబ్బు తీసుకోవచ్చంటే?
Advertisement

EPFO 3.0 Reforms: ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (EPFO) తన ఖాతాదారుల కోసం అత్యంత ప్రతిష్టాత్మకమైన EPFO 3.0 సంస్కరణలను తీసుకురాబోతోంది. త్వరలోనే ఈ సంస్కరణలు అందుబాటులోకి రానున్నాయి. ఒకప్పుడు ఉద్యోగులు తమ పీఎఫ్ డబ్బును పొందాలంటే ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాల్సి వచ్చేది. అవి బ్యాంక్ ఖాతాలో పడటానికి కనీసం 3-7 రోజుల సమయం పట్టేంది. అయితే రాబోయే కొత్త నిబంధనల ప్రకారం ఉద్యోగులు తమ ఏటీఎం, యూపీఐ సాయంతో డబ్బును విత్ డ్రా చేసుకునేందుకు వీలు కలుగనుంది.

ఇది ఎలా పనిచేస్తుంది?

EPFO 3.0 సంస్కరణల్లో భాగంగా పీఎఫ్ ఖాతాను నేరుగా యూపీఐ (UPI)కి లింక్ చేయనున్నారు. దీని ద్వారా యూపీఐ పిన్ ఉపయోగించి అర్హత కలిగిన మొత్తాన్ని నేరుగా బ్యాంకు ఖాతాలోకి బదిలీ చేసుకోవచ్చు. లేదుంటే ఏటీఎం ద్వారా కూడా నగదు విత్‌డ్రా చేసుకునే వెసులుబాటు త్వరలో అందుబాటులోకి రానుంది. కొన్ని నివేదికల ప్రకారం.. ఖాతాదారులు తమ పీఎఫ్ బ్యాలెన్స్ ను కొంతమేరకే విత్ డ్రా చేసుకునేందుకు వీలుంది. ఖాతా నుంచి 50-75 శాతానికి మించి నగదును విత్ డ్రా చేసుకునేందుకు వీలు ఉండదని తెలుస్తోంది.

లావాదేవీ పరిమితి

Advertisement

పీఎఫ్ ఖాతాదారులు ఏటీఎం లేదా యూపీఐ లావాదేవీల ద్వారా ఎంతమేర డబ్బు విత్ డ్రా చేసుకోవాలన్న దానిపై కూడా ప్రస్తుతం ఈపీఎఫ్ఓ (EPFO) కసరత్తు చేస్తోంది. సంబంధిత వర్గాల సమాచారం ప్రకారం.. ఒక్కో యూపీఐ లావాదేవీ ద్వారా సుమారు రూ. 25,000 వరకు తక్షణమే విత్‌డ్రా చేసుకునే వెసులుబాటు కల్పించే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. మరి ఏటీఎం ద్వారా ఎంత డ్రా చేయవచ్చన్న దానిపై ఇంకా స్పష్టత లేదు.

ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుంది?

కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ తెలిపిన వివరాల ప్రకారం.. ఈ ప్రాజెక్టు ప్రస్తుతం పైలట్ దశలో ఉంది. దీనిని ఏప్రిల్ చివరి నాటికి పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకురావాలని గతంలోనే కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. ఈఫీఎఫ్ఓ 3.0 సంస్కరణలకు సంబంధించి ప్రత్యేకమైన మెుబైల్ యాప్ ను సైతం రూపొందిస్తున్నారు.

Advertisement

Also Read: ఫ్యామిలీలో తలా ఒక రీఛార్జ్ ప్లాన్ వాడుతున్నారా? ఎందుకు భయ్యా డబ్బు వేస్ట్.. వీటిని ట్రై చేయండి!

మరికొన్ని సంస్కరణలు..

రాబోయే కొత్త సంస్కరణల్లో భాగంగా.. అనారోగ్యం, వివాహం వంటి అవసరాల కోసం చేసుకునే క్లెయిమ్‌ల పరిమితిని రూ. 5 లక్షలకు పెంచారు. వీటిని 24 గంటల్లోనే సెటిల్ చేసేలా వ్యవస్థను రూపొందించారు. అలాగే ఒక ఉద్యోగి కంపెనీ మారినప్పుడు పాత పీఎఫ్ ఖాతాలోని నగదు కొత్త ఖాతాలోకి ఆటోమేటిక్‌గా బదిలీ అయ్యేలా సాఫ్ట్‌వేర్ అప్‌గ్రేడ్ చేశారు. అయితే ఈ సదుపాయాలు పొందేందుకు మీ UAN (Universal Account Number) కి ఆధార్, బ్యాంక్ ఖాతా (KYC) తప్పనిసరిగా లింక్ అయి ఉండాలి.

Also Read: బిర్యానీ ఆర్డర్ చేస్తున్నారా? తస్మాత్ జాగ్రత్త.. పాచి పోయినది వేడి వేడిగా డెలివరీ..!

Related News

రైతులకు కీలక కబురు.. పీఎం కిసాన్ స్కీమ్ 24వ విడత నిధులు, నవరాత్రుల సమయంలో

దిగొస్తున్న పసిడి ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో ధరలు మాటేంటి?

ఇండియాలో వారసత్వ ఆస్తుల బదిలీ అంత ఈజీ కాదు.. అన్నీ సవ్యంగా ఉన్నా లంచాలు ఇవ్వాల్సిందే

ఎల్పీజీ గ్యాస్ బుకింగ్‌పై కీలక నిర్ణయం.. వినియోగదారులకు గుడ్‌న్యూస్, బుకింగ్ సమయం తగ్గింపు

జన్‌ ధన్‌ బ్యాంకు ఖాతాలు.. వెలుగులోకి కొత్త విషయాలు, సమాచారం హక్కు చట్టం ద్వారా..

ఈసారి పండుగలకు చేదు రుచి.. భారీగా పెరగనున్న స్వీట్స్ ధరలు

బ్యాంక్ అకౌంట్‌లో ఎంత నగదు జమ చేస్తే ఇన్‌కమ్ ట్యాక్స్ నోటీసు వస్తుంది? ఈ రూల్స్ తెలుసుకోండి

ఓల్డ్ మాంక్ రమ్ అసలు రమ్మే కాదు.. ఇంతకాలం మందుబాబులను కంపెనీ మోసం చేసిందా?

Big Stories

Advertisement
×