Ponguleti Srinivas Reddy: పాలకుర్తి, స్వేచ్ఛ : తొర్రూరు మున్సిపాలిటీ పరిధిలోని అంబేద్కర్ సెంటర్‌లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ కార్నర్ మీటింగ్ నిర్వహించారు. ఈ సమావేశానికి పాలకుర్తి శాసన సభ్యురాలు యశస్విని రెడ్డి, టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ ఝాన్సి రాజేందర్ రెడ్డి నాయకత్వం వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి (Ponguleti Srinivas Reddy) హాజరై ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల సంక్షేమమే పరమావధిగా పని చేస్తోందని స్పష్టం చేశారు.
ముఖ్యంగా పేదలు, బలహీన వర్గాల ప్రజలకు గృహ నిర్మాణంలో న్యాయం జరగాలనే ఉద్దేశంతో అనేక సంస్కరణలను అమలు చేస్తున్నామ భరోసా ఇచ్చారు. రానున్న రోజుల్లో మున్సిపాలిటీ పరిధిలోనీ రహదారులు, డ్రైనేజీ, త్రాగునీరు, పారిశుధ్యం వంటి మౌలిక వసతుల అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలతో ముందుకు వెళ్తున్నామని మంత్రి తెలిపారు. ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని అభివృద్ధి పనులు వేగవంతంగా చేపడతామని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం మాటలకే పరిమితం కాకుండా చేతల్లో చూపే ప్రభుత్వమని ఆయన అని తెలిపారు. గత ప్రభుత్వాల హయాంలో గృహ సమస్యలు, మౌలిక వసతుల లోపాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని, ఆ పరిస్థితులకు కాంగ్రెస్ పాలనలో శాశ్వత పరిష్కారం లభిస్తుందనిన్నారు.
Also Read: Big TV Malayalam: బిగ్ టీవీ మరో సంచలనం.. కేరళ గడ్డపైకి దమ్మున్న ఛానెల్.. ఆదివారమే ఆరంభం
అనంతరం స్థానిక శాసన సభ్యురాలు యశస్విని రెడ్డి మాట్లాడుతూ…మున్సిపాలిటీ ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం పూర్తిస్థాయిలో కట్టుబడి ఉందని తెలిపారు. త్రాగునీటి సమస్యలు, డ్రైనేజీ వ్యవస్థ, అంతర్గత రహదారుల అభివృద్ధి, పారిశుధ్య నిర్వహణ వంటి అంశాల్లో ఇప్పటికే చర్యలు తీసుకున్నామని, ఇంకా మిగిలిన పనులను త్వరలో పూర్తి చేస్తామని చెప్పారు. ప్రజల సంక్షేమమే లక్ష్యంగా నిరంతరం పనిచేస్తున్న కాంగ్రెస్ పార్టీపై ప్రజలు విశ్వాసం ఉంచి, జరుగబోయే మున్సిపల్ ఎన్నికల్లో పార్టీని భారీ మెజారిటీతో గెలిపించాలని ఆమె కోరారు.
టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ ఝాన్సి రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ…కాంగ్రెస్ పార్టీ ప్రజలతో నేరుగా అనుసంధానం కలిగి పనిచేసే ఏకైక పార్టీ అని అన్నారు. ఇంటింటి ప్రచారం, కార్నర్ మీటింగ్స్ ద్వారా ప్రజల అభిప్రాయాలను తెలుసుకొని, వాటిని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తున్నామని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తోందని పేర్కొన్నారు. రాజ్యాంగ విలువలను, ప్రజాస్వామ్యాన్ని కాపాడే పార్టీ కాంగ్రెస్ పార్టీయేనని స్పష్టం చేశారు.ఈ కార్నర్ మీటింగ్‌లో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళా నాయకులు, యువతతో పాటు పెద్ద ఎత్తున స్థానిక ప్రజలు పాల్గొన్నారు. ప్రజల నుంచి లభించిన స్పందన కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. చివరగా కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలుపుతూ, రాబోయే ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను గెలిపించాలని నేతలు ప్రజలను కోరారు.