E-Paper
Advertisement

Municipal Elections: మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో.. కేసీఆర్ పై మంత్రి సీతక్క ఫైర్..!

Municipal Elections: మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో.. కేసీఆర్ పై మంత్రి సీతక్క ఫైర్..!
Advertisement

Municipal Elections: స్వేఛ్చ బ్యూరో: భువనగిరి పార్లమెంటు నియోజకవర్గ మున్సిపల్ ఎన్నికల ఇన్చార్జ్ రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క భువనగిరి పట్టణంలో కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ కౌన్సిలర్ అభ్యర్థుల తరపున ఎన్నికల ప్రచారంలో భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డితో కలిసి కార్నర్ మీటింగ్లో పాల్గొన్నారు. హైదరాబాద్ చౌరస్తా వద్ద నిర్వహించిన కార్నర్ మీటింగ్లో మంత్రి సీతక్క మాట్లాడుతూ ప్రజా సంక్షేమం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుందని అన్నారు. ఉచిత కరెంట్, మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం, ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీ ధైర్యాన్ని అన్నారు. గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో సన్న బియ్యం ఇవ్వాలన్న ఆలోచన కెసిఆర్ కు వచ్చిందా అని ప్రశ్నించారు. లక్షల కోట్లు దండుకొని అవినీతి మయంగా అప్పుల రాష్ట్రంగా మిగిల్చిన ఘనత గత బిఆర్ఎస్ ప్రభుత్వాన్నిదని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారధ్యంలో అన్ని సంక్షేమ పథకాలు లబ్ధిదారులకు అందుతున్నాయని అన్నారు.భువనగిరి ఎమ్మెల్యే, భువనగిరి ఎంపీ, రాష్ట్ర ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ కాబట్టి మున్సిపల్ చైర్మన్ కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గెలిపిస్తే భువనగిరి పట్టణానికి అభివృద్ధి చేయడానికి సులభంగా ఉంటుందని ప్రతి అక్క చెల్లె ఆలోచించాలని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలను గుర్తుచేసుకొని ఓటు వేయాలని అభ్యర్థించారు.

మున్సిపల్ ఎలక్షన్ లో సత్తా చాటాలి: ఎంపీ చామల

ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండే కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కోరారు. ఎన్నికల సమయంలో కుల, మత వైషమ్యాలను రెచ్చగొట్టడం బీజేపీకి అలవాటుగా మారిందని విమర్శించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం వ్యవస్థలను బలహీనపరిచిందని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం మహిళా సంఘాల బలోపేతానికి చర్యలు తీసుకుంటోందన్నారు. కాంగ్రెస్ పార్టీకి ప్రజల నుంచి వస్తున్న ఆదరణను ప్రతిపక్షాలు ఓర్వలేకపోతున్నాయని అన్నారు. కేంద్ర ప్రభుత్వం వల్ల నిత్యావసరాల ధరలు పెరిగాయని, బంగారం, వెండి సామాన్యులకు అందని దూరంలోకి వెళ్లాయని విమర్శించారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని అన్నారు.

Advertisement

Also Read: Chanakya Niti: అమ్మాయిల్లో అబ్బాయిలు ఎక్కువగా ఇష్టపడే.. గుణం ఏంటో తెలుసా ?

మోడల్ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతా.. ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి

మున్సిపల్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి ప్రజలను కోరారు. గత పాలకులు భువనగిరి మున్సిపాలిటీనీ విస్మరించి ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టలేదని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటుతోనే భువనగిరి శాసనసభ్యుడిగా గెలుపొందిన రెండు సంవత్సరాల్లోనే అత్యధిక నిధులను భువనగిరి మున్సిపాలిటీకి తీసుకురావడం జరిగిందని అన్నారు. ముఖ్యంగా లబ్ధిదారులకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను త్వరలోనే అందజేస్తామని అన్నారు. ఇల్లు లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లను మొదటి విడత లో అందజేశామని మిగతా లబ్ధిదారులకు కూడా విడతలవారీగా అందజేస్తామని అన్నారు. భువనగిరి మున్సిపాలిటీలో అభివృద్ధి పనులు ఏ విధంగా జరుగుతున్నాయో మీ కండ్ల ముందటే కనిపిస్తున్నాయని జగదేపూర్ రోడ్డు వైన్డింగ్ పనులు కూడా చేపట్టడం జరిగిందని అన్ని ప్రధాన కూడళ్లలో రోడ్డు వెడల్పులు చేసి సుందరంగా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు. భువనగిరి మున్సిపల్ అభివృద్ధి జరగాలంటే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు.

Advertisement

Also Read: Gaddam Vivek: ఆ ఇద్దరి నిర్ణయాలతోనే మల్లన్న సాగర్ నిర్వాసితులకు అన్యాయం: మంత్రి గడ్డం వివేక్

Related News

అసదుద్దీన్ ఒవైసీ అసలైన దేశభక్తుడు.. సంతోష్‌నగర్ స్టీల్ ఫ్లైఓవర్ ప్రారంభంలో సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు!

సాగర్‌కి శని పట్టింది.. ఆ ఇద్దరు మంత్రులే కారణం:మిర్యాల గూడలో రెచ్చిపోయిన KTR

31 ఏళ్ల కాంగ్రెస్ బంధం.. అధిష్టానానికి కొండా సురేఖ కన్నీటి లేఖ!

కేబినెట్ నుంచి ఔట్.. సురేఖకు ముందు బర్తరఫ్ అయిన మంత్రులు వీళ్లే!

రేవంతే పట్టుబట్టి నన్ను తీసేశారు..సీఎం పై సంచలన కామెంట్స్!

నన్ను అడగకుండా ఎలా బర్తరఫ్ చేస్తారు?.. అధిష్ఠానంపై మంత్రి కొండా సురేఖ ఫైర్!

సురేఖ అక్కా నేనున్నాను, పార్టీలోకి రావాలని కేఏపాల్ ఆహ్వానం

గవర్నర్‌కు సీఎం రేవంత్ లేఖ.. సురేఖను మంత్రివర్గం నుంచి బర్తరఫ్‌ చేయాలంటూ

Big Stories

Advertisement
×