E-Paper
Advertisement
బిగ్ టీవీ ఇప్పుడు మలయాళంలో
ఓపెన్

ఓట్ల సర్వేపై సీఎం రేవంత్ రెడ్డి నయా స్కెచ్.. గాంధీభవన్‌లో 24 గంటల వార్ రూమ్..!

ఓట్ల సర్వేపై సీఎం రేవంత్ రెడ్డి నయా స్కెచ్.. గాంధీభవన్‌లో 24 గంటల వార్ రూమ్..!
Advertisement

Congress SIR: స్వేచ్చ బ్యూరో: ఎన్నికల సంఘం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఎస్ ఐ ఆర్ ప్రక్రియపై కాంగ్రెస్ పార్టీ అత్యంత అప్రమత్తంగా వ్యవహరిస్తున్నది. ఓట్ల తొలగింపు అంశంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీరియస్ కావడం, క్షేత్రస్థాయిలో ఏ ఒక్క జెన్యూన్ ఓటు కూడా తొలగిపోకుండా చూసుకోవాలని పార్టీ శ్రేణులకు గట్టిగా ఆదేశాలు జారీ చేయడంతో కాంగ్రెస్ సరికొత్త వ్యూహానికి తెరలేపింది. ఈ ప్రక్రియను నిరంతరం పర్యవేక్షించేందుకు పార్టీ సరికొత్త కార్యాచరణను సిద్ధం చేసింది. ఎస్ ఐ ఆర్ ప్రాసెస్‌ను కేవలం స్థానిక నాయకులకు వదిలేయకుండా, రాష్ట్రంలోని 17 పార్లమెంట్ నియోజకవర్గాలకు ప్రత్యేక కో-ఆర్డినేటర్లను నియమించారు. ఎక్కడైనా ఓట్ల నమోదు లేదా తొలగింపులో సమస్యలు వస్తే, ఆయా పార్లమెంట్ ఇన్‌ఛార్జ్‌లే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని పార్టీ స్పష్టం చేసింది. అంతేగాక ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక కో-ఆర్డినేటర్, ప్రతి 10 బూత్‌లకు ఒక సూపర్‌వైజర్‌ చొప్పున నియమించి క్షేత్రస్థాయి నెట్‌వర్క్‌ను పటిష్టం చేశారు.

​గాంధీభవన్‌లో ‘వార్ రూమ్’ ఏర్పాటు..

​ఎస్ ఐ ఆర్ ప్రక్రియను ప్రతిరోజూ 24 గంటల పాటు మానిటర్ చేసేందుకు పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యాలయం ‘గాంధీభవన్’ లో ప్రత్యేకంగా ‘వార్ రూమ్’ ను ఏర్పాటు చేశారు. క్షేత్రస్థాయి నుంచి వచ్చే నివేదికలను, ఓట్ల మ్యాపింగ్ – అన్‌మ్యాపింగ్ వివరాలను ఈ వార్ రూమ్ ద్వారా నిశితంగా పరిశీలిస్తారు. ఏ రోజుకు ఆ రోజు రిపోర్టులను సేకరిస్తూ, లోపాలుంటే వెంటనే సరిదిద్దేలా ఇక్కడి నుండి ఆదేశాలు వెళ్లనున్నాయి. తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జి మీనాక్షి నటరాజన్, పీసీసీ చీఫ్ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ స్వయంగా ఈ పర్యవేక్షణ బాధ్యతలను భుజాన వేసుకున్నారు. ఏఐసీసీ ఆదేశాల మేరకు ఎస్ ఐ ఆర్ పై పార్టీ, ప్రభుత్వం సీరియస్ గా మానిటరింగ్ చేస్తున్నది.

Advertisement

Also read: YouTube Shortsలో బిగ్ చేంజెస్.. లైక్ బటన్ స్థానంలో హార్ట్ సింబల్, ఆ ఫీచర్ కంప్లీట్‌గా అవుట్!

​ఓట్ల తొలగింపు అంశంపైనే ప్రధాన ఫోకస్..

​రాష్ట్రంలో లక్షలాది ఓట్లకు సంబంధించి ఇంకా మ్యాపింగ్ పూర్తి కాకపోవడం, పలు ఓట్లలో అవకతవకలు ఉన్నాయనే అనుమానంతో ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేస్తుండటంపై అధికార పార్టీ దృష్టి సారించింది.ఎస్ ఐ ఆర్ పేరుతో అర్హులైన ఓటర్ల ఓట్లు గల్లంతు కాకుండా చూడటమే ఈ ప్రత్యేక డ్రైవ్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఎన్నికల సిబ్బంది ఓటర్ల ఇళ్లకు వెళ్లినప్పుడు, కాంగ్రెస్ తరఫున శిక్షణ పొందిన మాస్టర్ ట్రైనర్లు, బూత్ లెవెల్ ఏజెంట్లు కూడా అక్కడ అందుబాటులో ఉండేలా పక్కా ప్లాన్ వేశారు.”ఓట్ల సవరణ ప్రక్రియలో ఎవరు నిర్లక్ష్యం వహించినా పార్టీకి భారీ నష్టం జరుగుతుంది. బాధ్యత గల నేతలు క్షేత్రస్థాయిలోనే ఉంటూ ఓటర్లకు అండగా నిలవాలి.” అంటూ ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరించిన నేపథ్యంలో పార్టీ అలర్ట్ అయింది.

పార్లమెంట్ వారీగా కో ఆర్డినేటర్లు..

Advertisement

=అదిలాబాద్ – కోల్కొండ సంతోష్
= పెద్దపల్లి –శశి భూషణ్ కాచే
=కరీంనగర్ – మద్దెల సంతోష్ కుమార్
=నిజామాబాద్ – బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి
=జహీరాబాద్ –జూలూరు ధనలక్ష్మి
=మెదక్ – వెన్నెల
=మల్కాజిగిరి –సుబ్రహ్మణ్య పొన్నాడ
=సికింద్రాబాద్ – ఎం. రాఘవేంద్ర రెడ్డి
=హైదరాబాద్ –అచ్యుత యాదవ్
=చేవెళ్ల –ఎస్. జగదీశ్వర్ రావు
=మహబూబ్నగర్ – టి. రేవతి గౌడ్
=నాగర్ కర్నూల్ – ఒబేదుల్లా కోత్వాల్
=నల్గొండ –కస్బా శ్రీనివాసరావు
=బోనగిరి – బైకినీ లింగం యాదవ్
=వరంగల్ – పీర్ ఇర్షద్ అహ్మద్ నాసిర్
=మహబూబాబాద్ –నూతి శ్రీకాంత్ గౌడ్
= ఖమ్మం – గోపిశెట్టి రాఘవేందర్.

Also read: అమరావతిలో హైటెన్షన్.. వైసీపీ నేతల పర్యటనలో తీవ్ర ఉద్రిక్తత.. రాళ్లు, కోడిగుడ్లతో దాడి!

Related News

తెలంగాణలో బీజేపీ నయా స్కెచ్.. అధికారం కోసం ఎంట్రీ ఇస్తున్న అగ్ర వ్యూహకర్త..?

ఖైదీలు విడుదలయ్యాక కూడా వదలని ఆఫీసర్లు.. ఫోన్ నెంబర్లు తీసుకుని మరీ..?

Hyderabad SIR: హైదరాబాద్ ఓటర్లకు బీఎల్ఓల షాకింగ్ న్యూస్.. ఆ తేదిలోపు ఇవ్వాల్సిందే..?

Crop Diversification: తెలంగాణ రైతులకు అలర్ట్.. వరి సాగుకు బ్రేక్.. ప్రభుత్వం సరికొత్త వ్యూహం!

హైదరాబాద్‌లో రోడ్డుకు ట్రంప్ పేరు.. స్పందించిన అమెరికా అధ్యక్షుడు.. ఏమన్నారంటే?

బండి సంజయ్ కొడుకు భగీరథ్.. మళ్లీ జైలుకు, ఈ సారి..

మాట నిలబెట్టుకున్న కాంగ్రెస్ సర్కార్.. ఆర్టీసీ హామీలపై మంత్రి పొన్నం కీలక ప్రకటన!

Big Stories

×