E-Paper
Advertisement

మేడ్చల్‌ జిల్లాలో తీవ్ర విషాదం.. రైలు ఢీకొని సుమారు 300 గొర్రెలు మృతి!

మేడ్చల్‌ జిల్లాలో తీవ్ర విషాదం..  రైలు ఢీకొని సుమారు 300 గొర్రెలు మృతి!
Advertisement

Train Accident: మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా పరిధిలో తెల్లవారుజామున ఒక తీవ్ర విషాదకర సంఘటన జరిగింది. కేవలం కొన్ని నిమిషాల వ్యవధిలోనే రైలు ఢీకొని సుమారు 300 గొర్రెలు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాయి. నిత్యం తమ జీవనాధారంగా నమ్ముకున్న మూగజీవాలు కళ్లముందే మృత్యువాత పడటంతో ఆ గొర్రెల కాపరులు తీవ్ర గుండెకోతకు గురయ్యారు.

అసలేం జరిగిందంటే?

Advertisement

ఘట్‌కేసర్‌ రైల్వేస్టేషన్ పరిధిలోని అషాపూర్‌ సమీపంలో ఉన్న కేఫాల్‌ వద్ద మంగళవారం తెల్లవారుజామున ఈ ప్రమాదం చోటుచేసుకుంది. సమాచారం ప్రకారం, కాజీపేట వైపు నుంచి వేగంగా హైదరాబాద్‌ వెళ్తున్న దక్షిణ్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు ఆ ప్రాంతం గుండా వెళ్తోంది. ఆ సమయంలో గొర్రెల కాపరులు రైల్వేట్రాక్‌కు కొద్దిపాటి దూరంలో నిద్రిస్తున్నారు. తెల్లవారుజామున అకస్మాత్తుగా వచ్చిన రైలు శబ్దానికి భయాందోళనకు గురైన గొర్రెలు ఒక్కసారిగా చెల్లాచెదురై ట్రాక్‌పైకి పరుగులు తీశాయి. వేగంగా వస్తున్న రైలు వాటిని బలంగా ఢీకొట్టడంతో క్షణాల్లో ఘోరం జరిగిపోయింది.

ఘటనాస్థలిలో విషాద ఛాయలు

Advertisement

ప్రమాద తీవ్రతకు సుమారు 300 గొర్రెలు అక్కడికక్కడే మృతిచెందాయి. సమాచారం అందుకున్న రైల్వే అధికారులు, పోలీసులు తక్షణమే ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. కాపరుల నుంచి వివరాలు సేకరిస్తూ తదుపరి చర్యలు చేపట్టారు. రెక్కాడితే గానీ డొక్కాడని తమకు, జీవితానికి ఆసరాగా నిలిచిన మూగజీవాలు ఇలా ఒకేసారి ప్రాణాలు కోల్పోవడంతో గొర్రెల కాపరులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఈ ఘటన ఆ ప్రాంతంలో ఉన్న వారందరినీ తీవ్రంగా కలచివేసింది.

Also Read: ఫార్ములా-ఈ కేసులో బిగ్ అప్‌డేట్.. కేటీఆర్ పాస్‌పోర్ట్ జప్తుకు ఏసీబీ పిటిషన్!

Tags

Related News

ఆటో డ్రైవర్లకు సర్కారు బంపర్ ఆఫర్.. రూ.220 కోట్లతో 2,000 ఫ్లాట్లు.. ఎక్కడెక్కడ కడుతున్నారంటే?

హెచ్‌ఐసీసీ భారత్ సమ్మిట్‌లో.. మంత్రి సీతక్క భావోద్వేగ ప్రసంగం!

జీహెచ్ఎంసీకి ఏమైంది? ఆదాయం లేకపోయినా ఆ రెండు కార్పొరేషన్ల భారం ఎందుకు?

విద్యుత్ శాఖలో మీటర్ బైపాస్ కుంభకోణం.. జోరుగా డబ్బులు వసూల్!

హరీష్ రావును ఓడించడం పెద్ద విషయం కాదు.. సిద్దిపేటలో జెండా ఎగురవేస్తాం!- కవిత సంచలన వ్యాఖ్యలు

వీసీ సజ్జనార్ విషయంలో ఏం జరిగింది? 14 నెలలకే బదిలీ ఎందుకు? పోలీసు శాఖలో తీవ్రమైన చర్చ

తీన్మార్ మల్లన్న కాన్వాయ్‌ని ఢీకొట్టిన లారీ.. తప్పిన పెను ముప్పు!

మోదీకి భజన చేసుకో.. అమిత్ షాకు పూజ చేసుకో..! కేటీఆర్‌పై ఆది శ్రీనివాస్ సెటైర్లు

Big Stories

Advertisement
×