Constables As Labours : పోలీసు శాఖలో కొందరు ఉన్నతాధికారుల వ్యవహార తీరు…. ఆ శాఖను అభాసుపాలు చేస్తోంది. ఇప్పటికీ కానిస్టేబుళ్లను, హోమ్ గార్డ్స్ ను తమ జీతగాళ్లలా చూస్తున్నారు. ఇష్టమొచ్చినట్లు పనులు చేయించుకుంటున్నారు. మహబూబ్ నగర్ లో ఇలాంటి పరిస్థితే వెలుగుచూసింది. పోలీసు శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన షెట్టర్ల నిర్మాణ పనుల కోసం …..ఏకంగా కానిస్టేబుళ్లను, హోమ్ గార్డులను ఉపయోగించారు.
రోజుకు పది నుంచి పదిహేను మంది పోలీసులను కూలీ పనుల కోసం వాడుతున్నారు. నిజానికి కాంట్రాక్టర్ కు అప్పగించినా…సిబ్బందితోనే పనులు చేయించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఉన్నతాధికారుల ఆదేశాల నేపథ్యంలోనే….ఇలా చేస్తున్నట్లుగా తెలిసింది. ఇదేంటని ప్రశ్నిస్తే…తమ ఉద్యోగం సాపీగా సాగాలంటే కూలీ పనులు తప్పవని పోలీసు సిబ్బంది ఆవేదన వెల్లగక్కుతున్నారు. తమ పొట్టకొట్టొద్దని బ్రతిమలాడుకుంటున్నారు.