Big Stories

CM KCR: సలహాదారులే కేసీఆర్ సైన్యమా? వారితో ఉపయోగమా?

cm kcr advisors

CM KCR Latest Updates: సీఎం కేసీఆర్‌ దగ్గర ఇప్పటికే నలుగురు పీఏలు, ముగ్గురు పీఆర్వోలు పని చేస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వానికి 10 మంది సలహాదారులు ఉన్నారు. ఇప్పుడు సోమేశ్ కుమార్.. కేసీఆర్‌కు ముఖ్య సలహాదారుగా నియమితులయ్యారు. మొత్తం సలహాలిచ్చే వారి సంఖ్య 12కు చేరింది.

- Advertisement -

రాజీవ్ శర్మ తెలంగాణ ప్రభుత్వానికి చీఫ్ అడ్వైజర్ గా ఉన్నారు. ఈయన తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక తొలి చీఫ్ సెక్రెటరీగా పని చేశారు. ఇప్పటికీ సర్కారుకు చీఫ్ అడ్వైజర్ గా కొనసాగుతున్నారు.

- Advertisement -

కేవి రమణాచారి సంస్కృతి, పర్యాటకం, దేవాదాయ శాఖల సలహాదారుగా ఉన్నారు. జీఆర్ రెడ్డి ఆర్థిక శాఖ సలహాదారు బాధ్యతలు చూస్తున్నారు. టంకశాల అశోక్ రాష్ట్ర వ్యవహారాల సలహాదారుగా ఉన్నారు. మైనార్టీల సంక్షేమ విషయాలపై అడ్వైజర్ గా ఏకే ఖాన్ పని చేస్తున్నారు. సుద్దాల సుధాకర్ తేజ ఆర్ అండ్ బీ, బిల్డింగ్ ఆర్కిటెక్చర్ విషయాల్లో సలహాదారుగా ఉన్నారు. రాజేంద్ర ప్రసాద్ సింగ్ ఎనర్జీ సెక్టార్ అడ్వైజర్ గా పని చేస్తున్నారు.

అనురాగ్ శర్మ హోం అఫైర్స్ సలహాదారుగా కొనసాగుతున్నారు. అనురాగ్ శర్మ తెలంగాణ రాష్ట్రంలో డీజీపీగా పని చేశారు. రిటైర్మెంట్ తర్వాత వెంటనే ఆయనను సలహాదారు పదవిలో నియమించుకున్నారు కేసీఆర్. ఇక రిటైర్డ్ ఐఏఎస్ శైలేంద్ర కుమార్ జోషి సాగునీటిపారుదల రంగం అడ్వైజర్ గా ఉన్నారు. అటు ఆర్.శోభ అటవీ శాఖ సలహాదారుగా ఉండగా, ఇ. శ్రీనివాసరావు హార్టికల్చర్ అడ్వైజర్ గా ఉన్నారు. ఇలా రకరకాల శాఖలకు వేర్వేరు సలహాదారులు ఉన్నారు. ఇప్పుడు మాజీ సీఎస్ సోమేశ్ కుమార్ కోసం కేబినెట్ హోదాతో ముఖ్య సలహాదారు పదవి కట్టబెట్టారు.

సలహాదారులు, పీఏలు, పీఎస్ లు, పీఆర్వోలను నియమించుకోవడం తప్పు కాదు కానీ నియమితులైన వ్యక్తుల చుట్టూ వివాదాలుంటే మాత్రం విపక్షాలు రియాక్ట్ అవుతుంటాయి. ఇప్పుడు తెలంగాణలో కూడా ఇదే జరుగుతోంది. ప్రస్తుతం సీఎం ముఖ్య సలహాదారుగా నియమితులైన సోమేశ్ కుమార్ ను కాంగ్రెస్, బీజేపీ నేతలు టార్గెట్ చేస్తూనే ఉన్నారు. సోమేశ్ కుమర్ సీఎస్ గా ఉన్న టైంలో చాలా కీలక నిర్ణయాలు జరిగాయని, తమ ప్రభుత్వాలు వచ్చాక వాటిపై కచ్చితంగా రివ్యూ ఉంటుందని హెచ్చరిస్తున్నాయి విపక్షాలు.

ఇటీవలే సంచలనం సృష్టించిన ఓఆర్‌ఆర్‌ లీజు వ్యవహారంలోనూ మాజీ సీఎస్ సోమేశ్ కుమార్ ప్రస్తావన చేశారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. మొత్తం సోమేశ్‌ కుమార్‌ కనుసన్నుల్లో ఈ లీజ్ డీల్ జరిగిందని, హెచ్‌ఎండీఏ కమిషనర్‌ అరవింద్‌ కుమార్‌ సంతకం పెట్టారని అంటున్నారు. ఈ నిర్ణయాన్ని కాంగ్రెస్‌ ఎట్టి పరిస్థితుల్లోనూ ఆమోదించబోదని తేల్చిచెప్పారు. ధరణి విషయంలోనూ సోమేశ్ కుమారే కీలకపాత్ర పోషించారు. ఇప్పుడు వాటిపై ప్రతిరోజూ ఏదో విమర్శ లేకుండా పని జరగడం లేదు. ఇప్పుడు విపక్షాలైతే.. తాము అధికారంలోకి వస్తే ధరణి రద్దు చేస్తామన్న హామీలు ఇస్తున్నాయంటే నిర్ణయాలు ఎలా వివాదాస్పదమయ్యాయో అర్థం చేసుకోవచ్చు.

కేసీఆర్ కు సోమేష్ కుమార్ పట్ల మక్కువతోనే చాన్నాళ్లు తెలంగాణలో ఉండేలా చేసుకున్నారని గతంలో ఆరోపించారు బీజేపీ నేత ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్. పదవి విరమణ పొందిన ఐఏఎస్, ఐపీఎస్ లను కేసీఆర్ సలహాదారుగా నియమించుకున్నారన్నారు. కేసీఆర్ తప్పిదాలను కప్పిపుచ్చుకునేందుకు ఐఏఎస్, ఐపీఎస్ ల సేవలను వాడుకుంటున్నారంటూ ఫైర్ అవుతున్నారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News