CPM: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో పేదల బతుకులను మర్చిపోయారని సీపీఎం పార్టీ రంగారెడ్డి జిల్లా కార్యదర్శి పగడాల యాదయ్య(Pagadala Yadiah) విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్కు వ్యతిరేకంగా సీపీఎం ఆధ్వర్యంలో ఇబ్రహీంపట్నంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ఆర్థిక శాఖామంత్రి నిర్మలా సీతారామన్(Nirmala Seetharaman) ప్రవేశపెట్టిన బడ్జెట్ పూర్తిగా ఉపయోగపడే విధంగా లేదని అన్నారు.
కేంద్ర ప్రభుత్వం వి.బి జి.రాంజి పథకానికి కేవలం రూ.93వేల కోట్లు కేటాయించి గతంతో పోలిస్తే కోత పెట్టారని తెలిపారు. వ్యవసాయ రంగానికి, ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనారిటీ వర్గాల సంక్షేమానికి నిధులు తగ్గించారని అన్నారు. దేశ కార్పొరేట్ సంస్థలైన ఆదానీ, అంబానీ తదితరులకు డేటా సెంటర్ల పేరుతో రాయితీలు ప్రకటిస్తున్నారని అన్నారు. సంక్షేమ పథకాలు, ఎరువుల రాయితీలు, చిన్న పరిశ్రమలకు ఎలాంటి రాయితీలు ప్రకటించలేదన్నారు. పాలమూరు, రంగారెడ్డి సాగునీటి ప్రాజెక్టులకు జాతీయ హెూదా యివ్వాలని కోరుతున్నా వాటి ఊసే లేదన్నారు. రాష్ట్రంలో 8మంది బిజేపి ఎంపీలు, మంత్రులు వున్నప్పకీ రాష్ట్రానికి రావాల్సిన నిధులు రాబట్టడంలో విఫలం అయ్యారు. కాబట్టి పూర్తిగా సామాజిక తరగతులను, శ్రామిక వర్గాల ప్రయోజనాలకు కేటాయింపులు చేయకుండా కార్పొరేట్ ప్రయోజనాలకే ఉపయోగపడే విధంగా మోడీ ప్రభుత్వం వ్యవహరిస్తున్నదని అన్నారు.
Also Read: Facepack: కేవలం యాభై రూపాయలతో ముఖాన్ని ఇలా మెరిపించేయండి, ఇదొక్కటి చాలు
రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై వత్తిడి తెచ్చి నిధులు రాబట్టడానికి కృషి చేయాలని అన్నారు. ఇప్పటికైనా కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ను సవరించి, ప్రజా ప్రయోజనాలకు, సామాజిక తరగతుల ప్రయోజనాలకు ఉపయోగపడే విధంగా కేటాయింపులు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బి. సామెలు, డి. రాంచందర్, డి. జగదీశ్, జి. కవిత, ఇ. నర్సింహా, జిల్లా కమిటీ సభ్యులు సి. హెచ్. బుగ్గరాములు, జె. రుద్ర కుమార్, డి. కిషన్, పి. జగన్, టౌన్ కార్యదర్శి సి. హెచ్. ఏల్లేష్, నాయకులు స్వప్న, పురుషోత్తం, తావు నాయక్, బోడ యాదగిరి, ఇ. వీరేష్, శపి ఉన్నిసా, తింక యాదగిరి, గుడేటి జంగయ్య తదితరులు పాల్గొన్నారు.