E-Paper
Advertisement

Maruti Suzuki Price Hike: కొనుగోలుదారులకు మారుతి సుజుకి షాక్, ధరల పెంపు తప్పదా?

Maruti Suzuki Price Hike: కొనుగోలుదారులకు మారుతి సుజుకి షాక్, ధరల పెంపు తప్పదా?
Advertisement

ఆటో మోబైల్ దిగ్గజం మారుతి సుజుకి కొనుగోలుదారులకు షాకివ్వబోతోంది. త్వరలో కార్లల ధరలను పేంచే అవకాశం ఉన్నట్లు ప్రకటించింది. పెరుగుతున్న ఇన్ ఫుట్స్ కారణంగా, ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. కంపెనీ గత కొంత కాలంగా తయారీ ఖర్చును భరించాల్సి వస్తుంది. తాజా బడ్జెట్ లో కేంద్రం నుంచి మంచి  ప్రోత్సాహకాలను పొందే అవకాశం ఉన్నట్లు భావించింది. కానీ, అనుకున్న స్థాయిలో ఆశాజనక కేటాయింపులు లేకపోవడం వల్ల ధరలు పెంచకతప్పని పరిస్థితి నెలకొంది. మారుతి సుజుకికి పెద్ద మొత్తంలో ఆర్డర్లు పెరుగుతూనే ఉన్నాయి. అందుకు అనుగుణంగా ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచడానికి కృషి చేస్తోంది.

ధరల పెరుగుదలపై కీలక ప్రకటన

ఇటీవలి GST రేటు తగ్గింపుల తర్వాత డిమాండ్ బలంగా ఉన్నప్పటికీ, ఇన్‌ పుట్ ఖర్చులు పెరగడంతో తన వాహనాల ధరల పెరుగుదలను సమీక్షిస్తున్నట్లు  మారుతి సుజుకి ఇండియా తాజాగా ప్రకటించింది.  పెరుగుతున్నఇన్ పుట్ వస్తువుల ధరలు పెరడగం, భౌగోళిక రాజకీయ అనిశ్చితి మధ్య పరిస్థితిని నిశితంగా పరిశీలించాలని సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్  పార్థో బెనర్జీ అన్నారు.  “మేము ప్రస్తుత పరిస్థితులను నిశితంగా గమనిస్తున్నామ. త్వరలో ధరల పెరుగుదలను సమీక్షిస్తాం” అన్నారు.

Advertisement

అటు “మార్కెట్ లీడర్‌గా ఉండటం వల్ల, ఖర్చు పెరుగుదల లేకుండా జాగ్రత్తలు తీసుకుంటాం. వీలైనంత వరకు వినియోగదారుల మీద భారం పడకుండా చూసుకునేందుకు ప్రయత్నిస్తాం. కొంత వరకు మేం ఖర్చులను భరించగలం. కానీ, పెద్ద మొత్తంలో భరించలేని పరిస్థితి నెలకొంది. కచ్చితంగా కొనుగోలుదారుల మీదకి బదిలీ చేయక తప్పని పరిస్థితి నెలకొంది. అందుకే, త్వరలో ధరల పెరుగుదల గురించి కీలక నిర్ణయం వెలువరిస్తాం” అన్నారు.

అటు ఉత్పత్తి పరిమితుల కారణంగా ఆలస్యంగా డెలివరీలు తీసుకుంటున్న కస్టమర్ల కోసం మారుతి సుజుకి జనవరిలో ప్రైజ్ ప్రొటెక్షన్ స్కీమ్ ను ప్రవేశపెట్టింది. “ఫోర్ వీలర్ విభాగానికి వస్తున్న మొదటిసారి కస్టమర్లను మేం గమనిస్తున్నాం. వారికి అప్‌గ్రేడ్ చేయడానికి అవకాశం ఇవ్వాలి. అందువల్ల, మేము ప్రైజ్ ప్రొటెక్షన్ స్కీమ్ ను తీసుకొచ్చాం. అందుకే, ధరల పెరుగుదల అనేది వారికి ఉండదు” అని బెనర్జీ చెప్పుకొచ్చారు.

పెండింగ్ లో 1.75 లక్షల ఆర్డర్లు

Advertisement

ప్రస్తుతం మారుతి సుజుకికి సంబంధించి 1.75 లక్షల ఆర్డర్లు పెండింగ్‌ లో ఉన్నాయి. కేవలం జనవరి 2026లో మాత్రమే 2.78 లక్షల బుకింగ్‌లు వచ్చాయి. అంటే రోజుకు 9,000–10,000 ఆర్డర్లు వస్తున్నయన్నారు. గత సంవత్సరం GST 2.0 సంస్కరణల కారణంగా ఈ సంస్థ మంచి ప్రయోజనం పొందింది. ఎంట్రీ లెవల్ మోడళ్లలో ధరలను తగ్గించింది. సెప్టెంబర్‌ 2025లో  S-ప్రెస్సో ధరలను రూ. 1.29 లక్షల వరకు, ఆల్టో K10 ధరలను రూ. 1.07 లక్షల వరకు, సెలెరియో ధరలను రూ. 94,100, వ్యాగన్R ధరలను రూ. 79,600 వరకు తగ్గించింది. ఇక  జనవరిలో మారుతి సుజుకి అత్యధికంగా 2,36,963 యూనిట్ల నెలవారీ అమ్మకాలను నమోదు చేయగా, ఎగుమతులు ఈ నెలలో రికార్డు స్థాయిలో 51,020 యూనిట్లను చేరుకున్నాయి. కంపెనీ కొత్తగా విడుదల చేసిన SUV VICTORIS ఐదు నెలల్లో 50,000 యూనిట్లను దాటింది.

Read Also: జనవరిలో దుమ్మురేపిన టాటా మోటర్స్, అమ్మో.. ఒకే నెలలో అన్ని కార్లు అమ్మిందా?

Related News

మినీ సైజ్.. మ్యాక్సిమమ్ స్టైల్.. ఈ మైక్రో ఈవీలు భారత్‌లోకి వస్తే సూపర్ హిట్ పక్కా!

25 ఏళ్ల క్రితమే భారత్ లో పరుగులు తీసిన ఎలక్ట్రిక్ కారు.. మళ్లీ మార్కెట్ లోకి వస్తుందా?

లాంచ్‌కు ముందే క్రేజీ డీటైల్స్ లీక్.. కొత్త బ్రెజ్జాలో ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే!

ఆగస్టు 15న మహీంద్రా బిగ్ బ్లాస్ట్.. 3 కొత్త SUVలు వచ్చేస్తున్నాయ్!

టీవీఎస్ నుంచి సూపర్ సర్‌ ప్రైజ్.. ఒకేసారి 3 మోడల్స్ వచ్చేస్తున్నాయ్!

కొత్త బ్రెజ్జా To హిలక్స్.. 10 రోజుల్లో 3 క్రేజీ మోడల్స్ ఎంట్రీ!

టెస్లా నుంచి పిల్లల కోసం కొత్త బైక్.. రేట్ ఎంత అంటే?

EV బ్యాటరీల్లో ఏది సేఫ్? కొనుగోలు చేసే ముందు ఈ విషయాలు తప్పకుండా తెలుసుకోవాల్సిందే!

Big Stories

Advertisement
×