E-Paper
Advertisement

దానం పిటిషన్‌పై సుప్రీంకోర్టు నిర్ణయం.. బుధవారం విచారణ, నిర్ణయం ఎటువైపు?

దానం పిటిషన్‌పై సుప్రీంకోర్టు నిర్ణయం.. బుధవారం విచారణ, నిర్ణయం ఎటువైపు?
Advertisement

Supreme Court: ఎట్టకేలకు ఎమ్మెల్యే దానం నాగేందర్ పిటిషన్‌పై స్పందించింది సుప్రీంకోర్టు. ఆ పిటిషన్‌ విచారణ బుధవారం న్యాయస్థానం ముందుకు రానుంది. దీంతో న్యాయస్థానం తీర్పు ఎలా ఉండనుంది? న్యాయస్థానం మరోసారి స్పీకర్‌కు ఈ అంశాన్ని పరిశీలించాలని అప్పగిస్తుందా? హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థిస్తుందా? ఇవే ప్రశ్నలు చాలామందిని వెంటాడుతున్నాయి.

దానం పిటిషన్‌పై సుప్రీంకోర్టు నిర్ణయం

తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర సంచలనం రేపుతోంది ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అనర్హత వ్యవహారం. హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టు తలుపు తట్టారు. దీంతో దానం పిటిషన్ సోమవారం ధర్మాసనం ముందుకొచ్చింది. దానం అనర్హత పిటిషన్‌పై సుప్రీంకోర్టులో మెన్షన్ చేశారు ఆయన తరపున న్యాయవాది ముకుల్ రోహిత్గి. ఈ సందర్భంగా న్యాయవాది న్యాయస్థానం దృష్టికి కొన్ని విషయాలు తీసుకొచ్చారు.

న్యాయస్థానం ముందు బుధవారం ఇరువర్గాల వాదనలు

Advertisement

స్పీకర్ తిరస్కరించిన పిటిషన్‌ను హైకోర్టు దానం నాగేందర్‌ను అనర్హుడిగా ప్రకటించిందని వివరించారు. ఈ పిటిషన్ అత్యవసరంగా విచారణ జరపకుంటే ఖైరతాబాద్ నియోజకవర్గానికి బైపోల్ వచ్చే అవకాశం ఉందని ప్రస్తావించారు. ఈ పిటిషన్‌పై ఇవాళ లేదా రేపు విచారణ చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. దానం తరఫు న్యాయవాది చేసిన విజ్ఞప్తిని ప్రతివాదులు వ్యతిరేకించారు. ఈ పిటిషన్ విషయంలో తమ వాదనలు పరిగణనలోకి తీసుకోవాలని కోరారు.

న్యాయస్థానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనని చర్చ

బీజేఎల్పీ ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి తరఫు న్యాయవాదులు జోక్యం చేసుకున్నారు. మా క్లయింట్లు ఇప్పటికే కేవియట్ దాఖలు చేశారని వివరించారు. ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించాలని విజ్ఞప్తి చేశారు. ఇరుపక్షాల వాదనలు విన్న సీజేఐ ధర్మాసనం, విచారణకు అనుమతించింది. బుధవారం విచారణ జరుపుతామని తేల్చిచెప్పింది. దీంతో దానం పిటిషన్‌పై బుధవారం ఇరుపక్షాలు తమ వాదనలను న్యాయస్థానం ముందు వినిపించనున్నారు.

Advertisement

ALSO READ: బడా నేతల భూ భాగోతం అవుట్.. రేవంత్ సర్కార్ సంచలన నిర్ణయం!

దానం పిటిషన్‌పై ఇరువర్గాల వాదనలు విన్న తర్వాత న్యాయస్థానం తీర్పు ఏ విధంగా ఉండనుంది? హైకోర్టు తీర్పును సమర్థిస్తుందా? దానం వ్యవహారాన్ని మరోసారి పరిశీలించాలని స్పీకర్‌కు సూచన చేస్తుందా? అదే జరిగితే ఈ వ్యవహారం మరో నెల రోజులు ఆలస్యమయ్యే అవకాశముందని అంటున్నారు. బుధవారం న్యాయస్థానంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. దానం తరపు సీనియర్ న్యాయవాది వాదించడంతో ఈ వ్యవహారం ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి.

Related News

శ్రీశైలం మార్గంలో ఘోర ప్రమాదం.. క్రూజర్ ఢీకొని ఇద్దరు యూపీ వాసులు మృతి!

బడా నేతల భూ భాగోతం అవుట్.. రేవంత్ సర్కార్ సంచలన నిర్ణయం!

మలక్‌పేటలో విషాదం.. యువతికి వీడియో కాల్ చేసి..  కానిస్టేబుల్ ఆత్మహత్య!

ఎర్రవెల్లి ఫామ్‌హౌస్ పరిసరాల్లో 388 ఎకరాల కబ్జాపై విచారణ జరపాలి: జనసేన

RTA లో అవినీతి దందా.. 9 ఏళ్లుగా ఒకే చోట తిష్ట!

పరీక్షల పేరుతో రక్తం పిండుతున్నారా? హుజూరాబాద్‌లో కార్మికుల శాంపిళ్ల సేకరణపై వివాదం!

తల లేదు, కాళ్లు లేవు… NTTPS కాలువలో కట్ చేసిన మొండం! అసలు ఎవరా మహిళ?

Big Stories

Advertisement
×