Royal Enfield 750cc Bikes: రాయల్ ఎన్‌ఫీల్డ్ అనగానే.. ఇప్పటి వరకు 350 సీసీ బైకులే గుర్తుక వస్తాయి. అయితే, కంపెనీ ఇప్పుడు ఆ ఇమేజ్‌ను మార్చుకునే ప్రయత్నం చేస్తోంది. ఇప్పటికే 450 సీసీ, 650 సీసీ విభాగాల్లో కొత్త మోడళ్లతో ప్రీమియం బైక్ మార్కెట్‌పై దృష్టి పెట్టిన సంస్థ.. ఇప్పుడు అదిరిపోయే ఇంజిన్ సామర్థ్యంతో బైక్‌లను తీసుకురావడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా 750 సీసీ ట్విన్ సిలిండర్ ఇంజిన్‌తో మూడు కొత్త మోడళ్లు వచ్చే అవకాశం ఉంది. అవేంటో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..
రాబోయే మోడళ్లలో హిమాలయన్ 750పై ఎక్కువ ఇంట్రెస్ట్ నెలకొంది. ఇప్పటికే ఈ బైక్‌కు సంబంధించిన టెస్ట్ ప్రోటోటైప్స్ రోడ్లపై కనిపించాయి. హిమాలయన్ 450 డిజైన్ కు దగ్గరగా కనిపించినప్పటికీ, కొత్త బైక్ పరిమాణంలో పెద్దదిగా ఉండే అవకాశం ఉంది. ఇందులో కొత్త 750 సీసీ ట్విన్ సిలిండర్ ఇంజిన్‌ను ఉపయోగించనున్నట్లు తెలుస్తోంది. హిమాలయన్ 450 కంటే ఎక్కువ పవర్, మెరుగైన హైవే పనితీరు కోరుకునే రైడర్లను ఆకట్టుకోనుంది. లాంగ్ ట్రావెల్ సస్పెన్షన్, పెద్ద ఫ్రంట్ వీల్, టూరింగ్‌కు అనువైన రైడింగ్ పొజిషన్ వంటి ఫీచర్లు ఇందులో ఉండే అవకాశం ఉంది.
750 సీసీ ప్లాట్‌ఫామ్‌పై రానున్న మరో ముఖ్యమైన మోడల్ కాంటినెంటల్ GT 750. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న GT 650కు ఇది పెద్ద వెర్షన్‌గా భావిస్తున్నారు. స్పై షాట్స్ ను పరిశీలిస్తే.. తక్కువ ఎత్తులో ఉండే రైడింగ్ పొజిషన్, వెనుకకు ఉండే ఫుట్‌పెగ్స్, కాంపాక్ట్ టెయిల్ డిజైన్ వంటి కేఫ్ రేసర్ ఫీచర్లు ఇందులో కనిపిస్తున్నాయి. అయితే, కొత్త ఇంజిన్ కారణంగా పనితీరు మరింత పెరగనుంది. GT 650 కంటే ఎక్కువ కెపాసిటీ, ప్రీమియం ఫీల్ కోరుకునే వారికి ఈ మోడల్ ఆకర్షణగా మారే అవకాశం ఉంది.
750 సీసీ ఇంజిన్ ఆధారంగా రాయల్ ఎన్‌ఫీల్డ్ మరో మోడల్‌ను కూడా అభివృద్ధి చేస్తున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన వివరాలు పెద్దగా బయటకు తెలియకపోయినా, టెస్ట్ మ్యూల్స్ ఆధారంగా చూస్తే.. కంపెనీ 750 సీసీ ఇంజిన్ ను ఒక్క మోడల్ కే పరిమితం చేయకుండా వివిధ బాడీ స్టైల్స్ లో ఉపయోగించే అవకాశం కనిపిస్తోంది. రాయల్ ఎన్‌ఫీల్డ్ కు ప్రత్యేకమైన క్లాసిక్ డిజైన్‌ను ఇష్టపడే వారికి 750 సీసీ క్లాసిక్ మంచి ఆప్షన్‌గా మారనుంది. ప్రస్తుతం ఉన్న 650 సీసీ బైక్‌ల కంటే ఎక్కువ సామర్థ్యాన్ని కోరుకునే కస్టమర్లను ఆకర్షించే అవకాశం ఉంది. ఈ మూడు బైక్‌లతో రాయల్ ఎన్‌ఫీల్డ్ ప్రీమియం మోటార్‌సైకిల్ లైనప్‌ను మరింత విస్తరించే అవకాశం ఉంది. అయితే, వీటి పేర్లు, ఇంజిన్ స్పెసిఫికేషన్లు, ధరలు, లాంచ్ తేదీలపై కంపెనీ నుంచి అధికారిక సమాచారం ఇంకా వెల్లడి కాలేదు.
Read Also: రూ.10 లక్షలు తగ్గిన MG సైబర్‌స్టర్.. ఇప్పుడు ఈ స్పోర్ట్స్ కారు ధర ఎంతంటే?