Decoy Drugs Operation: హైదరాబాద్‌లోని గచ్చిబౌలి ప్రాంతంలో గంజాయి వినియోగం, సరఫరాపై ఈగల్ టీమ్ డెకాయ్ ఆపరేషన్ చేసింది. ఈ ఆపరేషన్‌లో రెండు గంటల వ్యవధిలో 86 మంది గంజాయి వినియోగదారులు, సరఫరాదారులను అరెస్టు చేశారు. వాట్సప్ గ్రూప్ ద్వారా డ్రగ్స్ బిజినేస్ చేస్తున్న కేటుగాళ్ళ ఆట కట్టించారు.
ఈ ఆపరేషన్‌కు ముందు, మహారాష్ట్రకు చెందిన సందీప్ అనే గంజాయి సరఫరాదారుని ఈగల్ టీమ్ అరెస్టు చేసింది. అతని ఫోన్‌లోని కాంటాక్ట్ లిస్ట్ ఆధారంగా, పోలీసులు ఒక సమర్థవంతమైన పథకాన్ని రూపొందించారు. ‘భాయ్ బచ్చా ఆగయా భాయ్’ అనే వాట్సాప్ కోడ్‌ను ఉపయోగించి, గంజాయి సరఫరా అందుబాటులో ఉందని కస్టమర్లకు సందేశాలు పంపారు. గచ్చిబౌలిలోని ఒక నిర్దిష్ట స్థలం, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ సమీపంలో రావాలని సూచించారు. ఈ సందేశం పంపిన కొద్ది గంటల్లోనే 86 మంది వినియోగదారులు ఆ స్థలానికి చేరుకున్నారు, వారిని మఫ్టీలో ఉన్న ఈగల్ టీమ్ సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు.
అరెస్టు చేయబడిన వారిలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు, విద్యార్థులు, డెంటల్ టెక్నీషియన్లు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, మార్కెటింగ్ ఉద్యోగులు, హెచ్‌ఆర్ మేనేజర్లు ఉన్నారు, ఇది గంజాయి వినియోగం వివిధ సామాజిక వర్గాలలో వ్యాపించినట్లు సూచిస్తుంది. వృత్తిలో ఉన్నటువంటి ప్రతి ఒక్క డాక్టర్ కూడా అత్యున్నతమైన విద్యను చదివి ఈ వృద్దకి వస్తారు.. కానీ అలాంటి వారు కూడా ఇలాంటి మత్తు పదార్థాలకు అలవాటు పడటం కొంచెం బాధకరంగా ఉంది. అయితే ఒక ఆశ్చర్యకరమైన సంఘటనలో, ఒక జంట తమ నాలుగేళ్ల బిడ్డతో గంజాయి కొనుగోలు చేయడానికి వచ్చినట్లు తెలిసింది, ఇది పోలీసులను షాక్‌కు గురిచేసింది.
అరెస్టు చేయబడిన వారిని డీ-అడిక్షన్ సెంటర్లకు తరలించారు, వారికి చికిత్స అందించేందుకు చర్యలు తీసుకున్నారు. సందీప్ ఫోన్‌లోని ఇతర కాంటాక్ట్‌లను ట్రేస్ చేసి, ఈ డ్రగ్ నెట్‌వర్క్‌ను తెలంగాణకు పూర్తిగా నిర్మూలించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఈ తరహాలోనే కొద్దిరోజుల క్రితం గోవాలో కూడా ఈగల్ టీం కొన్ని సోదాలు చేసి హైదరాబాద్‌కు డ్రగ్స్ తీసుకువస్తున్నటువంటి సప్లయర్ బాలకృష్ణతో పాటు డిజేగా పనిచేస్తున్నటువంటి వణీష్ తక్కర్ అనే ఈ ఇద్దరిని కూడా అదుపులోకి తీసుకున్నారు. వీళ్లకి నైజిరియన్స్ ద్వారా డ్రగ్స్ సప్లయర్స్ చేస్తున్నారని సమాచారం తెలిపారు. అయితే సుమారుగా 50 మంది నైజిరియన్స్ గోవాలో డ్రగ్స్ సప్లే చేస్తున్నట్టుగా తెలిపారు. వాళ్లలో కీలకమైనటువంటి మ్యాక్స్ నెట్‌వర్క్‌లోని హావాల వ్యాపారులు ఉన్నటువంటి ఉత్తమ్‌సింగ్ రాజు, మహేందర్ ప్రజా ప్రతినిధులను కూడా అరెస్ట్ చేసి ఢిల్లి పోలీసులకు అప్పగించారు.
Also Read: ప్రత్తిపాడులో ముద్రగడ కూతురు ఎంట్రీ.. ఇక నుంచి సమరమే..!
అయితే డ్రగ్స్ సరఫరా ఎవరు లేనటువంటి నిర్మానూష ప్రదేశాల్లో జరిగేది. కానీ ఇప్పుడు మాత్రం బహిరంగంగా.. ప్రజలు ఎక్కువగా తిరిగే ప్రదేశాల్లోనే ఈ వ్యవస్థంతా నడుస్తుంది. దీనికి సంబంధించి ఈగల్ టీం స్పేషల్ ఫోకస్ పెట్టి ఎక్కడికక్కడ డ్రగ్స్ సరఫరా చేసేవారిని, డ్రగ్స్ కొనేవారిని వెంటనే అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తుంది. బహిరంగంగా ఇంత చేసేవారందరికి కూడా ఒక భయాన్ని తీసుకురావలని ఈగల్ టీం ప్రత్యేకంగా దృష్టిసారిస్తుంది.