Big TV Kissik Talks: కొన్ని సీరియల్స్ కి ఉన్న ఆదరణ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. అలా స్టార్ మా లో వచ్చిన బ్రహ్మముడి సీరియల్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. చాలామంది ఫ్యామిలీ ఆడియన్స్ ఆ సీరియల్ అంటే పడి చచ్చిపోతారు. ఆ సీరియల్ తో మంచి గుర్తింపు సాధించుకుంది దీపికా రంగరాజు. ఈ సీరియల్లో కావ్య అనే పాత్ర దీపికా రంగరాజుకి మంచి పేరుని తీసుకొచ్చింది.
దీపికా రంగరాజుని చూసిన వెంటనే కళ్ళల్లో వెలుగు పెదవులపై చిరునవ్వు కనిపిస్తూనే ఉంటాయి. కానీ సంతోషంగా కనిపించే ప్రతి జీవితం గనక ఎన్నో సంఘర్షణలు ఎదురవుతూ ఉంటాయి. ఎవరికీ తెలియని కష్టాలు ఉంటూనే ఉంటాయి. వీటన్నిటిని కూడా ప్రముఖ ఛానల్ బిగ్ టీవీ కిసిక్ టాక్స్ లో తెలిపింది దీపికా రంగరాజు. చాలా విషయాలను ఈ షోలో చర్చించింది. ముఖ్యంగా ఈ ప్రోమో మంచి సెన్సాఫ్ హ్యూమర్ కౌంటర్స్ తో మొదలై ఎమోషనల్ డైలాగ్ తో ఎండ్ అయింది.
రొమాన్స్ మొహమాటం లేదు
వర్ష హోస్ట్ గా చేస్తున్న కిసిక్ టాక్స్ ప్రోమో రీసెంట్ గానే విడుదలైంది. మొదట దీపికా కు కార్తీకదీపం సీరియల్ కి అవకాశం వచ్చింది. అయితే మేకప్ నల్లగా వేసుకోవాలి అని చెప్పినప్పుడు తను అవకాశాన్ని వద్దనుకుంది. అలానే హైదరాబాద్ వచ్చిన తర్వాత పెద్దమ్మతల్లి తనకు ఇష్టమైన దేవత అంటూ చెప్పుకొచ్చింది. అలానే బ్రహ్మముడి సీరియల్ హిట్ అవ్వాలి అనుకున్నాను కానీ అది ఊహించినంతగా హిట్ అయింది. ఆన్ స్క్రీన్ లో రొమాన్స్ సీన్ వస్తే ఏ హీరోతో చేస్తారు అని అడిగితే. ఏ హీరో ఇచ్చిన నేను ఆన్ స్క్రీన్ లో రొమాన్స్ చేస్తాను అంటూ తెలిపింది. కొన్నిసార్లు వాళ్లే వద్దు అని సిగ్గుపడతారు నాకైతే ఆన్ స్క్రీన్ రొమాన్స్ చేయడానికి అసలు మొహమాటమే ఉండదు. విజయ్ దేవరకొండ తో కిషన్ చేయమంటే రష్మిక గారిని మించి నేను చేస్తాను.
నాకు సొంత ఇల్లు కూడా లేదు
నాకు సొంత ఇల్లు కొనుక్కోవాలి అనే డ్రీమ్ ఉండేది. అని నాకు ఇప్పటివరకు సొంత ఇల్లు లేదు. మనం పుట్టినప్పుడే ఈ గవర్నమెంట్ మనకు ఇస్తుంది కదా సిక్స్ ఫీట్ గ్రేవీ యార్డ్. అలానే నాకు కేవలం ఆరడుగులు సమాధి చేసుకోవడానికి మాత్రమే స్థలం ఉంది అంటూ ఎమోషనల్ కి గురిచేసింది. ప్రస్తుతం దీపిక మాట్లాడిన ఈ మాటలు కళ్ళల్లో నీళ్లు తిరిగేలా చేస్తున్నాయి. ప్రస్తుతం ఈ వీడియోకు విపరీతమైన రెస్పాన్స్ వస్తుంది. చాలామంది కామెంట్స్ లో దీపికను ప్రశంసిస్తున్నారు. దీపిక క్యారెక్టర్ కు ఫిదా అయిపోతున్నారు.