Bhatti Vikramarka: డిసెంబర్ 9న తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు కానుంది. బీఆర్ఎస్ నేతల విమర్శలకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన చాలా అద్భుతంగా కొనసాగుతోందని.. అది ఓర్వలేక బీఆర్ఎస్ ప్రభుత్వం ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారని విమర్శించారు. ఉద్యోగులకు జీతాలు ఇచ్చే పరిస్థితి లేకుండా గత ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థను చిన్నా భిన్నం చేసిందని మండి పడ్డారు. ప్రజలపై భారం వేయకుండా ఆర్థిక శాఖను ముందుకు కొనసాగిస్తున్నాం అన్నారు. ప్రపంచ వాతావరణం వల్ల గ్రీన్ ఎనర్జీ పై తెలంగాణ ప్రభుత్వం దృష్టి పెట్టిందని.. త్వరలోనే కొత్త విద్యుత్ పాలసీ తీసుకురాబోతునాం అని భట్టి విక్రమార్క అన్నారు.
గత ప్రభుత్వం విద్యుత్ శాఖలో తీసుకున్న నిర్ణయాల వల్ల ఆర్థిక ఇబ్బందులు పడుతున్నాం అని తీవ్రంగా మండిపడ్డారు. ఒక్క యాద్రాద్రి భద్రాద్రి పవర్ ప్లాంట్ల వద్ద గత ప్రభుత్వం నిర్ణయాల వల్ల ప్రతి ఏటా 170 కోట్లకు పైగా భారం పడిందన్నారు. కొంతమంది స్వార్థం వల్ల విద్యుత్ రంగంలో ఆర్థిక భారం పడుతుందని భట్టి అన్నారు. ఛత్తీస్ ఘడ్ ఒప్పందాల వల్ల 630 ఆర్థిక భారం ప్రభుత్వం పై పడుతుందన్నారు. గత ప్రభుత్వం చేసిన తప్పిదాలను సరిచేసి యాదద్రిలో 800 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అనుసంధానం చేయబోతున్నాం అని అన్నారు.
Also Read: కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కబ్జా చిట్టా ఇదిగో.. మోసం చేసిందెవరు?
గత ప్రభుత్వం తప్పుడు నిర్ణయాల వల్ల విద్యుత్ డిస్కంల పై దాదాపుగా 10వేల కోట్ల భారం పడుతుందని విమర్శలు గుప్పించారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా 24 గంటల కరెంటు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తున్నామన్నారు. 50లక్షల కుటుంబాలకు ఉచిత విద్యుత్ అందిస్తున్నాం. భవిష్యత్తులో అన్ని రకాల విద్యుత్ ఉత్పత్తి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని భరోసా ఇచ్చారు. రాష్ట్రంలో కరెంట్ కోతలు లేకుండా చర్యలు తీసుకున్నామని. అన్ని రంగాలతో కూడిన విజన్ డాక్యుమెంట్ ప్లానింగ్ డిపార్ట్మెంట్ తయారు చేస్తోందన్నారు. ఈ సందర్బంగా 1.28 కోట్ల దరఖాస్తులు ప్రజా పాలనలో వచ్చాయని ఆనందం వ్యక్తం చేశారు.