Khairatabad Ganesh: తెలంగాణలో వినాయక చవితి ఉత్సవాలు చివరి దశకు చేరుకున్నాయి. శనివారం వినాయకుడి నిమజ్జనానికి అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. గురువారం అర్థరాత్రి వరకు ఖైరతాబాద్ గణేశుడి దర్శనానికి భక్తులకు అనుమతి ఇచ్చారు నిర్వాహకులు. ఆ తర్వాత దర్శనం ఉండదని నిర్వాహకులు పదేపదే చెబుతున్నారు.
ఖైరతాబాద్ గణేషుడ్ని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలి వస్తున్నారు. బుధవారం వరకు 12 లక్షల మంది భక్తులు దర్శించుకున్నట్లు నిర్వాహకులు తెలిపారు. గురువారం ఈ సంఖ్య పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఎందుకంటే నిమజ్జన ఏర్పాట్లను అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.
దీన్ని దృష్టిలో పెట్టుకుని గురువారం అర్ధరాత్రి వరకు ఖైరతాబాద్ గణనాథుడి దర్శించుకునే అవకాశం కల్పించారు. ఆ తర్వాత వినాయకుడి దర్శనాలకు బ్రేక్ పడనుంది. ఈ నేపథ్యంలో గురువారం భారీగా భక్తులు వచ్చే అవకాశముంది.భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు లేకుండా భారీగా పోలీసులు మొహరించారు. శనివారం ఖైరతాబాద్ గణేషుడి నిమజ్జనం జరగనుంది.
మండపం తొలగింపు పనుల పూర్తి చేయడం కోసం అర్థరాత్రి నుంచి దర్శనాలు నిలిపి వేస్తున్నట్టు ఉత్సవ కమిటీ తెలిపింది. శుక్రవారం తెల్లవారుజాము నుంచి శోభాయాత్రకు సంబంధించిన పనులు జరగనున్నాయి. గణేష్ దర్శనం కోసం భక్తులు భారీగా తరలివస్తున్నారు. ఈ క్రమంలో లక్డీకాపూల్, ట్యాంక్‌బండ్, సచివాలయం మార్గాల్లో ట్రాఫిక్ జామ్ అయ్యింది.
ALSO READ: పరమ అధ్వాన్నంగా రహదారులు, రోడ్డుపై గుంతల వద్ద యువకుడి నిరసన
భాగ్యనగరంలో గణేషుడి మహా శోభాయాత్రకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు. తొలుత బాలాపూర్ వినాయకుడు బయలుదేరిన తర్వాత నగరంలోని అన్ని ప్రాంతాల గణేషులు బయలుదేరనున్నారు. దీనికి సంబంధించి రూట్ మ్యాప్ రెడీ చేశారు అధికారులు.
బాలాపూర్ గణేశుడి నుంచి కట్టమైసమ్మ మీదుగా కేశవగిరి, చాంద్రాయణగుట్ట క్రాస్ రోడ్, చార్మినార్, అఫ్జల్‌గంజ్, ఎంజే మార్కెట్, అబిడ్స్, లిబర్టీ, అంబేడ్కర్ విగ్రహం మీదుగా ట్యాంక్‌బండ్ రానుంది. ఇక ఖైరతాబాద్ గణేశుడి నిమజ్జన యాత్ర రూటు మ్యాప్ రెడీ చేశారు.
ఖైరతాబాద్ మొదలు సైఫాబాద్ ఓల్డ్ పీఎస్, ఇక్బాల్ మినార్ మీదుగా తెలుగుతల్లి ఫ్లైఓవర్, అంబేడ్కర్ విగ్రహం, ట్యాంక్ బండ్‌కు చేరుకోనుంది. హైదరాబాద్ సిటీలో గణేశ్ నిమజ్జనానికి ఏర్పాట్లు పూర్తి చేశారు. అందుకోసం 20 ప్రధాన చెరువులు, 72 కృత్రిమ కొలనులను సిద్ధం చేశారు.
ప్రధాన చెరువుల వద్ద 259 మొబైల్ క్రేన్లు, 56 వేల లైట్లు ఏర్పాటు చేశారు. ఇక హుస్సేన్ సాగర్ వద్ద బోట్లు, డీఆర్ఎఫ్ బృందాలు, గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచారు. నిమజ్జనం విజయవంతంగా నిర్వహించేందుకు పోలీసులు, జీహెచ్‌ఎంసీ, రెవెన్యూ, ఆర్ అండ్ బీ, హెచ్‌ఎండీఏ విభాగాలకు చెందిన అధికారులు పాల్గొంటున్నారు. బందోబస్తుకు 30 వేల మంది పోలీసులు ఉండనున్నారు.
ఖైరతాబాద్ గణేశుడి దర్శనానికి ఈరోజు చివరి రోజు..
అర్థరాత్రి 12 గంటల వరకూ భక్తులకు అనుమతి
ఇప్పటికే గణపయ్యను దర్శించుకున్న దాదాపు 30 లక్షల మంది భక్తులు
ఈరోజు అర్థరాత్రి 12 గంటల తర్వాత మహా గణపతికి కలశ పూజ
ఈ నెల 6న శోభాయాత్ర, నిమజ్జనం
బడా గణపతి నిమజ్జనం కోసం శంషాబాద్ నుంచి భారీ… pic.twitter.com/bjfeMS3Oea
— BIG TV Breaking News (@bigtvtelugu) September 4, 2025