Karimnagar News: తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పదేళ్లు పూర్తయినప్పటికీ.. పలు చోట్ల ప్రధాన రహదారులు అస్తవ్యస్తంగా ఉన్నాయి. కరీంనగర్ – జగిత్యాల ప్రధాన రహదారి కొంచెం వర్షం పడితే చాలు అధ్వాన్నంగా తయారువుతోంది. చాలా రోజుల నుంచి వాహనదారులు, స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. అధికారులకు, స్థానిక ఎమ్మెల్యేకు విన్నవించినా సమస్యకు పరిష్కారం మాత్రం దొరకలేదు.
తాజాగా ఓ వ్యక్తి రోడ్డు పై కూర్చొని వినూత్నంగా నిరసన తెలిపాడు. సామాజిక ఉద్యమకారుడు కోట శ్యామ్ కుమార్ తాను రోడ్ఢుపై ప్రయాణించేటపుడు హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించకపోయినా అన్నింటికి ఫైన్ పే చేస్తున్నానని ఫ్లకార్డు పట్టుకుని నిరసన తెలిపాడు.
రోడ్లే సరిగ్గా లేవు మరి తనకు ఎంత ఫైన్ కడుతారంటూ కరీంనగర్ – జగిత్యాల ప్రధాన రహాదారి పై గుంతల వద్ద కూర్చొని అధికారులపై ప్రశ్నల వర్షం కురిపించాడు.
ALSO READ: LIC HFL: డిగ్రీ అర్హతతో అప్రెంటీస్ పోస్టులు.. నెలకు రూ.12,000 స్టైఫండ్, దరఖాస్తుకు చివరితేది ఇదే..
కరీంనగర్ జిల్లా కేంద్రానికి చెందిన కొట శ్యామ్ కుమార్ తరుచూ సామాజిక సమస్యలపై వినూత్నమైన నిరసనలు తెలుపుతుంటారు. ఇటీవల కరీంనగర్ లో కురిసిన భారీ వర్షాలకు కరీంనగర్ జగిత్యాల ప్రధాన రహాదారి గుంతమయం అయ్యింది. ఆ రోడ్డు పై ప్రయాణించాలంటేనే జనాలు ఎక్కడ, ఏ గుంతలో పడిపోతామని వణికిపోతున్నారు. కొట శ్యామ్ కుమార్ ఈరోజు గుంతల వద్ద కూర్చోని నేను రొడ్డుపై ప్రయాణం చేసేటప్పుడు హెల్మెట్ లేకపోయినా, సీటు బెల్ట్ ధరించకపొయినా నేను ఫైన్ కడుతున్నాను.. మరి రోడ్లు బాగాలేవు నేను ప్రయాణం చేస్తే నాకు ఎంత ఫైన్ కడుతారంటూ ఫ్లకార్డు ధరించి వినూత్నమైన నిరసన తెలిపారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
ALSO READ: Vizag Development: రుషికొండ బిల్డింగ్ వర్సెస్ విశాఖ గాజు వంతెన.. ఏది గొప్ప? ఎందులో గొప్ప?