E-Paper
Advertisement

Hyderabad Fire Accident: క్రాకర్స్ షాపులో అగ్నిప్రమాదం.. ఎగిసిపడుతున్న మంటలు.. శ్రమిస్తున్న ఫైర్ సిబ్బంది

Hyderabad Fire Accident: క్రాకర్స్ షాపులో అగ్నిప్రమాదం.. ఎగిసిపడుతున్న మంటలు.. శ్రమిస్తున్న ఫైర్ సిబ్బంది
Advertisement

Hyderabad Fire Accident: సమయం రాత్రి వేళ 9.00 గంటలు కావస్తోంది. అందరూ దుకాణాలు మూసివేసే క్రమంలో ఉన్నారు. ఒక్కసారిగా ఢాం.. ఢాం.. ఢాం అంటూ శబ్దాలు. దీనితో ఏమి జరుగుతుందో తెలియని దిక్కుతోచని స్థితిలో అక్కడి ప్రజలు భయాందోళన గురయ్యారు. చివరికి అసలు విషయం తెలుసుకున్న ప్రజలు అక్కడి నుండి పరుగులు తీశారు.

దీపావళి పండుగ రాబోతుంది. అందుకే టపాసుల వ్యాపారం నిర్వహించే వ్యాపారస్తులు ఇప్పటికే టపాసులను విక్రయించేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో హైదరాబాదులోని అబిడ్స్ పరిధిలో గల బొగ్గులకుంట వద్ద కూడా ఓ టపాసుల దుకాణం ఏర్పాటు చేయగా, షాక్ సర్క్యూట్ కారణంగా భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఒక్కసారిగా దట్టమైన పొగలు, నిప్పురవ్వలు ఎగిసిపడడంతో స్థానికులు భయాందోళన చెందారు.

Advertisement

హైదరాబాదులోని బొగ్గులకుంటలో దీపావళి పర్వదినానికి పురస్కరించుకొని, మయూర్ పాన్ షాప్ సమీపంలో పారస్ క్రాకర్స్ దుకాణాన్ని నిర్వాహకులు ఏర్పాటు చేశారు. దీపావళి సమీపించిన సమయంలో భారీగా బాణసంచాలను విక్రయించేందుకు అంతా సిద్ధం కూడా చేశారు. అంతలోనే ఆదివారం రాత్రి ఒక్కసారిగా ఢాం.. ఢాం.. అంటూ భీకర శబ్దం షాపులో నుండి స్థానికులకు వినిపించింది. స్థానికులు అప్రమత్తమయ్యే క్రమంలోనే షాపులోని బాణసంచాలు ఒక్కసారిగా పేలాయి. దీనితో ఆ ప్రాంతం మొత్తం దట్టమైన పొగ కమ్ముకోగా, భీకర శబ్దాలు, నిప్పు రవ్వలతో భయానకంగా మారింది.

Also Read: Janvada Farm House Case: ఎట్టకేలకు రేవ్ పార్టీపై స్పందించిన కేటీఆర్.. నేనక్కడ లేను.. బిగ్ టీవీపై అక్కసు

Advertisement

ఈ మంటల ధాటికి పక్కనే గల తాజ్ టిఫిన్ సెంటర్ కు సైతం మంటలు వ్యాపించాయి. టిఫిన్ సెంటర్లో గల ఇరువురు మహిళలు దట్టమైన పొగలు, శబ్దకాలుష్యం ధాటికి అస్వస్థతకు గురికాగా, వెంటనే వారిని వైద్యశాలకు తరలించారు. అయితే స్థానికులు వెంటనే ఫైర్స్ సిబ్బందికి సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. షాపులో గల బాణసంచా సామాగ్రి మొత్తం ఒక్కసారిగా పేలడంతో, మంటలను అదుపు చేయడం ఫైర్ సిబ్బందికి కష్టతరంగా మారింది. అయితే ఈ అగ్ని ప్రమాదానికి కారణం షార్ట్ సర్క్యూట్ అంటూ ఫైర్ సిబ్బంది తెలిపారు. ఇప్పటికే 5 ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపు చేస్తున్న సిబ్బంది, స్థానికులను అప్రమత్తం చేసి అక్కడి నుండి పంపించి వేశారు.

దీపావళి పర్వదినం రాకమునుపే బొగ్గులకుంట పరిధిలోగల స్థానికులకు అగ్నిప్రమాదం రూపంలో టపాసుల మోత మోగింది. పోలీసులు సైతం ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేసే చర్యలలో పాల్గొంటూ, స్థానికులను అప్రమత్తం చేశారు. కాగా ఈ అగ్ని ప్రమాదంలో ఎంత మేరకు ఆర్థిక నష్టం వాటిల్లిందో తెలియాల్సి ఉంది.

Related News

నో స్ట్రెస్… ఓన్లీ ఫ్రెష్! సైబరాబాద్‌లో ప్రారంభం కానున్న వర్క్ ఫ్రమ్ పార్కులు

ఉద్యోగుల నిర్బంధ పదవీ విరమణపై సుప్రీం కోర్టు సంచలన తీర్పు!

సైబరాబాద్‌లో నీళ్ల వేస్ట్ చేస్తే భవనాల నిర్మాణాలు బంద్! సీఎంసీ కమిషనర్ వార్నింగ్

రాహుల్ గాంధీ గారూ.. ఈ దోపిడీకి కొత్త పదం ఏమైనా ఉందా? – KTR వ్యంగ్యాస్త్రాలు

ORRపై ఘోర ప్రమాదం.. లారీని ఢీకొట్టిన ఆటో, ముగ్గురు దుర్మరణం!

తెలంగాణ బీజేపీ చీఫ్ మార్పు వార్తల్లో నిజమెంత? క్లారిటీ ఇచ్చేసిన కీలక నేతలు!

తెలంగాణ వైద్యరంగంలో బిగ్ అప్‌డేట్.. ఒకేసారి 359 పీజీ సీట్లకు NMC గ్రీన్ సిగ్నల్!

రాహుల్‌ గాంధీకి నల్ల జెండాల నిరసన తప్పదు: రాంచందర్ రావు

Big Stories

Advertisement
×