E-Paper
Advertisement

మరో సంచలన రికార్డును సొంతం చేసుకున్న తెలంగాణ సర్కార్..?

మరో సంచలన రికార్డును సొంతం చేసుకున్న తెలంగాణ సర్కార్..?
Advertisement

GST Telangana: స్వేచ్ఛ బ్యూరో: తెలంగాణ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ అద్భుతమైన వృద్ధితో దూసుకుపోతోంది. ఏప్రిల్ 2026 నెలలో రాష్ట్ర జీఎస్టీ వసూళ్లు గతంలో ఎన్నడూ లేని విధంగా అత్యధిక స్థాయికి చేరుకుని సరికొత్త రికార్డును సృష్టించాయి. రాష్ట్ర ఆర్థికగమనం,మెరుగుపడిన పన్ను చెల్లింపుల విధానం ఈ విజయానికి ప్రధాన కారణాలని వాణిజ్య పన్నుల శాఖ వెల్లడించింది. ఏప్రిల్ 2026లో రాష్ట్రానికి వచ్చిన జీఎస్టీ ఆదాయం రూ. 4,621 కోట్లు కాగా,జీఎస్టీ ప్రారంభమైనప్పటి నుండి ఒక నెలలో నమోదైన అత్యధిక వసూళ్లు ఇవే కావడం గమనార్హం.ఏప్రిల్ 2025లో నమోదైన రూ. 3,433 కోట్లతో పోలిస్తే, ఈ ఏడాది 35 శాతం వృద్ధి నమోదైంది. అంటే గత ఏడాది కంటే రూ. 1,188 కోట్లు అదనంగా ఆదాయం సమకూరింది.

నాలుగు నెలల నుంచి..

గత నాలుగు నెలలుగా తెలంగాణ జీఎస్టీ ఆదాయం నిరంతరాయంగా రూ.4 వేల కోట్ల మార్కును దాటుతూ వస్తోంది. మొదటిసారిగా జనవరి 2026లో ఈ మార్కును దాటగా, మార్చి 2026లో నమోదైన రూ. 4,231 కోట్లే ఇప్పటివరకు అత్యుత్తమ వసూళ్లుగా ఉండేవి. కానీ ఏప్రిల్ ఊహించని స్థాయిలో రికార్డ్ సృష్టించింది.

Advertisement

Also Read: నా పెళ్ళాం నిప్పు రా.. వైరల్ అవుతున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పోస్ట్!

దేశం లోనే సెకండ్ ప్లేస్..

వాణిజ్య పన్నుల శాఖ సేకరించిన మొత్తం ఆదాయం (జీఎస్టీతో పాటు పెట్రోల్, మద్యంపై వ్యాట్ , వృత్తి పన్ను కలిపి) రూ. 7,570 కోట్లుగా నమోదైంది. ఇది గత 2025 ఏప్రిల్ నెల రూ. 6,210 కోట్లు తో పోలిస్తే 22 శాతం వృద్ధిని సూచిస్తుంది. ఇక ​జాతీయ స్థాయిలో పరిశీలిస్తే.. తెలంగాణ రాష్ట్రం నుండి వసూలైన మొత్తం జీఎస్టీ రూ. 7,181 కోట్లు గా నమోదు అయింది..ఇందులో సీ జీ ఎస్టీ రూ. 2,092 కోట్లు, ఎస్ జీ ఎస్టీ రూ. 2,527 కోట్లు, ఐ జీ ఎస్టీ రూ. 2,562 కోట్లుగా రికార్డు అయింది..​తెలంగాణ రాష్ట్రం 12.6 శాతం వృద్ధి రేటుతో, దేశంలోనే కర్ణాటక (14.5 శాతం) తర్వాత రెండవ అత్యధిక వృద్ధి సాధించిన రాష్ట్రంగా నిలిచింది.

వృద్ధికి ప్రధాన కారణాలు ఇవే

Advertisement

..​రాష్ట్రంలో నెలకొన్న వ్యాపార అనుకూల వాతావరణం వల్ల కొత్త పెట్టుబడులు రావడం, తద్వారా ఉపాధి అవకాశాలు పెరిగి వినియోగం పెరగడం వంటివి ఈ ఆర్థిక బలానికి పునాదిగా నిలిచాయి. పారదర్శకమైన పన్ను చెల్లింపుదారులకు అనుకూలమైన వాతావరణాన్ని అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని అధికారులు వెల్లడించారు. రాబోయే రోజుల్లో ఈ మార్కును మరింత పెంచేందుకు చొరవ తీసుకుంటామని కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ స్పష్టం చేసింది.

Also read: రాళ్ల‌తో కొట్టి చంపండి..! అద‌ప్పుడు కేసీఆర్ స్ట్రాట‌జీ.. ఇప్పుడు క‌విత నోటి వెంటా అవే..!

Related News

భార్య ప్రైవేట్ వీడియో భర్తకే పంపి.. తోటి ఆఫీసర్‌పై ఐపీఎస్ ట్రైనీ లైంగిక వేధింపులు!

Jawaharnagar: ప్లాట్ల పేరుతో భారీ మోసం.. డబ్బులతో రాత్రికి రాత్రే పరార్..!

బండి, ఈటల రాజీపడితే రాజ్యం వచ్చేస్తుందా? బీజేపీపై రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు!

చంద్రబాబు, నితీష్ మద్దతుతోనే మోడీ ప్రధాని.. విదేశాల్లో ఫోజులు తప్ప ఏం లేదు- కాంగ్రెస్ ఎంపీ!

JNTUH Inspections: మేడ్చల్‌లో హైటెన్షన్.. మల్లారెడ్డి, సీఎంఆర్ కాలేజీల్లో జేఎన్‌టీయూహెచ్ దాడులు!

El Niño Telangana: బిగ్ అలర్ట్.. తెలంగాణలో ఎన్నడూ లేని కరువు గండం..!

Transfers: అటవీ శాఖ ఉద్యోగులకు బిగ్ షాక్.. ఇటీవల జరిగిన బదిలీలు రద్దు!

Telangana PCC: ఢిల్లీని షేక్ చేస్తున్న తెలంగాణ.. టీపీసీసీకి రాహుల్ గాంధీ సీక్రెట్ టాస్క్..?

Big Stories

Advertisement
×