Weather News: ఈసారి రెండు తెలుగు రాష్ట్రాల్లో వాతావరణంలో వింత మార్పులు చోటుచేసుకుంటున్నాయి. వర్షాలు పడాల్సిన సమయంలో పడడం లేదు. ముందస్తుగా వర్షాలు పడడంతో రైతులు సంతోషం వ్యక్తం చేశారు. తీరా చూస్తే.. ప్రస్తుతం ఏపీ, తెలంగాణాల్లో వర్షాలే పడడం లేదు. ఈసారి నైరుతి రుతుపవనాలు చాలా ముందుగానే వచ్చాయి. కొంచెం ముందుగానే వర్షాలు దంచికొట్టడంతో.. మే నెల చివరలోనే రైతులు వ్యవసాయ పనుల్లో బిజీబిజీ అయిపోయారు. రైతులు నార్లు కూడా పోశారు. పత్తి గింజలు పెట్టినారు. ఇలా నచ్చిన పంటలు వేసుకుంటూ రైతన్నలు తమ పనుల్లో బిజీ అయిపోయారు. ఇలా రైతులు వ్యవసాయ పనుల్లో ఇలా నిమగ్నమయ్యారు. ఇంతలోనే గత పది రోజుల నుంచి మళ్లీ ఎండలు దంచికొడుతున్నాయి. దీంతో రైతులు కాస్త ఆందోళనకు గురవుతున్నారు. పత్తి గింజలు పెట్టి రెండు వారాలు గడుస్తున్నా.. మళ్లీ వర్షాలు లేక వరుణ దేవుడి వైపు చూడాల్సిన పరిస్థితి నెలకొంది. మొదట్లో వర్షాలు దంచికొట్టాయని.. ఇప్పుడేమో ఎండలు కొడుతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ALSO READ: ఈ మొక్క ఉంటే పాములు ఇంట్లోకి రావు..
ఈ క్రమంలోనే తెలంగాణ రాష్ట్ర రైతులకు హైదరాబాద్ వాతావరణ శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో ఈ నెల 19 వరకు విస్తారంగా వర్షాలు పడుతాయని తెలిపింది. ఉరుములు, మెరుపులతో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని పేర్కొంది. దక్షిణ బంగ్లాను ఆనుకుని ఉత్తర బంగాళఖాతం ప్రాంతంపై ఉన్న ఆవర్తనం ప్రస్తుతం పరిసర ప్రాంతాలు, సగటు సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల వరకు విస్తరించి ఉందని.. తెలిపింది. మరాఠ్వాడ ప్రాంతం మీదుగా ఉపరితల ఆవర్తనం నుంచి తెలంగాణ మీదుగా కోస్తాంధ్ర వరకు సముద్రమట్టానికి 3 కిలోమీటర్ల ఎత్తులో ద్రోణి ఉందని పేర్కింది.
ALSO READ: BIG BREAKING: కుప్పకూలిన వంతెన.. ఆరుగురు మృతి, 25 మంది గల్లంతు
ఈ క్రమంలోనే మేడ్చల్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. రేపు రాష్ట్ర వ్యాప్తంగా తేలికపాటి నుంచి భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉందని చెప్పారు. ఇక ఎల్లుండి ఆదిలాబాద్, కొమురంభీం, మంచిర్యాల పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, ఖమ్మం, వరంగల్, హన్మకొండ, భద్రాద్రి, మహబూబాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉందని పేర్కొన్నారు. బుధవారం రోజును ఉమ్మడి ఆదిలాబాద్, ఉమ్మడి కరీంనగర్, ఉమ్మడి వరంగల్, నిజామాబాద్, సూర్యాపేట, ఖమ్మం జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉంది. గురువారం ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, నల్గొండ, సిద్దిపేట, భువనగిరి జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్ ఉంది. ఈ జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులు పడే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
ALSO READ: రీల్స్ పిచ్చికి అమ్మాయిని.. గుర్రం తంతే.. వీడియో వైరల్
భారీ వర్షాల నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు చెబుతున్నారు. పొలాల వద్ద ఉన్నప్పుడు చెట్ల కింద నిలబడొద్దని సూచిస్తున్నారు. చెట్ల మీద పిడుగులు పడే అవకాశం ఎక్కువగా ఉందని పేర్కొన్నారు. రాబోయే ఈ రెండు రోజులు అత్యవసరం అయితే తప్ప పొలాల వద్దకు రైతులు వెళ్లొద్దని అధికారులు సూచించారు.