E-Paper
Advertisement

Farm House Case : ఎమ్మెల్యేలకు ఎర కేసు..సుప్రీంకోర్టు ఉత్తర్వులు ఎక్కడని హైకోర్టు ప్రశ్న..

Farm House Case : ఎమ్మెల్యేలకు ఎర కేసు..సుప్రీంకోర్టు ఉత్తర్వులు ఎక్కడని హైకోర్టు ప్రశ్న..
Advertisement

Farm House Case : ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సిట్ నోటీసులపై తెలంగాణ హైకోర్టు విచారణ చేపట్టింది. సుప్రీంకోర్టు ఉత్తర్వులు ఎక్కడని ప్రభుత్వాన్ని హైకోర్టు ధర్మాసనం ప్రశ్నించింది. బీఎల్ సంతోష్‌కు ఈనెల 16 నుంచి నోటీసులు ఇచ్చేందుకు ప్రయత్నించినట్లు అడ్వకేట్ జనరల్ ప్రసాద్ హైకోర్టుకు తెలిపారు. ఢిల్లీ పోలీసుల సాయంతో బీజేపీ ఆఫీసులో నోటీసులు అందించినట్లు వివరించారు. బీఎల్ సంతోష్ సిట్ ముందుకు వస్తే అసలు వాస్తవాలు తెలుస్తాయని హైకోర్టుకు వివరించారు. సిట్ విచారణ పారదర్శకంగా జరుగుతోందన్నారు.


సిట్ విచారణకు నిందితులు సహకరించడం లేదని అడ్వకేట్ జనరల్ కోర్టుకు దృష్టికి తీసుకెళ్లారు. ఈ కేసులో ఇంకా ఆధారాలు సేకరించాల్సిన అవసరం ఉందని ఏజీ అభిప్రాయపడ్డారు. నిందితులు బయట ఉంటే సాక్ష్యాలను తారు మారు చేసే అవకాశం ఉందని కోర్టుకు తెలిపారు. ఏజీ వాదనలపై స్పందించిన ధర్మాసనం…బీఎల్ సంతోష్ విచారణకు ఎందుకు హాజరుకావడం లేదని ప్రశ్నించింది.

Advertisement

బీఎల్ సంతోష్ చట్టాన్ని ఎక్కడా ధిక్కరించలేదని పిటిషనర్ తరఫు న్యాయవాది రామచంద్రరావు హైకోర్టుకు తెలిపారు. బీఎల్ సంతోష్ 41 సీఆర్‌పీసీని సవాల్ చేయాలనుకుంటున్నారా అని ఉన్నత న్యాయస్థానం ప్రశ్నించింది. సిట్ ముందు హాజరయ్యేందుకు బీఎల్ సంతోష్ గడువు కోరుతున్నారా? అని అడిగింది. బీఎల్ సంతోష్ సిట్‌కు లేఖ రాశారని రామచంద్రరావు హైకోర్టుకు తెలిపారు. విచారణకు ఎందుకు హాజరు కాలేకపోతున్నారో లేఖలోనే చెప్పారని వివరించారు.

ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు.. సుప్రీంకోర్టు ఉత్తర్వులు చూశాకే విచారణ జరుపుతామని స్పష్టం చేసింది.

    Related News

    Karthika Deepam 2 Serial Today Episode September 11th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ చెంప పగుల గొట్టిన జ్యోత్స్న       

    నా జీవితంలోకి వచ్చిన వ్యక్తికి ఆస్కార్ ఇవ్వొచ్చు.. జయం రవి భార్య పోస్ట్ వైరల్!

    Karthika Deepam 2 Serial Today Episode September 9th ‘కార్తీకదీపం2’ సీరియల్‌: రాజీ కోసం కార్తీక్ దగ్గరకు వెళ్లిన దక్షిణమూర్తి 

    ఇంద్రకీలాద్రి ట్రస్ట్ బోర్డ్ లో కీలక బాధ్యత… కృతజ్ఞతలు తెలిపిన సుస్మిత కొణిదెల !

    భర్తను అడ్డంగా బుక్ చేసిన యూట్యూబర్ నందు? విచారణలో కీలక విషయాలు వెల్లడి

    Karthika Deepam 2 Serial Today Episode September 8th ‘కార్తీకదీపం 2’ సీరియల్‌: శివనారాయణ ఇంటికి వెళ్లిపోయిన సూరజ్  

    Nindu Noorella Saavasam Serial Today Episode September 7th‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మిస్సమ్మను చంపేందుకు సాగర్ కి బయలుదేరిన మను

    Ninnu kori Serial Today Episode September 7th ‘నిన్నుకోరి’ సీరియల్‌: ఇంట్లో నిజం చెప్పిన విరాట్ 

    Big Stories

    Advertisement
    ×