Hyderabad News: ఉచిత బస్సులు ఏమోగానీ ఈ మధ్యకాలంలో ఆర్టీసీ ఉద్యోగులపై ప్రయాణికులు దాడులు చేస్తున్న ఘటనలు క్రమంగా పెరుగుతున్నాయి. తాజాగా హైదరాబాద్ సిటీలో అలాంటి ఘటన ఒకటి చోటు చేసుకుంది. మహిళా కండక్టర్‌పై ప్రయాణికులు ఏకంగా దాడికి దిగింది. దీనికి సంబంధించి వీడియో వైరల్ అయ్యింది. అసలేం జరిగింది? ఇంకాస్త లోతుల్లోకి వెళ్తే..
హైదరాబాద్ సిటిలో ఫలక్‌నుమా నుండి సికింద్రాబాద్ సిటీ బస్సు మహిళా కండక్టర్‌పై దాడి చేసింది ఓ ప్రయాణికురాలు. బస్సు ఎక్కిన ఆ ప్రయాణికులురాలు తనకు అనుకూలమైన ప్రాంతంలో బస్సు ఆపాలని డ్రైవర్‌నును కోరింది. తాము ఎక్కడ పడితే అక్కడ ఆపమని డ్రైవర్‌తోపాటు మహిళా కండక్టర్ చెప్పారు.
కోపానికి గురైన పాసింజర్ బూతులు తిట్టింది. కండక్టర్-ప్రయాణికులు మధ్య మాటా మాటా చోటు చేసుకుంది. చివరకు పట్టరాని కోపంతో కండక్టర్‌పై దాడికి దిగింది. ఏకంగా ఆమె పీక పట్టుకుంది పాసింజర్. ఈ తతంగం చాలాసేపు జరిగింది. ఇద్దరు మహిళలు కావడంతో చుట్టుపక్కల వారు జోక్యం చేసుకునేందుకు ముందుకు రాలేకపోయారు.
అదే సమయంలో ఓ వ్యక్తి కండక్టర్-ప్రయాణికురాలి మధ్య వాగ్వాదానికి తన ఫోన్ లో చిత్రీకరించి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశాడు. ఇప్పుడు ఆ వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. ఇదేకాదు నాలుగురోజుల కిందట ఏపీలోని అనంతపురం జిల్లాలో ఇలాంటి ఘటన జరిగింది. బస్సు ఆపలేదని మహిళా పాసింజర్.. డ్రైవర్‌ని చెంపపై కొట్టింది.
ALSO READ: మరో నాలుగు రోజులు భారీ వర్షాలు.. ఈ జిల్లాలకు తస్మాత్ జాగ్రత్త
అంతకుమందు తెలంగాణలో కొన్ని ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. ఇలాంటి దాడులను గమనించిన ఆర్టీసీ యాజమాన్యం విధుల్లో ఉన్నవారిపై దాడి చేయడం చట్ట రీత్యా నేరమని, వారిపై తగిన చర్యలు తీసుకుంటామని తాటికాయంత అక్షరాలతో ఆర్టీసీ బస్సుల్లో బోర్డులు పెట్టారు. ఈ ఘటన నేపథ్యంలో ప్రయాణికురాలిపై ఆర్టీసీ ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి.
మహిళా బస్సు కండక్టర్‌పై ఓ మహిళా ప్రయాణికురాలు దాడికి పాల్పడింది. ఫలక్‌నుమా నుంచి సికింద్రాబాద్ వెళ్తున్న బస్సులో ఈ ఘటన జరిగింది. ఎక్కడపడితే అక్కడ బస్సును ఆపమని సదరు మహిళతో కండక్టర్ చెప్పడంతోనే గొడవ మొదలైనట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోన మహిళా కండక్టర్ గొంతు పట్టుకుని ప్రయాణికురాలు… pic.twitter.com/56IbD9Rqtv
— ChotaNews App (@ChotaNewsApp) August 14, 2025