E-Paper
Advertisement

CMR Fire Accident: ఉప్పల్ CMR షాపింగ్ మాల్ లో భారీ అగ్నిప్రమాదం.. ప్రాణనష్టం ?

CMR Fire Accident: ఉప్పల్ CMR షాపింగ్ మాల్ లో భారీ అగ్నిప్రమాదం.. ప్రాణనష్టం ?
Advertisement

CMR Fire Accident: హైదరాబాద్ లోని ఉప్పల్ ప్రాంతంలో మెయిన్ రోడ్ ను ఆనుకుని ఉన్న CMR షాపింగ్ మాల్ లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. మంగళవారం రాత్రి సమయంలో నాలుగంతస్తుల భవనంలోని ముందు భాగంలో మంటలు చెలరేగాయి. అవి క్రమంగా అన్ని అంతస్తులకు వ్యాపించడంతో.. భవనం మొత్తం అగ్నికీలల్లో చిక్కుకుంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని 3 గంటలపాటు 5 ఫైరింజన్లతో మంటల్ని అదుపు చేశారు.

భవనమంతా మంటల్లో కాలిపోవడంతో.. పైకప్పు సీలింగ్ కుప్పకూలింది. కాగా.. ఈ ఘటనకు కొద్దిసేపటి ముందే షాపింగ్ మాల్ లో పనిచేసే సిబ్బంది.. విధులు ముగించుకుని షాపింగ్ మాల్ ను మూసివేసి వెళ్లిపోయారు. సిబ్బంది ఉండగానే ప్రమాదం జరిగి ఉంటే భారీగా ప్రాణనష్టం జరిగేదని స్థానికులు తెలిపారు. క్లాత్ షాపింగ్ మాల్ కావడంతో నష్టం భారీగా జరిగి ఉంటుందని పోలీసులు అంచనా వేశారు.

Advertisement

కాగా.. ఘటనా ప్రాంతాన్ని ఎల్బీనగర్ డీసీపీ సాయిశ్రీ, ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి పరిశీలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణమా ? లేదా మరేదైనా కారణం ఉందా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×