Big Stories

pm modi : మళ్లీ ఫ్లెక్సీ ఫైట్.. మోదీకి నో ఎంట్రీ..

pm modi : బ్లాక్ కలర్ ఫ్లెక్సీలు. అందులో మోదీ సీరియస్ ఫోటోలు. మోదీకి నో ఎంట్రీ అంటూ.. పెద్ద పెద్ద అక్షరాలు. తెలంగాణలో మోదీకి ప్రవేశం లేదు, చేనేతపై 5శాతం జీఎస్టీని రద్దు చేయాలి.. అంటూ నినాదాలు. హైదరాబాద్, కరీంనగర్, రామగుండంలో ఇప్పుడు ఈ ఫ్లెక్సీలు కలకలం రేపుతున్నాయి.

- Advertisement -

ఈమధ్య తెలంగాణలో ఫ్లెక్సీ వార్ జోరుగా సాగుతోంది. బీజేపీ అగ్రనేతలు హైదరాబాద్ వచ్చినప్పుడల్లా.. కేంద్రాన్ని నిలదీస్తు నగరమంతా పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు వెలుస్తున్నాయి. ప్రధాని మోదీనే టార్గెట్ గా.. ఆయన తెలంగాణకు తీవ్ర అన్యాయం చేస్తున్నారనేలా.. ఫ్లెక్సీలతో నిరసన తెలుపుతున్నారు. ఇలా ఫ్లెక్సీ వార్ ట్రెండ్ నడుస్తోందిప్పుడు. తెలంగాణ ప్రజల పేరుతో ఈ ఫ్లెక్సీలు కడుతున్నా.. అవి కట్టించేది ఎవరో అందరికీ తెలుసు.

- Advertisement -

ప్రధాని మోదీ రామగుండం పర్యటన సందర్భంగా మళ్లీ ఫ్లెక్సీ ఫైట్ స్టార్ట్ అయింది. ఈనెల 12న హైదరాబాద్ వచ్చి.. రామగుండం వెళ్లి.. ఎరువుల కర్మాగారం ప్రారంభించనున్నారు మోదీ. అనంతరం అక్కడే బహిరంగ సభలో మాట్లాడతారు. ఇదీ షెడ్యూల్.

ఇంకేం.. మళ్లీ ఛాన్స్ వచ్చిందనుకుంటూ.. మోదీ పర్యటించే ప్రాంతాల్లో రాత్రికి రాత్రే నల్ల బ్యానర్లు వెలిశాయి. మోదీకి తెలంగాణలో నో ఎంట్రీ అంటూ హైదరాబాద్ లో పలుచోట్ల భారీ ఫ్లెక్సీలు వెలిశాయి. చేనేత ఉత్పత్తులపై జీఎస్టీ రద్దు చేయాలంటూ.. తెలంగాణ చేనేత యూత్ ఫోర్స్ పేరుతో కరీంనగర్, రామగుండంలో బ్యానర్లు కట్టడంతో రాజకీయ వేడి రాజుకుంటోంది.

మరోవైపు, సింగరేణి కార్మికులు సైతం నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన చేపట్టారు. సింగరేణిని ప్రైవేట్ పరం చేయడాన్నినిరసిస్తూ.. మోదీ గో బ్యాక్ అంటూ కార్మికులు ఆందోళన చేస్తున్నారు.

ఇక, గతంలోనే ప్రారంభించిన రామగుండం ఎరువుల కర్మాగారాన్ని.. మళ్లీ మోదీ జాతికి అంకితం చేయడం ఏంటంటూ.. ప్రధాని ప్రోగ్రామ్ ను టీఆర్ఎస్ శ్రేణులు ఎద్దేవా చేస్తున్నాయి. ఫాంహౌజ్ కేసు, మునుగోడు ఫలితం తర్వాత తెలంగాణలో జరుగుతున్న మోదీ పర్యటనపై పొలిటికల్ అటెన్షన్ నెలకొంది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News