E-Paper
Advertisement

Farmhouse Case: సిట్ ఎంక్వైరీ షురూ.. తీగ లాగుతున్నారు..

Farmhouse Case: సిట్ ఎంక్వైరీ షురూ.. తీగ లాగుతున్నారు..
Advertisement

Farmhouse Case: ఫాంహౌజ్ ఎమ్మెల్యేల ట్రాప్ కేసులో సిట్ యాక్షన్ స్టార్ట్ చేసింది. ఏసీబీ కోర్టులో పోలీసులు కస్టడీ పిటిషన్ వేయగా.. అందుకు న్యాయమూర్తి అనుమతించారు. దీంతో ముగ్గురు నిందితులు రామచంద్రభారతి, సింహయాజి, నందకుమార్ లను చంచల్ గూడ జైలు నుంచి కస్టడీకి తీసుకొని.. టైట్ సెక్యూరిటీతో రాజేంద్రనగర్ పీఎస్ కు తరలించారు. అక్కడ సిట్ బృందం వారిని ప్రశ్నిస్తోంది.

ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 వరకు.. నిందితుల విచారణకు కోర్టు అనుమతి ఇచ్చింది. నిందితుల తరఫు న్యాయవాదుల సమక్షంలో విచారణ కొనసాగనుంది. నిందితుల స్టేట్‌మెంట్‌ను వీడియో రికార్డు కూడా చేస్తున్నారు. మరోవైపు, రామచంద్రభారతి దగ్గర నకిలీ ఆధార్‌, పాన్‌ కార్డు, డ్రైవింగ్‌ లైసెన్సు ఉన్నాయంటూ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ఇచ్చిన కంప్లైట్ మేరకు మరో కేసు కూడా నమోదవగా.. దానిపైనా సిట్ దర్యాప్తు చేసే అవకాశం ఉంది.

Advertisement

ఫాంహౌజ్ కేసును తెలంగాణ ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. ఫాంహౌజ్ వీడియోలను జాతీయ స్థాయికి తీసుకెళ్లారు సీఎం కేసీఆర్. నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు 4+4 సెక్యూరిటీ కల్పించారు. కేసు విచారణకు సిట్ ఏర్పాటు చేశారు. వెంటనే రంగంలోకి దిగిన సిట్.. ఆ ముగ్గురు నిందితులను కస్టడీకి తీసుకొని.. లోతుగా ప్రశ్నిస్తోంది.

వారి వెనుక ఎవరున్నారు? ఎవరు పంపిస్తే వచ్చారు? ఎమ్మెల్యేలకు ఇస్తానన్న డబ్బు ఎక్కడిది? ఆ డబ్బు ఎవరు అరేంజ్ చేస్తారు? ఇలా పూర్తి వివరాలు రాబట్టనున్నారు. ఫాంహౌజ్ వీడియోలో అమిత్ షా, బీఎల్ సంతోష్, తుషార్ ల పేర్లు ప్రముఖంగా వినిపించడంతో.. ఆ అంశంపై స్పెషల్ ఫోకస్ పెట్టనుంది సిట్.

Related News

నా జీవితంలోకి వచ్చిన వ్యక్తికి ఆస్కార్ ఇవ్వొచ్చు.. జయం రవి భార్య పోస్ట్ వైరల్!

Karthika Deepam 2 Serial Today Episode September 9th ‘కార్తీకదీపం2’ సీరియల్‌: రాజీ కోసం కార్తీక్ దగ్గరకు వెళ్లిన దక్షిణమూర్తి 

ఇంద్రకీలాద్రి ట్రస్ట్ బోర్డ్ లో కీలక బాధ్యత… కృతజ్ఞతలు తెలిపిన సుస్మిత కొణిదెల !

భర్తను అడ్డంగా బుక్ చేసిన యూట్యూబర్ నందు? విచారణలో కీలక విషయాలు వెల్లడి

Karthika Deepam 2 Serial Today Episode September 8th ‘కార్తీకదీపం 2’ సీరియల్‌: శివనారాయణ ఇంటికి వెళ్లిపోయిన సూరజ్  

Nindu Noorella Saavasam Serial Today Episode September 7th‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మిస్సమ్మను చంపేందుకు సాగర్ కి బయలుదేరిన మను

Ninnu kori Serial Today Episode September 7th ‘నిన్నుకోరి’ సీరియల్‌: ఇంట్లో నిజం చెప్పిన విరాట్ 

Karthika Deepam 2 Serial Today Episode September 5th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌:  సూరజ్ ను అనుమానించిన మాలిని         

Big Stories

Advertisement
×