Hyderabad News: విద్యార్థులపై ఇన్‌స్టిట్యూట్ నిర్వాహకులు దాడులకు పాల్పడుతున్న ఘటనలు కలకలం రేపుతున్నాయి. తాజాగా హైదరాబాద్‌లో అలాంటి ఘటన వెలుగుచూసింది. ఇంటర్ విద్యార్థిపై ఫ్లోర్ ఇన్‌చార్జి దాడి చేశాడు. ఈ ఘటనలో విద్యార్థి దవడ ఎముక విరిగింది. దీనిపై విద్యార్థి పేరెంట్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలేం జరిగింది? ఇంకాస్త డీటేల్స్‌లోకి వెళ్తే..
హైదరాబాద్ సిటీలోని గడ్డి అన్నారం ప్రాంతంలో నారాయణ జూనియర్ కాలేజీలో దారుణమైన ఘటన జరిగింది. ఈనెల 15న మధ్యాహ్నం మూడు గంటల సమయంలో కాలేజ్ ఇద్దరు విద్యార్థుల మధ్య చిన్న వివాదం చోటు చేసుకుంది. చివరకు చినికి చినికి గాలివానగా మారింది. విద్యార్థుల మధ్య ఆర్గ్యుమెంట్ జరుగుతున్న సమయంలో ఫ్లోర్ ఇన్‌ఛార్జ్ సతీష్ జోక్యం చేసుకున్నాడు. చివరకు విద్యార్థులను చితకబాదాడు.
ఈ దాడిలో విద్యార్థి సాయి పునీత్ దవడ ఎముక విరిగింది. ఈ విషయం తెలియగానే విద్యార్థి తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. చదువు కోసం పంపిస్తే.. తమ కొడుకు ఎముకులు విరిగేలా కొడతారా అంటూ మండిపడ్డారు. దీనిపై మలక్‌పేట పోలీసులకు బాధిత విద్యార్థి కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు.
నారాయణ కాలేజ్ ఫ్లోర్ ఇన్‌ఛార్జి సతీష్‌పై కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై విద్యార్థి తల్లిదండ్రులు నోరు విప్పారు. మా కుమారుడు సాయి పునీత్ దవడ ఎముక విరిగిందని తెలిపారు. ప్రస్తుతం తిండి తినలేని పరిస్థితి ఏర్పడిందని కన్నీరు మున్నీరుఅయ్యారు. ,ఈ దాడికి పాల్పడిన ఫ్లోర్ ఇంచార్జి సతీష్, నారాయణ కాలేజ్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని కోరారు.
ALSO READ: భారీగా నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ పట్టివేత
ఈ ఘటనకు సంబంధించి సీసీటీవీ ఫుటేజ్ వెలుగులోకి వచ్చింది. విద్యార్థుల మధ్య చిన్నపాటి వాగ్వాదం జరుగుతున్నట్లు ఆ వీడియోలో కనిపించింది. తప్పు ఎవరిదన్న విషయం కాసేపు పక్కనబెడితే.. ఈలోగా ఇన్‌ఛార్జ్ సతీష్ అక్కడ విద్యార్థులను బలవంతంగా నెట్టేసినట్టు తెలుస్తోంది.
కరెక్టుగా మధ్యాహ్నం 3.17 నిమిషాలను ఈ ఘటన జరిగినట్టు తెలుస్తోంది. తప్పు ఎవరి చేసినా విద్యార్థులను మందలించాల్సి పోయి ఏకంగా ఎముక విరిగేలా కొట్టడం క్షమించరాని నేరమని అంటున్నారు. దీనిపై సోషల్ మీడియాలో నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.
ఇంటర్ విద్యార్థిపై ఫ్లోర్ ఇన్‌ఛార్జ్ దాడి.. విరిగిన దవడ ఎముక..
గడ్డి అన్నారం నారాయణ జూ.కాలేజీలో ఘటన
విద్యార్థి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు నారాయణ కాలేజీ ఫ్లోర్ ఇన్‌ఛార్జ్ మాలి సతీష్ పై కేసు నమోదు చేసిన మలక్ పేట పోలీసులు
ఈ నెల 15వ తేదీ మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఇద్దరు విద్యార్థుల… pic.twitter.com/FXxltvxQDA
— BIG TV Breaking News (@bigtvtelugu) September 18, 2025